సంత్ నరహరి సోనార్ - శివ పాండురంగ విఠల్ ( హరిహర మూర్తి )
మహారాష్ట్ర లోని పండరీపురం నందు విశ్వకర్మ వంశస్వర్ణకార వృత్తిజీవనము, శైవ సంప్రదాయ ఆరాధన చేసే నరహరిని ఒక వ్యాపారి తనకి సంతానం కలిగిన సందర్బములో కృతజ్ఞతగా పాండురంగ విఠల్ స్వామికి మొలత్రాడు వంటి నడుము పట్టి ఆభరణం చేయాలి అని అభ్యర్థిస్తాడు.తన యొక్క పరమ శైవ పద్ధతిని చెప్పి నరహరి విఠల్ గుడికి వెళ్లకుండా వ్యాపారికి తాడు ఇచ్చి కొలత ద్వారా చేసినది నాలుగు మార్లు చేసిన సరిగా అమరికగా లేకపోయేసరికి నరహరి తానె కళ్ళకు గంతలు కట్టుకొని తన చేతుల ద్వారా పాండురంగ విఠల్ స్వామి నడుము కొలత కోసం తడుముతుంటే ఆ మూర్తి నరహరికి తాను ఆరాధన చేసే శివ స్వరూపం తో సాక్షాత్కారమవుతుంది.తన మూర్ఖ భక్తి ని విడచి ప్రతిదీ కూడా దైవ స్వరూపముగా భావించి ఎన్నో అభంగ కీర్తనలు పాడి జీవ సమాధి చెందెను.
ఉత్తర భారతదేశం విశ్వకర్మ వంశ బ్రాహ్మణ పంచ గోత్రముల వారికి పేరు చివరన మహాముని , పండిత్, దీక్షిత్, వేదపాఠక్, ధర్మాధికారి.అని ఉంటుంది.మన తెలుగు ప్రాంతములో ఆచార్య అని ఉన్నట్టు గా ఉంటుంది.ప్రాచీన ప్రదేశమైన పండరీపురం లో విశ్వబ్రాహ్మణులు,యజుర్వేద శాఖకు చెందిన వారు గా తెలుస్తుంది. సదాశివ రామచంద్ర మహాముని, విశ్వబ్రాహ్మణ స్వర్ణకార వృత్తి వారు తదుపరి తరములో సెయింట్ నరహరి మహారాజ్ సుప్రసిద్ధులు, చరిత్రలో తెలిసిన మూలపురుషుడు గా ఉన్న రామచంద్రపంత్ సదాశివ మహాముని,అప్పటి శాలివాహన్ రాజు యొక్క సైన్యాధికారి అయినందున అతనికి నాయక్ అనే బిరుదు ఇవ్వబడింది.వీరి పాండిత్య కారణముగా తదుపరి కొద్దికాలం ప్రధాన మంత్రి హోదాలో పనిచేశారు.ప్రస్తుతం మనం చూస్తున్న పండరీపుర నగర నిర్మాణం వీరి కాలములోనే జరిగినది.ప్రధాని రామచంద్రపంత్ మహాముని విఠల్ విగ్రహంతో విఠల్ ఆలయాన్ని నిర్మించారు. 12వ శతాబ్దపు రాజు దేవగిరి రాజు రామచంద్ర యాదవ్, గారి ఆధ్వర్యంలో విశ్వ బ్రాహ్మణ శిల్పి హేమాద్రి పండిట్ పండరీపురం లోని విఠల్ ఆలయాన్ని పునర్నిర్మించారు.తదుపరి కొంత కాలం వరకు ఈ ఆలయం హొయసల సామ్రాజ్య పాలనలో ఉంది.రామచంద్ర పంథ్ సదాశివ మహాముని శైవ సంప్రదాయ ఆరాధకులు.అయినప్పటికీ విఠల్ స్వామి వారికి తానే స్వయముగా అర్చన అభిషేకం చేసేవారు.రుక్మిణి అమ్మవారి పూజ చేసేవారు.
రాజ్యంలో రాజ్యం యొక్క ప్రధాన మంత్రి బాధ్యతలు స్వీకరించిన తరువాత విఠల్ ఆలయ పర్యవేక్షణ బాధ్యతలు నిర్వహణ కష్టముగా మారిన సమయములో ఆలయ పూజా విధానాలతో సహా అన్ని వంశపారంపర్య హక్కులను ఒక లేఖ పత్రం ద్వారా సుదేవ బ్రాహ్మణ వంశస్థులు కు ఇచ్చివేశారు. ఆనాటి నుంచి విఠల్ ఆలయ నిర్వహణ వారికి సంక్రమించింది.వీరి వంశంలో తరానికి ఒక్కరు సన్యాసిగా ఉండేవారు
రామచంద్ర మనవడు హరిప్రసాద్ గారు కూడా వేద పండితుడు, శివుని ఆరాధించేవాడు, కాశీ విశ్వేశ్వరుడి పట్ల అతనికి ఉన్న విపరీతమైన భక్తి కారణంగా, అతను మరియు అతని కుటుంబం పండరీపురం నుంచి కాశీ ప్రాంతం వచ్చారు. కాశీ ప్రాంతంలోని కాశీ రాజుకు హరిప్రసాద్ పాండిత్యం గురించి తెలిసినది.కాశీ ప్రాంతంలో నివసించడానికి వచ్చిన హరి ప్రసాద్ మనవడు. చాల కాలం సంతానం లేని మురారికి కలలో శివుడు కనిపించి, త్వరలో నీ వంశములో అవతారంగా కొడుకు పుడతాడు అని చెప్పాడు , , అందుకే అతని కుమారుడు అచ్యుత్ బువ కాశీహున్ పంఢరపురానికి వచ్చి పంఢరపురంలో నివసించడం ప్రారంభించాడు.మురారి కూడా శివ సాంప్రదాయ సన్యాసి అయినా పిదప జల సమాధి చెందుతారు అతని పేరుతో కాశీ ప్రాంతంలో మురారి ఘాట్ అని ప్రసిద్ధి చెందింది.
పండరీపురం భీమా నది వద్ద లోహదండ తీర్థం (ఇనుప తీర్థం ) అనే పాపములు పోగొట్టే ప్రదేశం గా విశ్వకర్మచే నిర్మించబడింది గా ప్రాశస్త్యము ఉన్నది.పండరీపురం విచ్చేసిన యాత్రికులందరూ మధ్యాహ్న సమయంలో లోహదండ తీర్థానికి వచ్చి తీర్ధ స్నాన మాచరిస్తారు. భీమా నదీ పరీవాహక ప్రాంతం చౌఫాలా పశ్చిమాన పురాతన చిన్న దేవాలయం. పంచముఖ విరాట్ విశ్వకర్మ పరమేశ్వరుని దేవాలయం ఉన్నది.
మురారి యొక్క కుమారుడు అచ్యుత్ బువ కాశీహున్ పంఢరపురానికి వచ్చి పంఢరపురంలో నివసించడం ప్రారంభించాడు. అచ్యుత్ భార్యకు కుమారుడు 1313లో శ్రావణ శుద్ధ త్రయోదశి లో జన్మిచిన పిల్లవాడు నరహరి మహారాజ్.