నకుల సహదేవులు - ambadipudi syamasundar rao

నకుల సహదేవులు

మహాభారత ఇతిహాసములో పాండవులలో ధర్మరాజు, భీముడు, అర్జునుడు గురించి వారి పరాక్రమాల గురించి చెప్పినన్ని కధలు నకుల సహదేవులు గురించి అంతగా ఉండవు జనబాహుళ్యానికి వీరి గురించి అంతగా తెలియదు వీరిద్దరూ పాండురాజు రెండవ భార్య అయినా మాద్రి సంతానంగా మాత్రమే తెలుసు పాండు రాజు శాపవశాన భార్యలతో సంయోగించడానికి నిరోధింపబడినందున అతని కోరికపై, కుంతి తెలిపిన మంత్రాన్ని అనుష్టించి మాద్రి అశ్వనీ దేవతలచే నకుల సహదేవులను కన్నది ఆ తర్వాత విరాట పర్వములో కొంత ఉంటుంది వీరిద్దరూ కూడా కురుక్షేత్రములో వీరోచితముగా పోరాడి చాల మంది కౌరవ యోధులను మట్టు వెట్టినవారే. వీరి గురించి ఇంకాస్త వివరముగా తెలుసుకొనే ప్రయత్నమూ చేద్దాము.
నకులుడు :- పాండవులలో నాల్గవ వాడు నకులుడు.పాండురాజు రెండవ భార్య మాద్రికి దూర్వాసముని మంత్ర ప్రభావము చేత అశ్వని దేవతలా అంశగా పుట్టినవాడు నకులుడు.నకులుడు అంటే వంశములో చాల అందముగా మన్మధుడివలె ఉండేవాడని అర్థం. అంటే కాకుండా కత్తి యుద్దములో మంచి ప్రావీణ్యము ఉన్నవాడు గుర్రాల పాలన పోషణలో మంచి ప్రావీణ్యం ఉంది కాబట్టే పాండవుల అజ్ఞాతవాసములో విరాట రాజు కొలువులో దామగ్రంధి అనే పేరుతొ గుర్రాలశిక్షకుడిగా పనిచేసాడు కృష్ణుని చేతిలో నరకాసురుడు మరణించిన తరువాత గుర్రపు పెంపకం, శిక్షణ గురించి నకులుడు లోతైన అవగాహన పొందినట్లు మహాభారతంలో రాయబడింది. విరాటరాజుతో సంభాషణలో, నకులుడు గుర్రాలకు సంబంధించి అన్ని అనారోగ్యాలకు చికిత్స చేసే కళను తెలుసుకున్నానని నకులుడు విరాట రాజుతో అంటాడు అతను చాలా నైపుణ్యం కలిగిన రథసారథి కూడా అంతకుముందు అరణ్య వాసములో ఉండగా జటాసురుడు అనే రాక్షసుడు( బకాసురుని సోదరుడు) భీమార్జునులు లేని సమయములో బ్రాహ్మణా వేషములో వచ్చి ధర్మరాజు,ద్రౌపది, నకుల సహదేవులను అపహరిస్తాడు ఆ సమయములో నకులుడు భీముడు వచ్చేదాకా ఆ రాక్షసుడితో పోరాడుతాడు ఇంతలో భీముడు వచ్చి జటాసురుడిని సంహరిస్తాడు. అంతేకాకుండా పాణ్డవాలు అరణ్య వాసములో ఉండగా నకులుడు క్షేమంకరుడు, మహామహుడు, సూరత అనే రాక్షసులను సంహరించాడు
కురుక్షేత్ర యుద్దములో పాండవ సైన్యానికి అధిపతిగా ద్రుపదుడు ఉండాలని నకులుడు కోరుకున్నాడు కానీ ధర్మరాజు , అర్జునుడు ద్రుష్టద్యుమ్నుడు ని అధిపతిగా ఎన్నుకుంటారు .యుద్దములో ఒక యోధుడిగా నకులుడు కౌరవ సేన లోని అనేక మంది కురు వీరులను సంహరిస్తాడు నకులుని రథముపై గల ధ్వజం పై బంగారు రంగుతో ఉండే జింక పటము ఉంటుంది పాండవుల సైన్యం లోని ఏడు అక్షౌహిణీల సైన్యం ఒకదానికి నాయకత్వం వహించి యుద్ధంలో పాల్గొన్నాడు
మొదటిరోజు యుద్దములో నకులుడు దుశ్శాసనుడితో తలపడి ఓడించినప్పటికీ తన అన్న ప్రతిజ్ఞ నెరవేర్చుకోవడానికి వీలుగా చంపకుండా వదిలివేశాడు.11 వ జరిగిన యుద్దములో తన మేనమామ అయిన శల్యుడి రధాన్ని నాశనం చేసి ఓడిస్తాడు.మరోసారి శల్యుడితో 14 వ రోజు యుద్దములో తలపడి ఓడిస్తాడు.15 వ రోజు దుర్యోధనునితో,16 వ రోజు కర్ణునితో యుద్ధం చేస్తాడు 17 వ రోజు జరిగిన యుద్ధంలో శకుని కుమారుడైన వృకాసురిని సంహరిస్తాడు.18 వ రోజు జరిగిన యుద్ధం లో కర్ణుడి కుమారులైన సుషేణుడు,చిత్రసేనుడు, సత్యసేనులను తన కత్తి నైపుణ్యాలను ప్రదర్శించి సంహరిస్తాడు. ఆ విధంగా కురుక్షేత్రంలో తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తాడు.ఆయుర్వేద: వైద్యులైన అశ్వినీ కుమారుల కుమారుడు కావడంతో నకులుడు కూడా ఆయుర్వేదంలో నిపుణుడని నమ్ముతారు యుద్ధం అనంతరం ధర్మరాజు నకులుని ఉత్తర ముద్ర రాజ్యానికి రాజుగా నియమిస్తాడు.కలియుగము ప్రారంభమై కృష్ణుని అవతార పరిసమాప్తి తరువాత పాండవులు రాజ్యాన్ని అన్ని సంపదలను పరిత్యజించి ఒక కుక్కతో హిమాలయాలకు వెళ్లి అక్కడ నుండి స్వర్గారోహణ మొదలు పెడతారు. ఈ స్వర్గారోహణ మొదట ద్రౌపది ,సహదేవుడు మొదట మరణిస్తారు ఆ తర్వాత నకులుడు మరణిస్తాడు భీముడు నకులుడు మరణించడానికి కారణం అడిగితే ధర్మరాజు ,నకులుని తానూ అందగాడినని గర్వము అని తన కంటే అందమైన వారు లేరని అహంభావం వల్ల చనిపోయాడు అని చెపుతాడు.
సహదేవుడు :- సహదేవుడు మహాభారత ఇతిహాసములొ పాండవులలో ఐదవవాడు. అశ్వనీదేవతల అంశ. ద్రౌపది సహదేవులు కుమారుడు శ్రుతసేనుడు ఇతను కృత్తిక నక్షత్ర లగ్నములో జన్మించాడు.ద్రోణాచార్యుని విద్యాశిక్షణలో సహదేవుడు ఖడ్గయుద్ధంలో ప్రవీణుడయ్యాడు. అజ్ఞాతవాస సమయంలో సహదేవుడు "తంత్రీపాలుడు" అనే పేరుతో విరాటరాజు కొలువులో గోపాలకునిగా చేరాడు. ఆ సమయంలో తమను వంచించిన శకునిని హతం చేస్తానని సహదేవుడు ప్రతిజ్ఞ చేశాడు. కురుక్షేత్ర యుద్ధంలో 17వ రోజు యుద్ధంలో ఈ ప్రతిజ్ఞ వెరవేర్చుకొన్నాడు.
యుద్ధము అనంతరము ధర్మరాజు సహదేవుడిని దక్షిణ ముద్ర రాజుగా నియమిస్తాడు .సహదేవుడు మద్ర రాజు ద్యుతిమతి కుమార్తె అయిన "విజయ"ను కూడా స్వయంవరంలో పెండ్లాడాడు. వారికి కలిగిన పుత్రుడు సుహోత్రుడు.సుహోత్రుడు మగధ రాజు జరాసంధుని కుమార్తెను పెండ్లాడాడు. (జరాసంధుని కొడుకు పేరు కూడా సహదేవుడే) భీముడు జరాసంధుడిని వధించినాక జరాసంధుడి కొడుకైన సహదేవుని మగధ రాజుగా చేస్తాడు ఇతను కురుక్షేత్ర యుద్దములో పాండవుల పక్షాన నిలిచి ఒక అక్షౌహిణి సైన్యానికి అధిపతిగా పోరాడుతాడు.
ధర్మరాజు యుద్ధము అనంతరము సింహాసనాన్ని అధిష్టించాక దక్షిణ దేశ దండయాత్రకు సహదేవుడిని పంపుతాడు.రాజసూయ యాగానికి ముందు జరిగిన ఈ దండయాత్రలో కేరళ, మహిష్మతి, శూరసేన, మత్స్య, అవంతి, దక్షిణ కోసల, కిష్కింధ రాజ్యాలను సహదేవుడు జయంచాడు. సహదేవుడు బృహస్పతి వలె గొప్ప వివేకము కలవాడని, రాబోవు ఘటనలను ముందుగానే ఊహింపగలడని, కాని శాపవశాన భవిష్యత్తును ముందుగా చెప్పలేదని ప్రతీతి.
.