కల్యాణ వైభవం. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

కల్యాణ వైభవం.

కల్యాణం కమనీయం .
హిందూ సంస్కృతిని అనుసరించి మానవుడు నాలుగు ఆశ్రమ ధర్మాలలో ఏదో ఒకదానిని స్వీకరించి జీవన్ముక్తిని పొందవచ్చు. అవి:
బ్రహ్మచర్యము - గృహస్తము - వానప్రస్థము - సన్యాసము .
ఈ ఆశ్రమములను చతుర్వర్ణాలలో మానసిక సంస్కారమును బట్టి అందరూ ఆచరించవచును.
బ్రహ్మచారికి వేదాధ్యయనము, గురు శుశ్రూష, ఇంద్రియ నిగ్రహము, పెద్దలయందు గౌరవము ప్రధాన ధర్మములు.
గృహస్థునకు ఏకపత్నీవ్రతము, తల్లిదండ్రుల సేవ, అతిథి సత్కారము, ధర్మ సంతానము, ఆచార నిర్వహణము, ఆనాథులయందు ఆదరణ, బీదలకు సహకారము ప్రధానములు.
వానప్రస్థుడు ధర్మ వ్యవహారబద్ధుడై వయోభారాన్ని దృష్టిలో ఉంచుకొని, కర్మలయందు స్వార్ధమును వీడి సంతానమునకు వ్యవహార మప్పగించి ధర్మపత్నితో కందమూలాదుల నాహారించి తపమాచరించడం ధర్మము.
వైర్యాగ్యము కలిగి ధర్మపత్నిని సంతానమున కప్పగించి కామక్రోధాదులను జయించి నిర్లిప్తుడై శేష జీవితమును లోకొద్ధరణకై ధర్మ ప్రబోధనైక లక్ష్యముతో ఆత్మ సాక్షాత్కారంతో సన్యసించుట సన్యాసాశ్రమము.
వీటిలో గృహస్తం గురించి తెలుసుకుందాం !
వివాహం కుటుంబాన్ని ఏర్పరుస్తుంది.కుటుంబం సాంస్క్రతిక జీవనమార్గానికి తొలి మజిలి.కుటుంబం ఏర్పడటం ప్రారంభించింది అంటే ఆజాతి నాగరికత వృధ్ధిలోనికి వస్తుందని అర్ధం.సమాజంయొక్క అతి సూక్ష్మరూపం కుటుంబం.ఆర్ధిక,పాలనాదివంటి ఏన్నో కలగలసిన వివాహం కుటుంబాన్ని,తద్వారా ఒక జాతి చరిత్రను నిర్మిస్తుంది.
వివాహ సమయంలో జరిగే వైదిక క్రియలను దృష్టిలో పెట్టుకొని, పరిణయం,ఉద్వాహం,కల్యాణం,పాణిగ్రహణం,పాణీపీడన,పాణీబంధం,దారోపసంగ్రహణం,దారపరిగ్రహణం,దారకర్మ,దారక్రియ,పెండ్లి,అనేపదాలను వివాహానికి పర్యాయపదాలుగా నిర్ణయించారు.
వివాహ వ్యవస్ధ ఏర్పడిన నాటినుండి అందులో ఎన్నోమార్పులు చేర్పులు వస్తూనే ఉన్నాయి.వివాహాన్ని మను ధర్మశాస్త్రంలో ఎనిమిది రకాలుగా వర్ణంచారు.అవి....
1)బ్రహ్మం.2) దైవం.3) ఆర్షం.4) ప్రాజాపత్యం.5) గాంధర్వం.6) రాక్షసం.7) ఆసురం.8) పైశాచం.
1)బ్రహ్మం-అంటే,శుభలక్షణాలుఉన్నబ్రహ్మచారిని ఆదరంగా ఆహ్వానించి, కన్యాదానం చేయడం.
2) దైవం-అంటే,యజ్ఞంలో ఋత్విక్కుగా పాల్గోటుంన్నవెక్తికి కన్యను అలంకరించి వివాహం జరిపించుట.
3) ఆర్షం-అంటే,వరుని వద్దనుండి రెండు పాడిఆవులు తీసుకుని తనకుమార్తెను ఇచ్చి వివాహం జరిపించటం.
4) ప్రజాపత్యం-అంటే,ఎప్పటినుండో కలసి మెలసి ఉండి గృహస్ధశ్రమ ధర్మలను చక్కగా నిర్వహించండి అని ప్రతిజ్ఞ చేయించి వివాహం జరిపించుట.
5) ఆసురం-అంటే,కన్యాదానం చేసినందుకు ప్రతిఫలంగా అల్లునివద్ద కన్యాసుల్కం తీసుకుని వివాహం జరిపించడం.
