పురాణ పాత్రల పేర్లు.1. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

పురాణ పాత్రల పేర్లు.1.

మన పురాణలలో పేర్లు . 1 .

అగజాత పార్వతీ దేవికి గల పేరు

అఘుడు

రాక్షసులైన, పూతన, బకాసురుల సోదరుడు. కంసుడి అనుచరుడు.

అగస్త్య మహర్షి

అగస్త్య మహర్షి హిందూ చరిత్రలో ఒక గొప్ప ఋషి. దక్షిణ భారతదేశంలో నేటికీ ఈ ఋషి జీవించే ఉన్నట్టుగా చెప్తారు. ఈయన బ్రహ్మదేవుని మానస పుత్రుడు .అగస్త్య మహర్షి కాశీలో వుండేవాడు, దక్షిణాపథానికి ఎందుకొచ్చాడు? అంటే, పూర్వం మహానుభావులు ఏమి చేసినా ప్రజా శ్రేయస్సుకోసమే చేసేవారు. అలాగే అగస్త్యుడుకూడా ప్రజల శ్రేయస్సు కోసమై కాశీలో సదాశివుని సన్నిధి విడిచి దక్షిణాపధానికి వచ్చాడు.భార్య పేరు లోపాముద్ర

అగ్ని

వేదములలో పేర్కొన్న ఒక దేవతా మూర్తి . అతని భార్య స్వాహాదేవి.

అనసూయ

అసూయ లేనిది. అనసూయ అత్రి మహర్షి భార్య, మహా పతివ్రత. ఈమె కర్దమ ప్రజాపతి, దేవహూతి ల పుత్రిక. స్వాయంభువ మనువు మనుమరాలు. ఖ్యాతి, అరుంధతి మొదలగువారు ఆమె సోదరీమణులు. వినయ వివేకాలు ఈమెకు సహజ భూషణాలు. పతిసేవలో మక్కువ ఎక్కువ. ఈమె పతిభక్తికి మెచ్చిన అత్రిమహర్షి అష్టాక్షరీ మంత్రోపదేశం చేస్తాడు. తన మహిమను పరీక్షించడానికి వచ్చిన త్రిమూర్తులను శిశువులను చేసి లాలించింది. లోకమాతలకు పతిభిక్షపెట్టి అత్తగారిగా నిలిచింది. త్రిమూర్తుల అంశతో దత్తాత్రేయుడు అనే పుత్రున్ని పొందింది.

అనిలుడు

అనిలుడు హిందూ పురాణాలలోని వ్యక్తి.

• అష్టవసువులలో నొక్కడు. ఈ మన్వంతరమునందు వాయవ్యదిక్కునకు నధిపతి. ఈ శబ్దమునకు అనీలు డను రూపము గూడ గలదు.

• శ్రీ కృష్ణునకు మిత్రవింద వలన గలిగిన పుత్రులలో నొక్కడు.

అనుభూతిస్వరూపాచార్యుడు

అనుభూతిస్వరూపాచార్యుడు - సారస్వత వ్యాకరణము రచించినయత డని వాడుక.

• ఇతనిని గూర్చిన యొక కథ గలదు. రాజసభ మద్యమున నీత డొకనాడు అపశబ్ద ప్రయోగము చేయ దానికి నాధారము చూపు మన నింటికిబోయి సరస్వతి నారాధించెను. ఆమె ప్రసన్నురాలై యొక వ్యాకరణము నిచ్చెను.

• ఈతడు సారస్వత వ్యాకరణము వ్రాయలే దనియు, దాని మీద ' ప్రక్రియ ' మాత్రము వ్రాసె ననియు, నీతడు క్రీ. శ. 1250 కి దరువాతను, 1450 కి బూర్వమునను ఉండె ననియు దజ్ జ్నుల యభిప్రాయము.

అనువిందుడు

అనువిందుడు పురాణాలలోని ఒక వ్యక్తి.

