మనుషుల్లో దేవుడు - ambadipudi syamasundar rao

Manushullo devudu

గోదావరి జిల్లాల లోని పండితులు గోదావరి నదిలో స్నానమాచరించినప్పుడు సంకల్పంచెపుతున్నప్పుడు గోదావరి జిల్లాలను సస్యశ్యామలం చేసిన అపర భగీరథుడు సర్ ఆర్ధర్ కాటన్ ను ఈ విధముగా స్మరించుకుంటారు

"నిత్య గోదావరీ స్నాన పుణ్యదోయోమహమతిః

స్మరామ్యంగ్లీయ దేసీయం కాటనుం తం భగీరథం"

 

దీని అర్ధం "మాకు గోదావరి నది స్నాన పుణ్యాన్ని కలిగించిన అపర భగీరథుడు, ఆంగ్లదేశీయుడైన కాటన్ దొర గారిని ప్రతినిత్యం స్మరిస్తూ.తరిస్తున్నాము" మని అర్థం. "కాటన్ దొర" అని గోదావరి ప్రజలు అభిమానంగా పిలుచుకునే సర్ ఆర్థర్ కాటన్ తన జీవితాన్ని బ్రిటిష్ఇండియా సామ్రాజ్యం లో నీటి పారుదల , నావికాయోగ్యమైన కాలువలు కట్టించడానికి ధారపోశారు . ఆంధ్ర ప్రదేశ్ లో ధవలేశ్వరం ఆనకట్ట నిర్మించి ఎన్నో లక్షల ఎకరాలకు గోదావరి జలాలను అందించేలా చేసి చిరస్మరణీయులైనారు సర్ ఆర్థర్ కాటన్ 18 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాసులో ఉద్యోగంలో చేరారు. అప్పటి బ్రిటిష్ ఈస్టిండియా కంపెనీ ఈయనకు దక్షిణ ప్రాంత చెరువుల శాఖకు ఇంజనీర్ గా నియమించింది. 1847-52 సంవత్సరాల్లో గోదావరి నదిపై ధవలేశ్వరం వద్ద ఆనకట్ట నిర్మించారు. ఆరు లక్షల ఎకరాల భూమికి సాగునీరు అందుబాటులోకి వచ్చింది. కేవలం ఐదేళ్లలో పూర్తి చేశారు. కాటన్ కృషి చేసి విజయం సాధించిన ప్రాజెక్టుల్లో గోదావరిపై ధవలేశ్వరం వద్ద ఆనకట్ట, కాలువల నిర్మాణం మొదటగా చెప్పవచ్చు తమ పాలిట దుఖఃదాయిని గా ఉన్న గోదావరిని, ప్రాణహితగా మార్చిన భగీరథుడుగా ఈరెండుజిల్లాల ప్రజలగుండెల్లో నిలచిపోయాడు

ఆర్థర్ కాటన్ 1803, మే 15న హెన్రీ కాల్వెలీ కాటన్ దంపతులకు పదవ కుమారునిగా జన్మించాడు. వివిధ వృత్తులలో స్థిరపడి జీవనం సాగించిన పదకొండు మంది సోదరులలో కాటన్ ఒకడు. 15 సంవత్సరాల వయసులో కాటన్ 1818లో మిలటరీలో క్యాడెట్ గా చేరి అడ్డిస్‌కాంబ్ వద్ద ఈస్టిండియా కంపెనీ యొక్క ఆర్టిలరీ, ఇంజనీరింగు సర్వీసులలో శిక్షణ పొందాడు. 1819లో రాయల్ ఇంజనీర్స్ దళంలో సెకండ్ లెఫ్టెనెంట్ గా నియమితుడయ్యాడు. సర్‌ ఆర్థర్‌ కాటన్‌ 18 ఏళ్ల వయసులో భారతదేశానికి వచ్చి మొదటిసారిగా మద్రాస్‌లో ఉద్యోగార్థం చేరాడు 1836-38 సంవత్సరాల్లో కాటన్ కొలెనూర్ నదిపై ఆనకట్ట నిర్మించారు. ఇది తమిళనాడు రాష్ట్రం తంజావూరు లో ఉంది. కృష్ణా నదిపై విజయవాడ వద్ద ప్రకాశం బ్యారేజీ నిర్మాణానికి కృషి చేశారు

