హెలెన్ కెల్లర్ - బి.రాజ్యలక్ష్మి

హెలెన్ కెల్లర్

హెలెన్ కెల్లర్ !! ఎందరికో స్ఫూర్తిదాయకమైన పేరు .అన్ని అవయవాలు వుండి సమాజం లో కొందరు శిథిల జీవనం లో నే జీవితం గడుపుతూ అనామకం గాముగిస్తున్నారు .ఒక అమ్మాయి బాల్యం లోనే చూపు వినికిడి పోగొట్టుకుని అయినా పట్టుదలతో తనల్ని తాను మల్చుకున్న విధానం చదువుతుంటే నాలోని వుత్తేజం మీ అందరితో పంచుకోవాలనిపించింది .

హెలెన్ కెల్లర్ అమెరికాలోని ఉత్తర అలబామా రాష్ట్రం లో ఒక మారుమూల పల్లెలో జన్మించారు .రెండేళ్లవయస్సులో తీవ్రమైన అనారోగ్యం జ్వరం తో కంటిచూపు పోయింది .వినికిడి కూడా పోయింది .పసితనం లోనే చూపు ,వినికిడి పోగొట్టుకున్న దురదృష్టవంతురాలు .కానీ ఆ అమ్మాయి పట్టుదల ,యేకాగ్రత ,తపన సమాజం లో ఒక ఉన్నతస్థానం ,కీర్తి ,మహోన్నత వ్యక్తిత్వం లో నిలబెట్టాయి .ఈ రోజు కూడా హెలెన్ కెల్లర్ మనకు స్ఫూర్తిదాయిని గా నిలిచిపోయింది .

క్రమం గా మాట కూడా ఆగిపోయింది .మనకు ముఖ్యమైన పంచేంద్రియాలలో మూడు ఇంద్రియాల లోపం హెలెన్ కెల్లర్ కి పసిప్రాయం లో సంభవించింది .మూడేళ్ల వయసుకే ఆ పాప కు తనచుట్టూ శూన్యం .ఆరేళ్ల వయసులో తల్లితండ్రులు ఆ అమ్మాయిని యెందరో నేత్రవైద్యులకు చూపించారు కానీ ఫలితం శూన్యం .హెలెన్ కి తన చెల్లాయిని చూడాలని ఒకే ఒక కోరిక .కానీ నిరాశే మిగిలింది .
హెలెన్ కెల్లర్ కు తల్లితండ్రులు ట్యూటర్ ని యేర్పాటు చేసారు .ట్యూటర్ కి చూపు పోయింది కానీ కాలక్రమేణా చూపు వచ్చింది .కేవలం జీతం కోసం ఆవిడ ఒప్పుకోలేదు .అంధత్వం యెంత బాధాకరమో స్వయం గా అనుభవించింది కాబట్టి హెలెన్ కి అండగా సాయం చెయ్యాలనుకుంది .హెలెన్ కళ్లు ,చెవులు కూడా ఆ ట్యూటర్ .ఆవిడ హెలెన్ అరచెతిలొ ఆంగ్ల అక్షరాలు వ్రాస్తూ తన పెదవుల పైన హెలెన్ చూపుడు వ్రేలు పెట్టి అక్షరాలు యెలా పలకాలో స్పర్శ తో నేర్పించింది .ఆలా పెదాలను నేర్చుకుంది హెలెన్ .
అంధులకు లిపి నేర్పిన మహానుభావుడు బ్రెయిల్ .ఆయన అక్షరాల కోసం చిన్నయంత్రాన్ని కనిపెట్టారు .హెలెన్. ట్యూటర్ సహాయం తో బ్రెయిలీ భాష నేర్చుకుంది యంత్రం కొనుక్కుంది .హెలెన్ యిప్పుడు వ్రాయడం నేర్చుకుంది .స్పర్శ ద్వారా హెలెన్ చేతికి పదాలను అక్షరబద్దం చేసింది ట్యూటర్ .ప్రతి వస్తువు కు పేరు వుంటుందని అలాగే ప్రక్రుతి లో మార్పులు కూడా తెలుసుకోవచ్చని హెలెన్ గ్రహించింది .ఉదాహరణ కు ‘నీరు ‘పదాన్ని హెలెన్ అరచేతిలో స్పెల్లింగ్ వ్రాసి నీటిచుక్కల స్పర్శ తో పెదవులపైన ట్యూటర్ తన చూపుడువ్రేలు వ్రాస్తూ పలకడం యెలాగో నేర్పింది .
హెలెన్ ప్రపంచం తన కృషి యేకాగ్రత .హెలెన్ మాన్యువల్ వర్ణమాల మరియు బ్రెయిలీ లిపి వుపయోగించి కమ్యూనికేట్ చెయ్యడం నేర్చుకుంది .1890 లో హెలెన్ పెర్కిన్స్ స్కూల్ ఫర్ ది బ్లైండ్ లో చేరింది .తన చదువుకు అధికారిక అర్హత పొందింది .హెలెన్ గణితం ,విజ్ఞానశాస్త్రం ,సాహిత్యం యిలా అన్ని విషయాలలో లోతుగా చదివి అర్హత పొందింది .హెలెన్ అన్యభాషలలో కూడా పట్టు సాధించింది .న్యాయశాస్త్రం చదివి పట్టభద్రురాలై న్యాయవాద వృత్తి స్వీకరించింది .వికలాంగుల సామజిక హక్కులకోసం వాదించింది .రచయిత్రి గా యెన్నో విషయాలపైన వ్రాసింది .తన ఆత్మకథ “ది స్టోరీ ఆఫ్ మై లైఫ్ “1903 లో వ్రాసింది .తన కష్టాలు ,అనుభవాలు ,తపన ,కృషి ,పట్టుదల ఆత్మకథలో ప్రతిబింబించాయి .ఈ పుస్తకం ప్రపంచవ్యాప్తం గా అందరి హృదయాలను తట్టింది .

హెలెన్ కిల్లర్ తన జీవనం లో ప్రతిక్షణం ఆనందం గా పరిపూర్ణం గా ఆస్వాదించారు .ఎందరికో వుత్తేజం కలిగించారు .దృష్టి లోపం ,వినికిడి లోపం .మాటాపలుకలేదు .ఆమె ఆత్మవిశ్వాసం ,ఆమెను మనం నేటికీ గుర్తు చేసుకునేలా మల్చుకున్నారు.

పాఠకులారా హెలెన్ కిల్లర్ ఆత్మకథ చదివాక ఆ మహోన్నతవ్యక్తిని గురించి మీతో పంచుకోలనిపించింది .నమస్తే !!