• విందుని తమ్ముడు. వసుదేవుని తోబుట్టు వగు రాజాధిదేవికిని, ఆమె పెనిమిటి యవంతిరాజు జయసేనునకును బుట్టినవాడు. శ్రీకృష్ణునకు మేనత్తకుమారుడు. భారత యుద్ధమునందు దుర్యోధనపక్షమున బోరాడి అర్జునునిచే జచ్చెను.

• కేకయరాజుయొక్క ఇద్దరు పుత్రులలో నొక్కడు. వీని అన్న విందుడు. భారతయుద్ధమునందు బాండవపక్షపాతియై యుండె.

• దృతరాష్ట్రుని నూర్గురు పుత్రులలో నొక్కడు.

అచల

కుమారస్వామి మాతౄగణములోని ఒక స్త్రీమూర్తి.

అత్రి

బ్రహ్మ మానస పుత్రులలో ఒకడు . సప్తర్షులలో ప్రథముడు. ఆయన భార్య మహా పతివ్రతయైన అనసూయ. అత్రి గోత్రం ఆయననుండి ఉద్భవించినదే. వీరికి చాలా మంది పుత్రులున్నారు. వీరిలో సోముడు, దత్తాత్రేయుడు, దుర్వాసుడు ముఖ్యులు. వీరు ముగ్గురూ త్రిమూర్తులు అవతారాలని భావిస్తారు.

అర్జునుడు

స్వచ్ఛమైన చాయ కలవాడు. పాండవులలో మద్యముడు . కుంతికి మంత్రశక్తివలన ఇంద్రునిచే జన్మించినవాడు . పాండురాజు తనయుడు.

అభిమన్యుడు

అర్జునుడు, సుభద్ర ల కుమారుడు . కురుక్షేత్ర సంగ్రామములో పద్మవ్యూహం లోపలకు వెళ్ళి బయటకు రావడం తెలియక మరణించాడు . అజ్ఞాతవాసంలో ఉన్న తండ్రి అయిన అర్జునుని చూడటానికి విరాట రాజ్యానికి వచ్చి విరాటరాజు కుమార్తె, ఉత్తరను కలుసుకొని పెద్దల సంపూర్ణ అంగీకారంతో ఉత్తరని వివాహము చేసుకుంటాడు. యుద్ధానంతరము ఉపపాండవులను అశ్వద్ధామ సంహరించడము వలన అభిమన్యుని కుమారుడు పరీక్షిత్తు యధిష్టురుని తరువాత హస్తినాపురానికి రాజు అయ్యాడు. పరీక్షిత్తు వలననే పాండవ వంశము వృద్ధి చెందినది.

అనాదృష్యుడు

గాంధారీ, ధృతరాష్ట్రుల కుమారుడు . నూరుగురు కౌరవులలో ఒకడు .

అశ్వత్థామ

గుర్రము వలె సామర్ధ్యము కలవాడు, ఇతను పుట్టగానే అశ్వము వలె పెద్ద ధ్వని రావడం వలన అశ్వత్థామ అయ్యాడు. ఇతడు చిరంజీవి . ద్రోణుని కుమారుడు . పాండవ ద్వేషి .

అంబిక

1. హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

2. మహాభారతములో సత్యవతి - శంతన మహారారు కుమారుడైన చిత్రాంగుని భార్య పేరు అంబిక . భర్త చనిపోయిన తరువాత ఈమెకు వ్యాసుని వలన గుడ్డివాడైన ధృతరాస్ట్రుడు జన్మిస్తాడు .

అంబాలిక

విచిత్రవీర్యుని ఇద్దరి భార్యలలో రెండెవది . విచిత్ర వీర్యుడు 8 సంవత్సరాలు కాపురము చేసి క్షయ వ్యాధిలో చనిపోయిన తరువాత అత్తగారైన సత్యవతి ప్రోద్బలముతో వ్యాసుని వలన పాండురాజును కన్నది .

అమ్మ

హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

అనిరుద్దుడు

శ్రీకృష్ణుని మనుమడు . ప్రద్యుమ్నుని కుమారుడు . బాణాసురుడి కుమార్తె ' ఉష ' కు భర్త .

అక్రూరుడు

శ్రీకృష్ణుని మేనమామ. అక్రూరుడు తండ్రి శ్వఫల్కుడు, కాశీరాజు కుమార్తెకు, శ్వఫల్కుడికి జన్మించిన వాడే అక్రూరుడు, సత్ప్రవర్తన, బ్రహ్మచర్య దీక్ష కలిగిన అక్రూరుడే శమంతక మణిని గ్రహించటానికి అర్హుడని కృష్ణుడు ఆమణిని అక్రూరుడికి ఇచ్చాడు. అలా ఆనాటినుండి అక్రూరుడు మనస్సులో ఎలాంటి భయాలు లేకుండా యజ్ఞాలను, శమంతక మణి ఇచ్చే బంగారం సహాయంతో చేస్తూ లోకకళ్యాణానికి తన జీవితాన్ని అంకితం చేశాడు.

అకర్కారుడు

కద్రువ కొడుకు. ఒక సర్పం.

అపర్ణ

హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ పార్వతి వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

అయతి

మేరువు కుమార్తె, ధాత భార్య . ఈమె కుమారుడు .. ప్రాణుడు .

అగ్ని శౌచము కర్కోటకుడు నలునికి ఇచ్చిన మాయా వస్త్రము .

అతికాయుడు

రావణుని కుమారుడు . పినతండ్రులు, సోదరుల మరణం చూసి మహా తేశ్శాలి అయిన అతికాయుడు మరొక కుంభకర్ణుడిలా యుద్ధంలోకి దూకాడు. వానర నాయకులు విసిరిన చెట్లు, పర్వతాలు, బండరాళ్ళూ పిండి చేసేశాడు. లక్ష్మణుడు, అతికాయుడు ఒకరికి తీసిపోకుండా ఒకరు మెరుపులలాంటి శస్త్రాస్త్రాలతో యుద్ధం చేశారు. చివరకు వాయుదేవుని సలహాపై సౌమిత్రి బ్రహ్మాస్త్రాన్ని సంధించి అతికాయుని తల తెగనరికాడు. భయభ్రాంతులై రాక్షస సేన అంతా లంకలోకి పరుగులు తీశారు.

అనంత విజయం ధర్మరాజు శంఖము

అలకనంద

దేవలోకం లోని గంగానది . పితృలోకాలో పయనించేటప్పుడు దీనిని ' వైతరణి ' అంటారు . మూడు లోకాల్లో పారే నది కాబట్టి గంగానదిని త్రిపథగ అంటారు.స్వర్గలోకంలో మందాకిని, భూలోకంలో గంగ, అలకనంద, పాతాళలోకంలో భోగవతి అని గంగానదికి పేర్లు

అహల్య

అహల్య గౌతమ మహర్షి భార్య.ఈమె వృత్తాంతము రామాయణములో పేర్కొనబడింది. శాపము వలన రాయిగా మారిన అహల్య, రాముని పాదధూళి సోకి శాప విమోచనమై తిరిగి స్త్రీ రూపము ధరించిందని కొన్ని రామాయణ వృత్తాంతాలలో పేర్కొనబడింది. వీరికి నలుగురు కుమారులు, వారిలో జేష్టుడు శతానంద మహర్షి.

అక్షయపాత్ర

అరణ్యవాసము చేస్తున్న ధర్మరాజు తనవెంట బ్రాహ్మణ భోజనార్ధం సూర్యుడుని ప్రార్థించి ఒక పాత్ర సంపాదించారు . దానిలో కొద్దిగా వండినా అక్షయమవుతుంది (సరిపోయినంత), దానితో ధర్మరాజు నిరంతరము అన్నదానాలు చేస్తుంటాడు .

