
ఆదివారం మధ్యాహ్నం, రోహన్ లివింగ్ రూమ్ సోఫాకు, తన ఫోన్‌కు అతుక్కుపోయాడు. తాత నరసింహం, తన థర్మోస్ ఫ్లాస్క్ నుండి వేడి నీటిని సిప్ చేస్తూ, రోహన్ తన ఫోన్ ద్వారా స్క్రోల్ చేయడం గమనించాడు.
“రోహన్, నరసింహం కళ్ళద్దాలు సర్దుకుంటూ, ‘స్మార్ట్ ఫోన్’లో అంత ఫోకస్ గా నువ్వు చూస్తున్న సబ్జెక్ట్ ఏంటి?” అని అడిగాడు.
"గూగ్లింగ్, తాత," రోహన్ పైకి చూడకుండానే సమాధానం చెప్పాడు.
నరసింహం నవ్వాడు. “ఆహ్, ‘గూగ్లింగ్.’ ఆ రోజుల్లో, మేము విషయాలు, లైబ్రరి వస్తువుల కోసం వెతకాలి. 'గూగుల్ ఇట్' అని చెప్పే సగం మందికి అది కంపెనీ పేరు అని కూడా తెలియదని నేను పందెం వేస్తున్నాను, నువ్వు అంగీకరిస్తావా?" అన్నాడు.
“అవును, తాతయ్య, పెద్ద విషయం ఏమిటి? అది అందరికీ తెలుసు.” రోహన్ నిర్మొహమాటంగా తల ఊపాడు.
“నిజంగానా? అప్పుడు ఒక ఆట ఆడుకుందాం. మనం ప్రతిరోజూ ఉపయోగించే కొన్ని పదాలను నేను నిన్ను అడుగుతాను, వాటి మూలాలు మరియు నేపథ్యాన్ని నువ్వు నాకు చెప్పాలి. డీల్?" అన్నాడు నరసింహం.
"సరే, స్మార్ట్ బాయ్ . రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడం అంటే ఏంటి ? చెప్పు" అన్నాడు
రోహన్ ఒక్క క్షణం ఆలోచించాడు. "ఉహ్, దీని అర్థం పరీక్షలో కాపీ వంటివి చేయడం వంటి చేసి దొరకడం "
"నిజమే, కానీ ఇది స్కాట్లాండ్ నుండి వచ్చిన పదం. అప్పట్లో, ఎవరైనా చంపి తర్వాత వారి చేతుల్లో రక్తంతో పట్టుబడితే, అంతే ! ఆ రక్తమే ప్రూఫ్ గా వాళ్ళని పట్టుకుంటారు . రక్తం రెడ్ కాబట్టి అది "రెడ్-హ్యాండెడ్ " అనటం ప్రారంభించారు
"పరీక్ష చీటింగ్‌ని వారు సీరియస్‌గా తీసుకోనందుకు సంతోషం తాత ! లేక పోతే దానికి కూడా అరెస్ట్ చేసేవారేమో" రోహన్ భయంగా నవ్వాడు.
"నెక్స్ట్ ,జిరాక్స్ కాపీ" అన్నాడు నరసింహం .
"ఇది ఫోటోకాపీ కోసం వాడే పదం కదా ." రోహన్ నవ్వాడు.
తాత చప్పట్లు కొట్టాడు. “తప్పు! జిరాక్స్ అనేది బ్రాండ్ పేరు. ఫోటోకాపీ మెషిన్, కానీ ప్రజలు ఫోటోకాపీల కోసం దీనిని ఉపయోగించడం ప్రారంభించారు.
"సరే, సరే ,అందులో నష్టం ఏంటి ?" రోహన్ కాస్త ఇంట్రెస్టింగా అన్నాడు .
"అలాగా?,"రోహన్' అని పిలవకుండా , అందరూ నిన్ను 'సమ్ గై' అని పిలిస్తే ? ఆలోచించుకో " అన్నాడు నరసింహం .
"నౌ ఈజీ వన్ రా రోహన్ : సెల్లోఫేన్ టేప్." అడిగాడు నరసింహం
"అది జస్ట్ ఏ టేప్, తాత." రోహన్ కళ్ళు తిప్పుతూ అన్నాడు.
"నిజమే, కానీ 'సెల్లోఫేన్' అనేది ఒక రకమైన ప్లాస్టిక్ ర్యాప్‌కు ట్రేడ్‌మార్క్,. అన్ని టేప్‌ల కోసం దీనిని ఉపయోగించడం అనేది ప్రతి చాక్లెట్ బార్‌ను 'క్యాడ్బరీ' అని పిలవడం లాంటిది. ఇది మన సొంత బ్రాండింగ్!" అన్నాడు నరసింహం.
"బ్యాండ్-ఎయిడ్!" ఇది చెప్పు రోహన్ ".
"ఈజీ తాత !, ఇది మనం మన బాడీ మీద గాయాల కోసం వాడేది "
"అవును, కానీ అది కూడా బ్రాండ్ పేరు, చాలా ప్రజాదరణ పొందింది, ప్రజలు ఇది అన్నిటికీ అనడం అలవాటు .'బ్యాండ్-ఎయిడ్'ని కూడా ఒక పదం గా వాడేస్తారు !"
"తమ డిస్కషన్స్ కు బ్యాండ్-ఎయిడ్స్ వెయ్యండి అని అమ్మ , నాన్నకు చెప్పినట్లు?"
నరసింహం నవ్వాడు.
"వెల్క్రోను ?" అడిగాడు నరసింహం.
"ఇది తాత ?" రోహన్ తన వాచి స్ట్రాప్ లాగాడు.
"అవును, అయితే ఇది “హుక్ అండ్ లూప్ ఫాస్టెనర్” ల బ్రాండ్ పేరు" అని తాత చెప్పారు. "పోటీదారుల ఉత్పత్తులను 'వెల్క్రో' అని పిలిచినప్పుడు వెల్క్రో కంపెనీ ఎలా భావిస్తుందో ఊహించండి"
"నిజమా తాత ?"అంటూ రోహన్ గట్టిగా తల కొట్టుకున్నాడు.
నరసింహం కన్ను కొడుతూ నవ్వాడు .
"జీప్?" అడిగాడు నరసింహం.
"అది jeep ,….అదే తాత ….కార్ , come-on తాత " రోహన్ అన్నాడు.
"అది సైనిక వాహన బ్రాండ్. ఇప్పుడు, ఇది ఏదైనా ఆఫ్-రోడ్ వాహనం కోసం ఉపయోగించబడుతుంది. మీ నాన్న కూడా మా మారుతిని ‘జీప్’ అని పిలుస్తుంటారు!
రోహన్ నవ్వాడు.
"తాత , యు విన్ " అంటూ రోహన్ సెల్యూట్ చేసాడు .
"ఇలాగానే కొన్ని పదాలను మనం వాడుకలో అది ఒక వర్డ్ గా లేదా వెర్బ్ గా వాడేస్తుంటాం.
"ఇంకా ఉన్నాయా అలంటి పదాలు తాత ?" అడిగాడు రోహన్.
" ఎస్కలేటర్ , హూవర్ , గూగులింగ్ , ఇలా చాలా ఉన్నాయ్. నువ్వు , బాగా చదివి జీవితం లో పైకొస్తే, నువ్వు ఒక బ్రాండ్ అవ్వొచ్చు. అందరూ , రోహన్ లా ఉండాలి అంటారు " అన్నాడు నరసింహం.
మొత్తానికి , మనవడిని తన మొబైల్‌ని పక్కన పెట్టేసేలాగా చేసాడు తాత .