మ్యూజియం - రవిశంకర్ అవధానం

Museam

"రా రాముడు , రా ! ఎలా ఉన్నావ్ ? ఆప్యాయంగా ఇంట్లోకి ఆహ్వానించాడు నరసింహం, బావ మర్దిని.

" బాగున్నాం బావ. మీరేలా ఉన్నారు! అంటూ ఫ్యాన్ కింద ఉన్న సోఫా లో కూర్చున్నాడు రమేష్ . రాముడు ఇంట్లో వాళ్ళు పిలిచే పేరు.

"మీ అన్న వచ్చాడు , నీళ్లు , కాఫీ తీసుకురా" , అంటూ శకుంతల కి చెప్పాడు నరసింహం . "చేతికేంటి ఆ కట్టు ? కూరలు తరిగినట్టున్నావ్ !" నవ్వుతూ అన్నాడు నరసింహం.

"లేదు బావ , గూట్లో ఉన్న తాళాలు ఏదో ధ్యాసలో తీస్తుంటే , అక్కడ ఉన్న ఒక పాత డబ్బా మూత అంచు గుచ్చుకొని , ఇదో ఇలా !' అంటూ వేలుని చూపించాడు.

"అయ్యో , పాత డబ్బా రేకు అంటున్నవ్ , టెటనస్ ఇంజక్షన్ వేయించావా ? అడిగాడు నరసింహం.

లేదు బావ , ఒకటి రెండు రోజులు చూసి , గాయం మానకుంటే అప్పుడు చూస్తా " అంటూ నవ్వాడు రమేష్ .

"అవునూ , ఆ పాత డబ్బా కధ ఏంటో " ఆసక్తిగా అడిగాడు నరసింహం.

"పారీ , చాక్లెట్ డబ్బా బావ , అప్పట్లో వచ్చేది కదా ! అది దాచి ఉంచాం " అన్నాడు రమేష్ .

"అబ్బో ! అంటే దాదాపు 30 ఏళ్ల నాటి డబ్బా అన్నమాట " అన్నాడు నరసింహం .

"అయ్యో బావా ! ఒకటి కాదులే ఇలా, అవీ – ఇవీ , దానికి పనికొస్తుందని , దీనికి పనికొస్తుందని , ఇనుప డబ్బాలు, ప్లాస్టిక్ డబ్బాలు, గిన్నెలు , బట్టలు , బుక్కులు , బాటిళ్లు , అట్టపెట్టలు , పాత ఎలక్ట్రిక్ వయర్లు , ప్లగ్గులు , పాత క్యాలెండర్లు , ఫ్రేములు , ఇంకా ఎన్నో . ఇవి కాకుండా పిల్లల గుర్తు గా వాళ్ళ బ్యాగులు, బొమ్మలు , బట్టలు , పుస్తకాలు వగైరా . కొన్ని నేను పడేద్దాం అంటే ఆమె ఒప్పుకోక , తాను పడేస్తానంటే కొన్ని నేను ఒప్పుకోక , ఇల్లంతా ఒక మ్యూజియం అనుకో బావా" అంటూ కాఫీ కప్పు పక్కన పెట్టాడు రమేష్ .

"ఇంటింటి రామాయణం రా రాముడు ఇది ! అన్నాడు నరసింహం .

"ఎందుకో బావ ఇలాగ ? మన ఇండియ లోనే ఇలానేమో బావ ? అన్నాడు

"లేదు రాముడు , ఇదొక జబ్బు లాంటిది . ప్రపంచ వ్యాప్తంగా ఉందిలే ఇది .

"జబ్బా ?" ఆశ్చర్యంగా అడిగాడు , రమేష్.

"హోర్డింగ్ డిజార్డర్ (HD) అనేది ఒక మానసిక స్థితి. వస్తువుల ఉపయోగం అయిపోయిన వాటి తాలూకా అనుభవాలు , తీపి లేదా మర్చిపోలేని , జీవితానికి ముడి పడి ఉన్న అనుభవాల వల్ల , మనం ఆ వస్తువులను పడేయకుండా , అలా నే ఉంచేస్తూ ఉంటాం . వాటిని అసలు మనం జీవితం లో మళ్ళీ వాడమేమో! దీని ఫలితంగా వస్తువులు పేరుకుపోతాయి, ఇది ఇళ్లలో సాధారణ జీవనానికి ఆటంకం కలిగించి , అయోమయానికి దారితీస్తుంది. ఈ మానసిక వ్యాధిని సుమారు 2013 సంవత్సరం లో ధృవీకరించారు. ఈ ధోరణులు తరచుగా బాల్యం లేదా ఆ పై దశలో ప్రారంభమవుతాయి, అయితే అవి సాధారణంగా యుక్తవయస్సులో, తరచుగా 20 నుండి 30 సంవత్సరాల మధ్య గుర్తించబడతాయి. ఇది కాలక్రమేణా అభివృద్ధి చెందుతుంది. హోర్డింగ్ డిజార్డర్ ఉన్న వ్యక్తులు తరచుగా వస్తువులతో భావోద్వేగ అనుబంధాలను కలిగి ఉంటారు, భవిష్యత్తులో వారికి అవి అవసరమని నమ్ముతారు లేదా వారి ఆస్తులతో చుట్టుముట్టబడినట్లు భావిస్తారు.

"మరి దీనికి మందే లేదా బావ ?" నవ్వుతూ అడిగాడు రమేష్ .

"ఇది బాగా ముదిరి , మన దైనందిక జీవితము లో ఊహించని ఇబ్బందులు తెస్తే గనక, కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ (CBT), అంటే ఇది అత్యంత ప్రభావవంతమైన చికిత్స. హోర్డింగ్కు దారితీసే నమ్మకాలు మరియు భయాలను గుర్తించడం , తద్వారా కౌన్సిలింగ్ చేయటం జరుగుతుంది.మరీ ముదిరితే , యాంటిడిప్రెసెంట్స్ కొన్నిసార్లు సూచించబడతాయి, ప్రత్యేకించి వ్యక్తి కూడా నిరాశ లేదా ఆందోళన కలిగి ఉంటే.

"ఓహ్ ! ఇదొక డిప్రెషన్ లాంటిదన్నమాట !" అన్నాడు రమేష్ .

"కరెక్ట్ ! హోర్డింగ్ రుగ్మత గురించి వ్యక్తులు మరియు వారి కుటుంబాలకు బోధించడం, ఏ వస్తువులను ఎలా పెట్టుకోవాలో నేర్పించటం , కొన్ని పాత వస్తువుల వల్ల కలిగే అలర్జీలు , జబ్బులని వివరించడం , కొన్నిసార్లు, నిపుణులు జీవన వాతావరణాన్ని సురక్షితంగా క్లియర్ చేయడానికి చికిత్సకుల పర్యవేక్షణలో సహాయం చేస్తారు.

అసలు సమస్య , ఈ వ్యాధిని గుర్తించటం. ఈ లక్షణాలు ఉన్న వాళ్లంతా ఈ వ్యాధి ఉన్నవాళ్లు కాదు . శృతి మించితే నే ఈ చికిత్సలు . ఆ శృతే తెలియదు " అంటూ నవ్వేసాడు నరసింహం.

ఇన్ని చెప్పిన మనిషి , నిబ్బు విరిగిన పెన్నులు, రీఫిల్స్ లేని పెన్నులు , వీసుకోని ఎన్నో దుస్తులు వాడని పాత సెల్ ఫోన్ కవర్లు , రిమోటలు , ఇవన్నీ ఎందుకు పడేయలేదో అన్నయ్యా , ఆయన్ని " అంది శకుంతల .

"ఇప్పుడు అన్నా- చెల్లి కలిసి నాకు CBT చికిత్స చేయిస్తారా ఏంటీ ? " అంటూ తన ఈవెనింగ్ వాక్ కి లేచాడు నరసింహం.
 

మరిన్ని వ్యాసాలు

సిని నారదులు.3.
సిని నారదులు.3.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు.2.
సిని నారదులు.2.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సిని నారదులు 1.
సిని నారదులు 1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Work From Home
వర్క్ ఫ్రమ్ హోమ్
- రవిశంకర్ అవధానం
Screen TIme
స్క్రీన్ టైం
- రవిశంకర్ అవధానం