అంజన

కుంజరుడి కుమార్తె వానర స్త్రీ. కేసరి భార్య. వాయుదేవునితో సంగమము వల్ల అంజనేయుని కన్నది.

అంగదుడు

1. లక్ష్మణుని కుమారుడు, ఇతని నగరము అంగదపురము

2. ఒక వానరుడు. వాలి పుత్రుడు. ఇతని తల్లి తార. వాలి మరణానంతరం సుగ్రీవుడు కిష్కిందకు రాజయ్యెని. అపుడితడు యువరాజాయెను.

అంగన

ఉత్తరపు దిక్కున ఉన్న ఆడుఏనుగు

అంగరాజు

1) బలియను రాజు కుమారుడు. ఇతని తల్లి సుధేష్ణ. ఈమె తల్లి భర్త వియోగముచేఅ దీర్ఘతముని వలన నితనిని కన్నది. ఇతడు పాలించిన దేశమే అంగదేశము.

2) కర్ణుడు

అంగారకుడు

1) ఏకాదశ రుద్రులలో ఒకడు 2) నవగ్రహముకలో ఒకడు. భూదేవి విష్ణుమూర్తిని కామించి స్త్రీ రూపము దాల్చియాతని తన కోర్కె దీర్చమని కోరెను. విష్ణువు అంగీకరించెను. భూదేవి పవడపు రూపమున నొక బీజమును విడెచెను. దాని నుండి అంగారకుడు పుట్టేను (బ్రహ్మవైవర్తన పురాణం)

అంగారపర్ణుడు

ఒక గంధర్వుడు, కుబేరుని మిత్రుడు.ద్రుపదునగరం పోవుచున్న అర్జునునితో యుద్ధము చేసి ఓడిపోయి, అర్జునుని శక్తి సామర్థాలను మెచ్చుకొని జాక్షుసి యను గంధర్వ విద్యనుపదేశించెను.

అంగిరసుడు

1) యాగ్నేయీయూరువుల కుమారుడు. (మత్స్య పురాణం)

2) పథ్యుని శిష్యుడు.అధర్వణ వేదము పఠించెను. (భాగవతము)

3) ఉల్ముకుని కుమారుడు.అంగుని తమ్ముడు. ఇతని భార్య స్మృతి.

4) ఒక ముని. ఈయన ప్రసిద్ధోపాస్యభూతమైన ముఖ్య ప్రాణమును ఆత్మదృష్టిచే ఉపాసన చేసెను. అందువలన ముఖ్య ప్రాణమును అంగిరసముగ ఋషులు తలచుచున్నారు.

5) బ్రహ్మ మానస పుత్రుడు. ఒకనాడు అగ్నికి కోపమువచ్చి తన రూపమునుపహరించి తపస్సు చేయనారంభించెను. కొలది కాలములో అగ్ని స్థానమును అంగీరసునకీయబడెను. తన పదవి పోగిట్టుకొనిన అగ్ని చింతించెను. అపుడు అంగిరసుడు ఆ పదవినతనికిచ్చి తనకు పుత్రునిగా ఉండుటకంగీకరించెను. ఇతని భార్య శివ (శ్రద్ధ). ఈతనికి బృహర్కీర్తి, బృహజ్యోతి, సంవర్తనుడు, ఉతధ్యుడు, మొదలగు పుత్రులు పుట్టిరి.

అంగుడు

1) ఊరుని (ఊల్ముకుని) కుమారుడు. ఒకరాజు. ఇతని భార్య సునీధ.

2) దివిరథ తనయుడగు దధివాహనుని పుత్రుడు.

అంజనపర్వుడు ఘటోత్కచుని కుమారుడు. భారత యుద్ధంలో అశ్వత్ధామ వలన మరణించెను.

అంజనము పడమటి దిక్కున గల యేనుగు

అంతరిక్షుడు మురాసురుని కుమారుడు. కుష్ణునిచే చంపబడెను

అంతర్థానుడు పృథువు కుమారుడు. ఇతడే విజితాశ్వుడు. ఈ రాజకుమారుడు గంగా తీరమున గౌతమ మునీంద్రునిచే రక్షణ సేయబడెను.

