రెండు గుండెల చప్పుడు...... - సాయి... స్వర్ణ

Rendu gundela chappudu

రెండు గుండెల చప్పుడు.. ఆ రెండు గుండెల చప్పుడు ఒక్కటే.... అవును... వివాహ బంధం తో ఒక్కటి అయ్యే స్త్రీ... పురుషులు.. రేపటి తరాన్ని సృష్టించిన అందమైన రెండు గుండెల చప్పుడు అది.... తనకి అన్నీ అందివ్వాలి అని కలిపి కొట్టుకొనే రెండు గుండెల చప్పుడు... తనకి అన్నీ నేర్పాలనే ఆత్రుత తో కలిసి కొట్టుకునే రెండు గుండెల చప్పుడు.... తనకి ఆనందాన్ని మాత్రమే చూపించాలని ఆశపడి కలిపి కొట్టుకొనే రెండు గుండెల చప్పుడు.... తన స్వేచ్చ కి భంగం రాకూడదని కోరుకునే రెండు గుండెల చప్పుడు... తన కాళ్ళ మీద తాను నిలబడేందుకు తోడ్పాటు అందించే రెండు గుండెల చప్పుడు... తన కీర్తి..... శిఖరాలను చేరుకోవాలని తాపత్రయ పడే రెండు గుండెల చప్పుడు... తన ప్రేమ తమకే సొంతం కావాలని ఆశించే రెండు గుండెల చప్పుడు... తన కంట కన్నీరు రాకుండదని దేవున్ని కోరుకునే రెండు గుండెల చప్పుడు... తన ఆయురారోగ్యాల కోసం ప్రార్థన చేసే రెండు గుండెల చప్పుడు... మొత్తం గా తమ గుండెల నిండుగా....తననే పెట్టుకునే రెండు గుండెల చప్పుడు అది.... తన ప్రాణాలు నిలుస్తాయి అంటే....తమ రెండు గుండెల చప్పుడు... ఆగిపోయే చప్పుడు అది..... ఆ రెండు గుండెలలో ఒకటి తల్లిది... మరొకటి తండ్రిది..... నిజం.... ఇది ఆ రెండు గుండెల చప్పుడు ఒక్కటే... మీ సాయి... స్వర్ణ

మరిన్ని వ్యాసాలు

Pempakam lo premarahityam
పెంపకంలో ప్రేమరాహిత్యం
- సి.హెచ్.ప్రతాప్
The tree woman of India
ది ట్రీ ఉమెన్ ఆఫ్ ఇండియా
- రాము కోలా. దెందుకూరు
గుల్ గుంబజ్7 .
గుల్ గుంబజ్ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
విక్టోరియా మెమోరియల్
విక్టోరియా మెమోరియల్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు