
మన స్వతంత్ర సమరంలో భగత్ సింగ్,లాంటి విప్లవ వీరులు బ్రిటిష్ వారిపై దాడి చేసి బ్రిటిష్ వారి దమన నీతి బలి ఆయి ఉరి కంబం ఎక్కిన వీరులెందరో ఉన్నారు వారిలో చాలామంది చరిత్ర పుటల్లో కలిసిపోయారు కానీ అతి పిన్న వయస్సులో ఉరి కంభం ఎక్కిన స్వాతంత్ర సమారా యోధుడు ఖుదీ రాం బోస్ భారతీయ స్వాతంత్ర సమర వీరులలో మొదటి తరానికి చెందిన అతి పిన్న వయస్కుడు భారతీయులను హింసిస్తున్న బ్రిటిష్ అధికారి పై బాంబు వేసిన మొదటి సాహస వీరుడు ఆ కారణంగా అతనిని బ్రిటిష్ వారు ఉరి తీశారు ఆ విధముగా అతి పిన్న వయస్సులోనే అంటే 18 ఏళ్ల 7 నెలల 11రోజుల వయస్సుకే ఉరి తీయబడ్డాడు.బోస్ పశ్చిమ బెంగాల్ లోని మిడ్నపూర్ జిల్లాలోని హబీబ్ పూర్ లో 1889 డిసెంబర్ 3న త్రైలోక్య నాథ్ బోస్, లక్ష్మి ప్రియ దేవి దంపతులకు జన్మించాడు కానీ దురదృష్టవశాత్తు చిన్నతనంలోనే తల్లిదండ్రులను పోగొట్టుకున్నాడు.చదువుకునే రోజుల్లోనే ఆనాటి ప్రముఖులైన అరవింద ఘోష్ నివేదిత లేఖన వంటి వారి ఉపన్యాసాలకు ప్రభావితుడైనాడు. ఆ విధంగా బాల్యములోనే అతనిలో స్వతంత్ర కాంక్ష వృద్ధి చెందింది
మొదట్లో అఖ్రా అనే విప్లవ సంస్థలో చేరి తన నాయకత్వ లక్షణాలతో, సాహసోపేతమైన స్ఫూర్తితో అందరిని ఆకర్షించాడు.1905 లో జరిగిన బెంగాల్ విభజన అతడిలో బ్రిటిష్ ప్రభుత్వం పై కోపాన్ని కసిని పెంచింది.ఆ కోపం కసి వల్లే 16 ఏళ్ల వయస్సులోనే ప్రభుత్వ కార్యాలయాలు మరియు పోలీస్ స్టేషన్ల పై బాంబులు వేసి వాటిని పేల్చివేసాడు.1907ఆగస్టు 26 న ఒక కేసు విచారణ జరుగుతుండగా చాలా మంది యువకులు కోర్టు ముందు గుమిగూడి కోర్టు ఏ రకమైన తీర్పు ఇస్తుందో అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఆ యువకులు శాంతి యుతము గా ఉన్నప్పటికీ బ్రిటిష్ అధికారులు పోలీసులు వాళ్ళ లాఠీలకు పని చెప్పి యువకులందరిని చావ బాదారు కొద్దీ దూరములో నిలబడి ఈ తంతు చూస్తున్న సుశీల్ కుమార్ సేన్ అనే 15 ఏళ్ల కుర్రవాడికి ఆవేశం వచ్చి ఒక ఇంగ్లీష్ అధికారి మొహం మీద బలంగా ఒక గుద్దు గుద్దాడు. వెంటనే పోలీసులు ఆ కుర్రవాడిని అరెస్ట్ చేసి కోర్టు లో హాజరు పరిచారు ఈ కేసు విచారణ చేసే జడ్జ్ కింగ్స్ ఫోర్త్ అనే అధికారి ఆయనకు భారతీయుల పట్ల ద్వేషభావం ఎక్కువ ఫలితంగా ఆటను భారతీయుల పట్ల చాలా క్రూరంగా ప్రవర్తించేవాడు. చిన్నవాడు అనే దయ జాలి కనికరంలేకుండా సుశీల్ కుమార్ కు 15 కొరడా దెబ్బలు శిక్షగా విధించాడు. కానీ సుశీల్ కుమార్ ఏ మాత్రం భయం లేకుండా కొరడా దెబ్బలు తింటూ కూడా వందేమాతరం అని నినాదాలు చేస్తూనే ఉన్నాడు.
ఈ సంఘటన చూసిన ఖుదీరామ్ బోస్ ఇతర స్వతంత్ర వీరులలో ఆ జడ్జ్ కు గట్టి గుణ పాఠము చెప్పాలని నిర్ణయించు కున్నారు అటువంటి క్రూరుడైన భారతీయుల పట్ల ద్వేష భావం ఉన్న జడ్జ్ వల్ల భవిష్యత్తులో స్వాతంత్ర సమరయోధులకు కష్టాలే అని భావించి ఎలాగైనా అ జడ్జ్ ని చంపాలని నిర్ణయానికి వచ్చారు దీనికి పధక రచన 1908 ఏప్రిల్ మొదటి వారంలో కలకత్తా లోని జుగాంతర్ అనే విప్లవ సంస్థలో రహస్య సమావేశం లో జరిగింది.ఈ పనికి ఖుదీరాం బోస్, మరియు ప్రఫుల్ల చాకి లను నియమించారు. వీరిద్దరూ 1908 ఏప్రిల్ 30 రాత్రి ముజఫర్ పూర్ లోని యూరోపియన్ క్లబ్ కు ఒక బాంబు ఒక రివాల్వర్ తీసుకు వెళ్లారు కింగ్స్ ఫోర్డ్ క్లబ్ వాహనం బయటకు రాగానే దానిపై బాంబు విసిరేసి ఇద్దరు చెరో దిక్కుకు పరిగెత్తి వెళ్లిపోయారు.
అయితే ఖుదీరాం, ప్రఫుల్లచాకిలు గమనించని విషయం ఏమిటంటే అసలు ఆ వాహనంలో కింగ్స్ ఫోర్డ్ లేడు. అతని భార్య, కుమార్తెలు మాత్రమే ఉన్నారు.ఆ విధంగా జడ్జ్ ని బాంబు వేసి చంపుదామనుకున్న వారి పధకం విఫలమయింది ఆ జడ్జ్ భార్య కూతురు ఆ బాంబు దాడిలో మరణించారు. ఆ తరువాత ఒక రైల్వే స్టేషన్‌లో టీ తాగుతుండగా ఖుదీరాంబోస్‌ను పోలీసులు పట్టుకోగలిగారు. ఖుదీరాంను నిర్బంధించి రెండు నెలలపాటు విచారణ చేశారు. ముజఫర్ పూర్ బాంబు కేసులో ఫోర్డ్ భార్య, కుమార్తె ల మరణానికి కారకుడైన ఖుదీరామ్ కు మరణశిక్ష విధించారు. 1908 ఆగష్టు 11న ఈ శిక్ష అమలు పరచబడింది. ఏమైనా చెప్పాలనుకుంటున్నావా అని న్యాయాధికారి అడిగినప్పుడు, ఆ జనసంద్రమైన కోర్టు ఆవరణలో ఖుదీరాం " మీరు నాకు కొంచెం సమయమిస్తే బాంబుల తయారీ గురించి చదువుతాను" అని నవ్వి ఊరుకున్నాడు. పెదవులపై చిరునవ్వు చెదరకుండా ఖుదీరాం మృత్యువును ఆహ్వానించాడు. దేశం కోసం చిన్న వయస్సులోనే బలిదానం చేశాడు బోస్ పట్టుబడిన రైల్వే స్టేషన్‌కు ఖుదీరాం బోస్ పూసా అని ఈ మధ్యే పేరు పెట్టారు బోస్ జీవితం ఆధారంగా ఖుదీరాం బోస్ చిత్రాన్ని జాగర్లమూడి పార్వతి సమర్పణలో తెరకెక్కించారు. ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ బెంగాలీ భాషల్లోకి సినిమాగా రూపొందించబడింది. ఈ చిత్రం లో రాకేష్ జాగర్లమూడి,వివేక్ ఒబెరాయ్,అతుల్ కులకర్ణి,నాజర్, రవి బాబు వంటి నటులు నటించారు.
.