అంధకాసురుడు ఒక రాక్షసుడు. సింహికావిప్రచిత్తుల కుమారుడు.

ఆంజనేయుడు

'అంజన' కు పుట్టినవాడు అని అర్ధము . హనుమంతుడు అంజనాదేవి, కేసరిల పుత్రుడు. వాయుదేవుని ఔరస పుత్రుడు. మహాబలుడు. శ్రీరామ దాసుడు. హిందూమతములో అత్యంత భక్తి శ్రద్ధలతో కొలువబడే దేవుడు. ఆంజనేయుడు, హనుమాన్, బజరంగబలి, మారుతి, వంటి ఎన్నో పేర్లతో హనుమంతుని ఆరాధిస్తారు. ఆంధ్ర ప్రదేశ్‌లో హనుమంతుని గుడి లేని ఊరు అరుదు.

ఇంద్రజిత్తు

ఇంద్రుని జయించినవాడు (జితమంగా విజయము). ఇంద్రజిత్తు -- రావణాసురిడికి మండోదరికి జన్మించిన పెద్ద కుమారుడు. ఇంద్రజిత్తు జన్మించినప్పుడు అరచిన అరుపు మేఘం ఉరిమిన పిడుగు శబ్దం వలే ఉండడం వల్ల వీనికి మేఘనాధుడు అని నామకరణం చేశారు. స్వర్గానికి వెళ్ళి ఇంద్రుడిని జయించినందున ఇంద్రజిత్తు అయ్యాడు. ఈ సందర్భంగా పరమేష్ఠి (బ్రహ్మ) అనుగ్రహం వల్ల బ్రహ్మాస్త్రాన్ని సంపాదిస్తాడు. యుద్ధ సంగ్రామంలో అకాశంలోకి వెళ్ళి మేఘాలలో యుద్ధాలు చెయ్యగలగడం ఇంద్రజిత్తు గొప్పతనం. యుద్ధానికి వెళ్లేముందు యజ్ఞము చేసి వెళ్లేవాడు యజ్ఞాన్ని భంగం చేయటమే ఈయనను చంపటానికి ఏకైక మార్గమని గ్రహించిన లక్ష్మణుడు యజ్ఞానికి ఆటంకం కల్పించి ఇంద్రజిత్తు ధాన్యంలో ఉండగా చంపాడు. ఆదిశేషుని కుమార్తె అయిన సులోచన (ప్రమీల) నాగకన్యను వివాహమాడినాడు

ఇంద్రుడు

హిందూ పురాణాల ప్రకారం దేవతలందరికీ, స్వర్గలోకానికీ అధిపతి. ఋగ్వేదం ప్రకారం హిందువులకు ముఖ్యమైన దైవము. విష్ణుమూర్తికి భూదేవికి పుట్టిన కవల పిల్లలలో ఒకడు (ఇంద్రుడు, అగ్ని ). అష్టదిక్పాలకులలో తూర్పు దిక్కునకు అధిపతి. ఇతని వాహనం 'ఐరావతం' అనే తెల్లని ఏనుగు. ఇతని భార్య శచీదేవి. వీరి కూతురు జయంతి, కొడుకు జయంతుడు. ఇంద్రసభలో రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తమ, ఘృతాచి మొదలైన అప్సరసలు నాట్యం చేస్తూ ఇంద్రునికి అతని పరివారానికి వినోదం కలుగచేస్తుంటారు.

ఇంద్రమాల ఒక కమల మాలిక . ఎన్నడూ వాడనిది . ఈ మాల ధరించిన వారిని ఏ అస్రమూ ఎమీ చేయలేదు .

