దక్షిణ తమిళనాడు లోని శివగంగై జిల్లా లో కారైకుడి సమీపంలోని ఉన్న కర్పగ వినాయగర్ ఆలయమును రాతికొండను తొలచి తయారు చేసారు. ఇక్కడ ప్రధాన దైవం శివుడు.ఈ వినాయకుడు అతి ప్రాచీన వినాయకుడు.తెలుగులో మనం కల్పవృక్షం అని అంటాము అంటే ఆ వృక్షము దగ్గర ఏది కోరుకుంటే అది లభిస్తుంది .ఆ విధమైన కల్పవృక్ష వినాయక స్వరూపంను తమిళములో కర్పగ వినాయకుడు అని అంటారు.అంటే కల్పవృక్ష వినాయకుడు అని.ఈ ప్రాంతం కల్కున్రట్టు తిరువింగైకుడి అని పిలువబడింది. క్రీ.శ 6వ శతాబ్దంలో తొలి పాండ్యన్ రాజులు తిరువింగైకుడి మహాదేవ దేవాలయం అనే శివాలయాన్ని నిర్మించారు. శివాలయ ద్వారం ముందున్న గుహ గోడపై ఈ యొక్క వినాయగర్ మూర్తి ని తయారు చేసిన శిల్పి పేరు "ఎకత్తూర్ కోన్ పెరుంతచన్" అని ఉన్నది.రెండు చేతులతో ఉన్న మూర్తి.కుడి చేతిలో లింగం ఉన్నది.
ఒక తరం సినిమా డీవీడీ ల వోల్గా వీడియోస్ అని వచ్చే సందర్భములో ఈ వినాయగర్ మూర్తిని మనలో చాలా మందిమి చూసాం ఆ మూర్తికి ఇంత చరిత్ర ఉన్నది..