అంతేకాకుండా బెంగాల్, ఒరిస్సా, బీహార్ మొదలైన ప్రాంతాల్లో నదులను మానవోపయోగ్యమ చేయడానికి ఎన్నో పరిశోధనలు, పరిశీలనలు చేశారు. తెలుగు వారే కాదు తమిళనాడు, బెంగాల్, ఒరియా ప్రజలతో పాటు మొత్తం భారతీయ ప్రజలందరూ ఆయనకు శాశ్వత రుణగ్రస్తులు. భారతదేశంలో ఆయన చేసిన కృషిని వ్యతిరేకించేవారు ఇంగ్లాండ్ దేశంలో ఉండేవారు . కాటన్ పై చర్చ లేవనెత్తారు. ఇండియాలో కాటన్ చేసిన పనులు సత్ఫలితాలు ఇవ్వలేదని, దండుగని తగిన విచారణ జరగాలన్నారు. కామర్స్ సభలో చర్చ జరిగింది. ఫలితంగా కాటన్ పనులపై విచారణకు సెలెక్ట్ కమిటీని నియమించారు. 1878లో లార్డ్ జార్జ్ హే మిల్టన్ అధ్యక్షతన ఏర్పడిన ఈ సంఘం 900 పైచిలికు ప్రశ్నలు వేసి కాటన్ ప్రశ్నించారు. అయినా నాడు కామర్స్ సభలో జరిగిన చర్చలకు సెలెక్ట్ కమిటీ వేసిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పగలిగాడు. 1860లో కాటన్ రిటైర్డ్ అయ్యి ఇంగ్లాండ్ వెళ్ళిపోయారు.1861లో కాటన్ సర్‌ బిరుదాంకితుడైనాడు. 1899 జులై 24న అంటే 96 సం.2నెలలు జీవించి సర్ ఆర్థర్ కాటన్ చనిపోయాడు

ఆయన మొదటి నుండి ఒక వాదన చేస్తూ వచ్చాడు. భారతడేశానికి రైళ్లకంటె కాలువల వలన ఎక్కువ ఉపయోగం ఉంటుందని అతని ఉద్దేశం, అన్ని పంటలకూ, ప్రయాణాలకూ పనికొస్తాయని వాదించేవాడు. ఈ వాదనను వ్యతిరేకించేవారు ఎప్పుడూ ఉండనే ఉన్నారు. వారంతా ఇంగ్లండులో కాటన్ పై చర్చ లేవనెత్తారు. కాటన్ మరణానంతరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ధవలేశ్వరం ఆనకట్ట వద్ద కాటన్ పేరుతో మ్యూజియంలో ఏర్పాటు చేసింది. దీనిలో ఆనకట్ట నిర్మాణంలో వాడిన 160 సంవత్సరాల నాటి పురాతన యంత్రాలు (స్ట్రీమ్ బాయిలర్స్ , కంపల్ షర్ట్స్ , బోరింగ్ యంత్రాలు మొదలైనవి) కుడివైపున రెండు ఫిరంగులు ఉంచారు. ఆనకట్ట నిర్మాణం నకు సంబంధించిన చిత్రాలు ఉన్నాయి. మ్యూజియం బయట ఆవరణలో గోదావరి నది నాసిక్ లో పుట్టి బంగాళాఖాతంలో కలిసే వరకు చూపించే నమూనా కలదు ఇంచుమించు గోదావరి జిల్లాల లోని గ్రామాలలో కాటన్ దొర గుర్రం మీద ఉన్న విగ్రహాలు ప్రతిష్ఠించుకొని అయన పట్ల వారి భక్తి ప్రపత్తులను తెలియజేస్తుంటారు .

 

 (సర్ ఆర్థర్ కాటన్ వర్ధంతి జూలై 24)

 
 

మరిన్ని వ్యాసాలు

ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అడగడం నావంతు.
అడగడం నావంతు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు