ఒక్క షేర్ ధర లక్ష రూపాయలు - .

ఒక్క షేర్ ధర లక్ష రూపాయలు

టైర్ల తయారీ దిగ్గజం MRF (మద్రాస్‌ రబ్బర్‌ ఫ్యాక్టరీ) లిమిటెడ్‌ సరికొత్త చరిత్ర సృష్టించింది. జూన్ 13, 2023 న ఇంట్రాడే ట్రేడింగ్‌లో ఈ కంపెనీ షేరు ధర రూ.లక్ష మైలురాయిని దాటింది. దేశీయ స్టాక్‌ మార్కెట్లో లక్ష విలువైన తొలి, ఏకైక షేరుగా రికార్డు నమోదు చేసుకుంది.

రూ.10 ముఖ విలువ కలిగిన ఎంఆర్ఎఫ్‌ షేర్లు మొత్తం 42,41,143 ఉండగా.. అందులో 72.16 శాతం వాటాకు సమానమైన 30,60,312 షేర్లు పబ్లిక్‌ షేర్‌హోల్డర్ల (FII,DII, రిటైల్‌ ఇన్వెస్టర్లు) చేతుల్లో ఉన్నాయి. ఇక 27.84 శాతం వాటాకు సమానమైన 11,80,831 షేర్లు ప్రమోటర్ల చేతుల్లో ఉన్నాయి. కాబట్టి, మిగతా బడా కంపెనీలతో పోలిస్తే, రోజువారీగా మార్కెట్లో ట్రేడయ్యే ఎంఆర్ఎఫ్‌ షేర్ల సంఖ్య కూడా తక్కువే. అంతేకాదు, అత్యంత ఖరీదైన షేరు కావడంతో రిటైల్‌ ఇన్వెస్టర్ల చేతుల్లో ఉన్న షేర్లు కూడా చాలా తక్కువే.