ఓహో మేఘమాల . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

ఓహో మేఘమాల .

ఓహో మేఘమాలా .......

తెలుగు సాహిత్యమునకు వేల సంవత్సరాల గొప్ప చరిత్ర ఉంది. తెలుగు సాహిత్యం ఎంతో సుసంపన్నమైనది. ఆధ్యాత్మికములోనైనా, శృంగారాది నవరసములలోనైనా, జాతిని జాగృతం చేయు విషయంలోనైనా, తెలుగువారందరూ గర్వపడేటంత విశేషమై వెలుగొందుతున్నది తెలుగు సాహిత్యం. నన్నయ్య వ్రాసిన భారతము తెలుగులో మొదటి కావ్యము. అంతకు ముందే జానపద గీతాలు, కొన్ని పద్యాలు ఉన్నట్లు ఆధారాలు ఉన్నాయి. గాథా సప్తశతిలో తెలుగు జానపద గీతాల ప్రస్తావన ఉంది.

మనసాహిత్యంలో కాళిదాసు మేఘసందేశం మరువగలమా? అలాగే మనసినిమాల్లో ఎన్నో అద్బుత మేఘల గీతాలు మనల్ని అలరించాయి.

మేఘూలను మన పూర్వీకులు పలువిధాలుగా వర్ణించారు.

అష్టమేఘాలు :

ఎనిమిది రకాల మేఘాలు. మేఘమాలికా శాస్త్రములో, మేఘాలను ఎనిమిది రకాలుగా నిర్ణయించినట్లు ఉంది.

1) పుష్కలావరక మేఘాలు: యెక్కువగానూ, మిక్కిలి వింతగాను వర్షిస్తాయి. కుంభవృష్టి (కుండలతో దిమ్మరించే విధముగా వాన కురవటం)ని కురిపించే మేఘాలివే.

2) మధుమేఘాలు: తేనె రంగు కలిగి ఉంటాయి. పదిహేను ఆమడల పొడవు వ్యాపించి నాలుగు తూముల వర్షం కురిపిస్తాయని చెబుతారు.

3) వాయు మేఘాలు లేదా వాయుమండల మేఘాలు: ఈ మేఘాలు గోరోచనపు రంగులో ఉంటాయి. ఇత్తడి రంగుగా కనబడతాయి. ఇవి కనిపిస్తే వర్షం కురవదంటారు. దీనినే జానపదులు పులిచారల మబ్బు అంటారు. అవి పన్నెండు ఆమడల పొడవు వ్యాపించుననియూ, గాలి యొక్కువగా ప్రకోపించి, ప్రధానంగా ఉంటే స్వల్పవర్షం కురుస్తుందని చెబుత్తున్నారు.

4) రాజమేఘాలు: నల్లని, తెల్లని మబ్బులలో రాగి వలెను, దాసాని పువ్వు వలెను మెరుపులు కనిపిస్తే, ఆ మబ్బులో రాజమేఘాలున్నాయని అనుకోవచ్చు. ఈ మేఘాలు ముఖ్యంగా వింధ్యకు ఉత్తర ప్రాంతాలలో గంగా తీర సీమలలో వర్షిస్తాయి.

5) బ్రాహ్మణజాతి మేఘాలు: కమలముల వన్నె కలిగి ఉంటాయి. ఇవి గాలిపాటును బట్టి వర్షిస్తాయని చెబుతారు.

6) క్షత్రియజాతి మేఘాలు: ఎర్రని రంగు కలిగి, గంభీరాకారముతో ఉంటాయి.

7) శూద్ర జాతి మేఘాలు: నల్లని రంగు కలిగి ప్రశాంతముగా ఉంటాయి.

8) నీలిమేఘాలు: ఇంద్ర నీలమును పోలిన రంగు కలిగి, నిప్పురంగు మెరుపులు ఈ మేఘముల నుండే కలుగుతాయని అంటారు. ఇవి వింధ్యా పర్వతాలకు దక్షిణ ప్రాంతములలో, గోదావరీ నది సముద్రములో కలిసే ప్రదేశములలో వర్షిస్తాయని ప్రతీతి.

పుట్టగొడుగు మేఘం (ఆంగ్లం : Mushroom Cloud), అణుపరీక్షలో ఒకటైన 'వాతావరణ అణుపరీక్ష' చేపట్టినపుడు, లేదా అణు బాంబు ప్రయోగించినపుడు, లేదా అగ్నిపర్వతం బ్రద్దలైనప్పుడు, లేచే మేఘం.

1945, ఆగస్టు 9, జపాన్ లోని నాగసాకి పై అమెరికా, అణుబాంబు ప్రయోగించినపుడు ఏర్పడిన 'పుట్టగొడుగు మేఘం' లేదా 'మష్రూం మేఘం'.1989, అలాస్కా లోని 'రిడౌట్ పర్వతం' పై పేలిన అగ్ని పర్వతం. ఫలితంగా యేర్పడిన 'పుట్టగొడుగు మేఘం'.

1945 సెప్టెంబరు 13, లండన్ లోని ద టైమ్స్, ప్రచురించిన విషయంలో "1945 ఆగస్టు 13, జపాన్ పై ప్రయోగించిన అణు బాంబు (లిటిల్ బోయ్) వల్ల పుట్టగొడుగు లాంటి పొగ , ధూళి ఏర్పడింది, అని వ్రాసింది. ఈ పుట్టగొడుగు ఎత్తు 45,000 అడుగులు.