==ఈ== ఈశ్వర్

ఉత్తర

విరాటరాజు కుమార్తె. ఉత్తరుడు ఈమె సహోదరుడు. పాండవులు తమ అజ్ఞాతవాసం విరాటుని కొలువులో చేసారు. అర్జునుడు తను ఇంద్రలోకంలో అప్సరసల వద్ద నేర్చుకున్న నాట్యము ఉత్తరకు నేర్పించాడు. తరువాత అర్జునుడు ఉత్తరను తన కుమారుడు అభిమన్యునితో వివాహము చేసాడు. అభిమన్యుడు పిన్న వయసులోనే కురుక్షేత్ర సంగ్రామంలో మరణించాడు. అభిమన్యుడు మరణించే సమయమునకు ఉత్తర గర్భందాల్చి ఉంది. ఆమెకు పుట్టిన కుమారుడు పరీక్షిత్తు. యధిష్టురుని తరువాత హస్తినాపురానికి పరీక్షిత్తు రాజు అయ్యాడు.

ఉత్తరుడు

విరాట రాజ్యానికి రాజైన విరాటరాజుకు ఇతని భార్య సుధేష్ణకు పుట్టిన కుమారుడు . ఉత్తర ఈయన సహోదరి .

ఉమ

పార్వతి ( Parvati) హిందూ సంప్రదాయంలో శక్తిగా, దుర్గగా అర్చింపబడే దేవత. త్రిమూర్తులలో ఒకరైన శివుని ఇల్లాలు. భవాని, అంబిక, లలిత, అమ్మ, దాక్షాయణి, కాత్యాయిని, గౌరి, భైరవి, అపర్ణ, కాళి, శ్యామ, ఉమ వంటి ఎన్నో పేర్లతో కొలువబడుతుంది. వినాయకుడు, కుమార స్వామి పార్వతీ పరమేశ్వరుల బిడ్డలు.

ఉలూచి

నాగకన్య . వాసుకి కుమార్తె . అర్జునుడు ఈమె ద్వారా ' ఇలావంతుడు ' ని జన్మనిస్తాడు. ఉలూచి కౌరవ్యుడు అను నాగరాజు కుమార్తె.

అర్జునుడు అరణ్యవాసం చేయు సమయమున ఉలూచి అతనిని పాతాళలోకమునకు తీసుకుని వెళ్లి వివాహము చేసికొన్నది. వీరికి ఐరావణుడు అను కుమారుడు జన్మించాడు.

కురుక్షేత్ర సంగ్రామం తరువాత యధిష్టురుడు చేసిన అశ్వమేధ యాగంలో భాగంగా అర్జునుడు మణిపురము వచ్చినప్పుడు బభృవాహనుడు అర్జునునితో యుద్ధము చేసి తన బాణముతో అర్జునుని చంపాడు. అప్పుడు ఉలూచి సంజీవనిమణితో అర్జునుని తిరిగి బ్రతికించింది.

ఉశన -- భృగువు భార్య, శుకృడి తల్లి .

ఉష వెయ్యి బాహువులు కల్గిన బాణాసురుడు బలి చక్రవర్తి కుమారుడు. బాణాసురుని కూతురే ఉష . శ్రీకృష్ణుని కుమారుడైన ప్రద్యుమ్నుడి కుమారుడు అనిరుద్ధుడు ఈమె భర్త. వీరి కుమారుడు వజ్రుడు. బాణాసురుని వంశపరంపర... * బ్రహ్మ కుమారుడు పరిచుడు * పరిచుని కుమారుడు కాశ్యపుడు * కాశ్యపుని కుమారుడు హిరణ్యాక్షుడు, హిరణ్యకశ్యపుడు * హిరణ్యకశ్యపుని కనిష్ఠ పుత్రుడు ప్రహ్లాదుడు * ప్రహ్లాదుని కుమారుడు విరోచనుడు * విరొచుని కుమారుడు బలి చక్రవర్తి * ఆ బలి కొడుకే ఈ బాణాసురుడు * ఆ బాణాసురుని భార్య కండల.