6) గాంధర్వం-అంటే,యువతి,యువకుడు పరస్పరం ఇష్టపడి పెద్దలకు తెలియకుండా రహస్యంగా వివాహం చేసుకోవడం.
7) రాక్షసం-అంటే,కన్యతరపువారితో యుద్ధంచేసి,కన్యను అపహరించి వివాహం చేసుకొనుట.
8) పైశాచికం-అంటే,మనసుపడిన కన్యను మోసగించి లేక బలత్కరించి,నిద్రిస్తున్నసమయంలో వివాహం చేసుకోవడం.
గతంలో ఐదు రోజుల పెండ్లిళ్లు జరుగుతుండేవి.మొదటిరోజు కార్యక్రమాన్ని 'వరప్రేషణం ' అంటే లగ్నపత్రిక పంపటం,వచ్చినవారిని ఊరి చివరనుండి విడిదికి మేళతాళాలతో ఆహ్వానించడం. ' సిమంతపూజ ' దీనినే నేడు 'ఎదురుకోల' స్వాగత,సత్కారాలతో ఆహ్వానించడం.రెండోరోజు ఇరువర్గాలవారు వంశవృక్షాలను వారి పూర్వికుల గోప్పదనాలను వివరించుకుని,వరునికి గోదానం చేస్తారు.మూడవరోజు ఇరువర్గాలవారు శక్తికొద్ది దానం చేస్తారు. నాలుగువ రోజు ' నిష్క్రమణం ' అలంకరించిన వేదికపై కల్యాణం జరుపుతారు.ఐదవరోజు దాస,దాసిలతో,స్త్రీధనంతో వధువు వరుని యింటికి తరలి వెళ్లడం.
ఈ వివాహా వేడుకలలో వరుని కాళ్లు వధువు తండ్రి కడగడానికి అర్ధం వరుడు శ్రీమహావిష్ణువుగా భావించడం.
ధర్మేచ..అర్ధచ..కామేచ..నాతిచరామి..అని వరునితో కన్యాదాత ప్రతిజ్ఞ చేయిస్తాడు.కల్యాణ వేదికపై తెరతొలిగించి వధూవరులు ఒకరిని ఒకరు చూసుకునే సమయాన్ని ' సమీక్షణం ' లేక 'నిరిక్షణ' జిలకర్ర,బెల్లం బ్రహ్మరంధ్రంపై ఉంచడం శుభ ముహార్తానికి నాంది. ' మాంగల్యం తంతునానేన మమ జీవన హేతునా ' కంఠే బధ్నామి సుభగే'త్వం జీవశరదాం శతమ్ 'వధూ వరులు వేశే ప్రతి అడుగుకు ఓప్రాధాన్యత ఉంది.' ఏకమిషే విష్ణుస్త్వా అన్వేతు, ద్వేఊర్జే విష్ణుస్త్వా అన్వేతు...' వధూవరులు వేసే ఏడు అడుగులలో మొదటి అడుగు ఆహారాన్ని,రెండవ అడుగు బలాన్ని,మూడవ అడుగు శుభ కార్యాలను,నాల్గవ అడుగువల్ల సౌఖ్యాన్ని,ఐదవ అడుగువల్ల పశు సంపదను,ఆరవ అడుగువలన ఋతుసంబంధాలను,ఏడవ అడుగు వలన ఏడుగురు హాతలను అనుగ్రహించాలని వేడుకుంటారు. ఈ వివాహ వ్యవస్ధలో అనేక కులాల,మతల వారిగా పలు సంప్రదాయాలు ఉన్నాయి.
డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.

మరిన్ని వ్యాసాలు

Kashi Prayana Kathalu - tikkala raju
కాశీ ప్రయాణ కథలు - తిక్కలరాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Baruvu badhyatha
బరువు బాధ్యత!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - Sthithapragnudu
కాశీ ప్రయాణ కథలు - స్థితప్రజ్ఞుడు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Offer lo konna jeevitham
ఆఫర్‌లో కొన్న జీవితం !
- బొల్లిముంత వెంకట రమణారావు
Kashi Prayana Kathalu - vikatakavi telivi
కాశీ ప్రయాణ కథలు - వికటకవి తెలివి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు