మన దేశ భక్తుల గీతాలు . - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

మన దేశ భక్తుల గీతాలు .

మన దేశభక్తుల గీతాలు.

నేడు మనం అనుభవిస్తున్న స్వేఛ్ఛా స్వాతంత్ర్యం వెనుక లక్షలమంది బలిదానం ఉంది తమ సర్వస్వాన్ని త్యాగం చేసి చెరసాలపాలై చరిత్రలో మరుగున పడిన మహనీయులు ఎందరో! అటువంటి దేశభక్తులకు నమస్కరిద్దాం!

ఏఉద్యమానికైనా నాయకత్వం వహించీనవారే నాయకులుగా గుర్తింపు పొందుతారు. వారి వెనుక దన్నుగా నిలచి పోరాడినవారు ఎందరో చరిత్రలోకనుమరుగు కావడం మనకు తెలిసినదే! మన దేశ స్వాతంత్ర్య పోరాటంలో లక్షలాది దేశభక్తులు కుల,మత,భాషలకు అతీతంగా పోరాడి అసువులు బాసారు.దేశ విముక్తి పోరాటంలో సాహిత్యంతో పలురూపాలలో ప్రజలను ఉత్తేజపరచింది.మన కవులు తొలి టాకీ సినిమాలలో కీర్తనలతో ప్రారంభమైనప్పటికీ సందర్బోచితంగా సందేశాత్మక పాటలు ప్రవేశపెట్టారు.

సీనియర్ సముద్రాల వారి కొన్ని దేశభక్తి గీతాలు పరిశీలిద్దాం !

వెడలిపో తెల్లదొర మాదేశము యొల్లదాటి వెడలిపో- జడియకురా ధీరా సాత్త్విక రణవిజయము నీదేరా - నిర్వేదమేల కన్నురదేల భరశూత జాతి కపూర్విమే.

సాంఘీక చిత్రాలలో జాతీయతను ప్రబోధించే పాటలు ఉండటం సమంజసమే కాని 01/06/1935న విడుదలైన ' కృష్ణ లీలలు ' చిత్రంలో

ఇంద్రాది దేవగణాలు దుర్గాదేవిని వేడుకుంటూ ' వందే మాతరం ' అనే దేశభక్తి గీతాన్ని కొంతభాగం వాడుకున్నారు.ఈగీత రచయిత బంకిం చంద్ర చటర్జి అని మనకు తెలిసిందే .సినిమా కేవలం వ్యాపార ప్రక్రియేకాదు మన సాంస్కృతిక కళలతోపాటు నైతికబాధ్యత వహించింది. 1938లో విడుదలైన ' మాల పిల్ల ' చిత్రంలో ' లేవరా నిదుర మానరా ', ' కొల్లాయి కడితేనేమి ' అనే రెండు దేశభక్తి గీతాలు కనిపిస్తాయి.1940 లో వచ్చిన

' చండిక ' చిత్రంలో ' హిందూస్ధాన్ - హింధూస్ధాన్ మముగన్నతల్లి హింధూస్ధాన్ ' అనేపాట,1948 లో వచ్చిన ' బాల రాజు ' చిత్రంలో

' నవోదయం - శుభోదయం ' అనేపాట ,1940 లో వచ్చిన' కాలచక్రం ' 1943లో వచ్చిన ' పంతులమ్మ' చిత్రాలలో దేశభక్తి గీతాలు ఉన్నాయి. 1950 లో వచ్చిన ' వాలి-సుగ్రీవ ' చిత్రంలో ' దేశభక్తులకు దివ్యాభరణాలు ఇవేనా ' అనే పాట ఉంది.1949 లో వచ్చిన 'మనదేశం ' చిత్రంలో ' జయ జనని పరమ పావని ' ' భారత యువకా కదలిరా ' అనే రెండు దేశభక్తి గీతాలు ఉన్నాయి .1950 లో ఘంటసాల నిర్మించిన ' సొంతవూరు ' చిత్రంలో ' మన ఊరే భారతదేశం ' అనే ఉత్తేజపూరిత గీతం ఉంది.1952 లో వచ్చిన ' సాహసం ' చిత్రంలో ' హెచ్చరికో భారతీయుడా ' అనేపాట ఎంతో స్ధూర్తిదాయకంగా నిలిచింది. అలాగే ' రాజేశ్వరి ' చిత్రంలో ' జై పతాక సోదరా ' అనేపాట ఉంది. ' పల్లెటూరు ' చిత్రంలో ' చేయేత్తి జైకొట్టు తెలుగోడ , అనేపాట, ' మరదలు పెళ్ళి ' చిత్రంలో ' నేడు నాటిన మూలక రేపు ఫలితమిస్తుంది ' అనే పాటలు నాడు తెలుగు వారిని ఉత్తేజ పరిచాయి.

అలాగే 1950 వచ్చిన ' జీవితం ' 1954 వచ్చిన ' ప్రజారాజ్యం ' ' అంతా మనవాళ్ళే ' చిత్రాలలోని దేశభక్తి గీతాలు ఎంతో అలరించాయి.1955లో వచ్చిన 'కన్యాదానం ' లోపాట, 1957 లో వచ్చిన ' వీర కంకణం టైటిల్ సాంగ్ ,1937 లో వచ్చిన 'బాలయోగి ' చిత్రంలో ' వందే వందే భారతమాత ' పాట ఉత్సహభరితమైనవి. మదాలస చిత్రంలో ' స్వాతంత్ర్యము కన్న స్వర్గ లోకము లేదు ' 1948లో వచ్చిన 'ద్రోహి చిత్రంలో ' ధన్యవహో ధన్యవహో మాతాసీతా ' 1946 లోని ' ముగ్గురు మరాఠీలు ' చిత్రంలో ' వడుకుమా రాట్నమా భారత నారి కవచమా ' అనంతరం ' జయప్రద ' చిత్రంలో ' మనుజాళికి ' 1957 'యం.ఎల్ .ఎ. 1969 వచ్చిన ' సత్తెకాలపు సత్తెయ్య ' చిత్రాల పాటలు ప్రజాదరణ పొందాయి.1961వచ్చిన ' వెలుగునీడలు ' చిత్రంలో ' పాడవోయి భారతీయుడా ' 1974 లోవచ్చిన ' తాతమ్మ కల ' చిత్రంలో ' ఇదేనా నాదేశం ' 1972లో వచ్చిన ' రాముడు భీముడు ' చిత్రంలో ' ఉందిలే మంచికాలం ' ' బడి పంతులు ' చిత్రంలో ' భారతమాతకు జేజేలు ' 1974లో వచ్చిన అల్లూరి సీతారామరాజు ' చిత్రంలో ' తెలుగు వీర లేవరా '

అనే దేశభక్తి గీతాలు ఊరూ,వాడల మారుమ్రోగాయి.అలగే...

వేలకొద్ది దేశభక్తి గీతాలు ప్రజలు నాడు ఉత్తెజపూరితులై పాడుకున్నారు .

కొందరు మహనీయులు రాసిన మరికొన్ని దేశభక్తి గీతాలు......

వీరగంధం తెచ్చినారము-వీరుడెవ్వడో తెల్పుడి--త్రిపురనేని రామస్వామి.

దేశమాత సేవచేయండి!జనులారా!భారత---కొండపల్లి జగన్నాధదాసు.

అన్నలారా రండీ మనఅమ్మ నుడి వినండి---గరిమెళ్ల సత్యనారాయణ. దండాలోయ్-మేముండలేమండోయ్ బాబు---గరిమెళ్ల సత్యనారాయణ.

రారా!పోదాము-రాజ్యమేలుదాము!---గరిమెళ్ల సత్యనారాయణ.

వెలిగించరా!జ్యోతి వెలిగించరా!---ధవళా శ్రీనివాసరావు.

ఏకులు కావలెనా?దాస్యపు-మోకులు కావలెనా?---వెన్నెలకంటి రాఘవయ్య.

వద్దురా మనకొద్దురా పరదేశ వస్త్రము---గరికపాటి మల్లావధాని.

నాతల్లిరాట్నమా!నాపాలి భాగ్యమా!---నెల్లురు వెంకటరామానాయుడు.

జాతీయ చైతన్య జననియై వెలయు---తుమ్మలసీతారామమూర్తి.

ఎత్తండీ దివ్విటీలు-ఒత్తండి శంఖాలు---పైడిపాటి సుబ్బరామశాస్త్రి.

ఓ సుస్వతంత్రమా!ఓ మోహ మంత్రమా!రాయప్రోలు.

భరత ఖండబు చక్కని పాడియావు---చిలకమర్తి.

ప్రమధ నాథుని నీరు ద్రావింప జాలిన---గుర్రంజాషువా.

జయ జయ జయ ప్రియభారత---దేవులపల్లి కృష్ణశాస్త్రి.

జయభారతావని జయలోకపావని---వానమామలై వరదాచార్యులు.

మేఘమండల మంటి మిహితాద్రి కబరీభ---బలిజేపల్లి.

ఇదియే జాతీయ జండా! ---గురజాడ.

ఎగురవే వినువీధి-ఎగురవేజండా---సుంకర సత్యనారాయణ.

జండాఎత్తర-జాతికి ముక్తిర---గురజాడ.

ఆడనీరా!యెగిరి-ఆడనీరా విప్పి---గురజాడ.

నలుబది కోట్ల తమ్ముల జీవితమ్ముల---కరుణశ్రీ

హిమాలయెత్తుంగ శృంగ-నీబ్రదుకు---అడవి బాపిరాజు.

కొల్లాయి గట్టితేనేమి?మాగాంధి---బసవరాజు.

జాతీయ పతాకోత్సవ---శిష్టా వెంకటసుబ్బయ్య.

పతాకోత్సవం సేయండి---బసవరాజు.

ఎత్తండి స్వరాజ్యజెండా..జెండా---శృంగవరపు శ్రీనివాసాచార్యులు.

హింద ఆంధ్రరాష్ట్రం అవతరించిన---సరికొండ జనార్ధనరాజు.

మాతెలుగు తల్లికి మల్లెపూ దండ---శంకరంబాడి సుందరాచారి.

పాడవోయి భారతీయుడా!---శ్రీ శ్రీ.

చెయ్యేత్తి జైకొట్టు తెలుగోడ---వేములపల్లి శ్రీకృష్ణ. త్రిలింగదేశముమనదోయి---పైడిపాటిసుబ్బరామశాస్త్రి.

మాకొద్దు తెల్లదొరతనము---గరిమెళ్ళ.

దేశసేవకుమీరు-ధీరులైనడవండి ---దామరాజు.

నాతల్లిరాట్నమా-నాపాలిభాగ్యమా!---కొండపల్లి.

ఎప్పుడుతీరునీ స్వాతంత్ర్యదాహం---మల్లాది.

జనగణమన---రవింధ్రనాద్ ఠగూర్.

వందేమాతరం---బంకించంద్ర చటర్జీ.

దేశమును ప్రేమించుమన్నా---గురజాడ.

ఏదేశమేగినా ఎందుకాలిడినా---రాయప్రోలు.

మేలుకొనుడు మేలుకొనుడు---బెల్లంకొండ చంద్రమౌళిశాస్త్రి.

మతములుజొచ్చినిల్లు---చెన్నప్రగడ భానుమూర్తి.

కొప్పున తారకల్ తురిమి---కాటూరి వెంకటేశ్వరరావు.

జయ జయ జయభారతజనని పావని---గురజాడరాఘవశర్మ.

ఉయ్యాల!జంబాల!భారత నవజీవన బాల---కవికొండల వెంకటరావు.

ప్రియభారతావనీ!విశ్త్వెకపావని---వేదుల సత్యనారాయణశాస్త్రి.

నిన్నునెన్నమా తరమా!నిరుపమాన భారతమాత--మంగిపూడి వెంకటశర్మ.

విజయీ విశ్వతిరంగా ప్యారా---శ్యాంలాల్ గుప్తపార్య్ష.

ఎగురవే వినువీధిన ఎగురవే జండా!---సుంకర సత్యనారాయణ.

బెల్లంకొండ నాగేశ్వరరావు. చెన్నయ్ .

9884429899

జైహింద్ .