'కాసెల్ రోమియో' వద్ద జరిపిన హైడ్రోజన్ బాంబు పరీక్ష సమయంలో యేర్పడిన 'పుట్టగొడుగు మేఘం'.

క్యుములోనింబస్‌' మేఘాలకు మేఘరాజు అనే పేరు కూడా ఉంది. భూమి మీద ఏటా 44 వేల క్యుములోనింబస్‌ మేఘాలు ఏర్పడతాయని అంచనా. భారీ ఉష్ణోగ్రతలు, గాలిలో తేమ ఎక్కువగా చేరడం, వాతావరణంలో అస్థిరత వంటి పరిస్థితుల్లో ఏర్పడతాయి. బొగ్గు, గ్రానైట్‌, కొండలు వంటివి ఉన్న ప్రాంతాల్లో ఇవి చాలా ఎత్తుకి ఎదుగుతాయి. రుతుపవనాల సమయంలో ఏర్పడే మేఘాలు భూ ఉపరితలం నుంచి 3-4 కి.మీ. ఎత్తు వరకు మాత్రమే వెళతాయి. కానీ క్యుములోనింబస్‌ మేఘాలు మాత్రం 12-15 కి.మీ. ఎత్తు వరకు వెళ్తాయి. విస్తీర్ణం 10-25 చ.కి.మీ. వరకు ఉంటుంది. భూమిపై ఐదున్నర కిలోమీటర్లు దాటిన తర్వాత వాతావరణం మైనస్‌ డిగ్రీల్లోకి మారుతుంది. దాంతో క్యుములోనింబస్‌ మేఘాల్లోని నీటి బిందువులు మంచు స్ఫటికాలుగా ఘనీభవిస్తాయి. ఇవే వడగళ్లుగా కురుస్తాయి.

Duration: 15 నిమిషాల, 27 సెకండ్లు.15:27క్లౌడ్స్ (సి. 1920ఎస్), యునైటెడ్ స్టేట్స్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ నిర్మించిన క్లౌడ్స్ గురించి నిశ్శబ్ద డాక్యుమెంటరీ ఫిల్మ్.

క్యుములోనింబస్‌ మేఘాలు రెండు మూడు గంటల వ్యవధిలో ఏర్పడి గంటా గంటన్నరసేపు భీకర వర్షాన్ని కురిపించి వెళ్లిపోతాయి. ఈ కొద్ది వ్యవధిలోనే భారీ నష్టం జరుగుతుంది. సాధారణ మేఘాల్లో గాలుల తీవ్రత సెకనుకి సెంటీ మీటర్ల స్థాయిలో ఉంటే వీటిలో మాత్రం సెకనుకి 15-20 మీటర్ల వేగంతో విజృంభిస్తాయి. అందుకే ఈ మేఘాలు ఏర్పడినప్పుడు గంటకు 50 కి.మీ.కు మించిన వేగంతో పెనుగాలులు వీచి చెట్లు కూలిపోవడం వంటివి జరుగుతాయి. క్యుములోనింబస్‌ మేఘాల్లో పుట్టే రుణ, ధనావేశాల కణాల సమూహాల వల్ల మెరుపులు, ఉరుములు ఏర్పడి పిడుగులూ పడతాయి. గంటన్నర వ్యవధిలో గరిష్ఠంగా 25-30 సెం.మీ. వర్షం కురుస్తుంది.వీటిని ఈశాన్య భారతంలో 'కాలబైశాఖి' 'నార్వెస్టర్స్‌' అంటారు.

మనసినీగీతాలలో ' ఓహో మేఘమాలా ' భలేరాముడు . ' మబ్బులో ఏముంది ' లక్షాధికారి . ' ఆమబ్బు తెరలలోన ' పరువు ప్రతిష్ట ' నీలి మేఘూలలో 'బావా మరదళ్ళు . ' ఆకామ వీధిలో ' మల్లేశ్వరి . ' నీలి మేఘ మాలవో ' మదన కామరాజు కథ . ' దూరానా నిలి మేఘూలు ' గుడి గంటలు . ' మబ్బులు రెండు ' దేశోధారకుడు . 'మబ్బులు తొలగెనులే ' అగ్గి బరాటా . ' మెరిసే మేఘమాలిక ' దీక్ష . ' నీలి మేఘమా ' అమ్మాయిలు జాగ్రత్త .

వంటి పలు సినిమాల్లో వచ్చిన గీతాలు మనలను ఆనంద పరిచాయి.

సేకరణ : డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

 

మరిన్ని వ్యాసాలు

atithi
అతిధి
- Madhunapantula chitti venkata subba Rao
Manavulalo daivatwam
మానవులలో దైవత్వం
- సి.హెచ్.ప్రతాప్
హెలెన్ కెల్లర్
హెలెన్ కెల్లర్
- బి.రాజ్యలక్ష్మి
ఋచీక మహర్షి .
ఋచీక మహర్షి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఋష్యశృంగ మహర్షీ .
ఋష్యశృంగ మహర్షీ .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
ఆంగీరస మహర్షి.
ఆంగీరస మహర్షి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అగస్త్యుడు .
అగస్త్యుడు .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు