కాశీ ప్రయాణ కథలు - ప్రభు భక్తి. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kaashi Prayana Kathalu - Prabhu Bhakthi

కాశీ ప్రయాణ కథలు - ప్రభు భక్తి.

పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.

రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.

"సోదరులారా ఈరోజు మీకు ప్రభు భక్తి అనే కథ చెపుతాను వినండి అన్న బ్రహ్మయ్య చెప్పడం ప్రారంభించాడు...

చందనపురిని త్రిలోచనడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు. తన రాజ్య శివార్లలలొని గ్రామాలపై సమీప అడవినుండి వచ్చిన కూృరమృగాలు దాడి చేయడంతో అక్కడి ప్రజల అబ్యర్ధనమేరకు కొందరి సైనికులను తీసుకుని వెళ్ళి అడవిలోని కూృరమృగాలను దూరంగా అడవిలోనికి తరుముతూ దారితప్పి అడవిలో తనతో పాటుగా వచ్చిన తన అంగరక్షకుడితో చిక్కుకు పోయాడు. ఎంతవెదికినా నీటి జాడ తెలియలేదు , అలసటగా ఓచెట్టు కింద కూర్చొండిపోయాడు రాజు.

"ప్రభూ నేను ఈపరిసరాలలో నీటి జాడ కనిపిస్తుందేమో చూసివస్తాను తమరు ఇక్కడే విశ్రాంతి పొందండి " అన్నాడు.

"నాయనా జాగ్రత్తగా వెళ్ళిరా " అన్నాడు రాజు.

కొంత సేపటీకి తిరిగి వచ్చిన అంగరక్షకుడు " ప్రభూ కనుచూపుమేరలలొ ఎక్కడా నీటి జాడ లేదు ఈ పండు ఒక్కటే లభించింది దీన్ని తమరు స్వీకరించి ఆకలి,దాహం తీర్చుకొండి " అని ఓపండును రాజుగారికి అందించిడు అంగరక్షకుడు. తనవద్దనున్న చిన్న కత్తితో ఆపండును నాలుగు భాగాలు చేసి రెండు భాగాలు తన అంగరక్షకుడికి అందించాడు రాజు. ఇంతలో కొంతదూరంలో ఏదో అలికిడి కావడంతో అటువైపుకు చూడసాగాడు రాజు. ' ప్రభూ నాఆకలి , దాహం తీరలేదు మీవద్దనున్న పండు రెండుభాగాలు నాకు ఇవ్వండి 'అన్నాడు అంగరక్షకుడు.

బాగా ఆకలి తో ఉన్నాడు అనుకుని రాజుగారు తన చేతిలోని పంండు సగిభాగం భటునకు అందించాడు.

క్షణకాలంలో రాజుగారు అందించిన పండుభాగాన్ని ఆరగించిన భటుడు " ప్రభువులు మన్నించాలి నాకు ఆకలి దాహం తీరలేదు తమరి చేతిలోని పండు భాగానన్నింకూడా నాకే ఇవ్వండి " అన్నాడు.

ఆశ్చర్యపోయినరాజు " నాయనా నీఆకలి బాధ నాకు అర్ధమైయింది పండులోని మూడు భాగాలు నువ్వె తిన్నావు నేనుకూడా ఆకలి ,దాహంతో ఉన్నాను ఈకొద్దిపాటి పండు నాఆకలి తీర్చకపోయినా దాహనికి ఉపశమనం కలుగుతుంది " అని చేతిలోని పండు ముక్కను తన నోట్లో పెట్టుకున్నా రాజుగారు " ఛీ..ఛీ "అనిం నోట్లోని ముక్కను విసిరివేసి " ఎలాతిన్నవయ్య ఇంత చేదుగా ఉన్న ఈపండును " అన్నాడు.

"ప్రభువుల కొలువు చేస్తూ వచ్చే ఆదాయంలో సుఖమయమైన జీవితం అనుభవిస్తూ, ఒక్క సారి మాత్రమే చేదుఫలం తినమని ఇస్తే ఎలా కాదనగలను.తమరు తినే పండులో సగభాగం నాఆకలి,దాహం గమనించి చ్చారు ,మిగిలి సగ భాగం చేదు పండు తమరు తిని ఇబ్బంంది పడకూడదనే అలా అడిగాను మన్నించండి, ప్రతిరోజు రుచికరమైన భోజనం, పండ్లు తినే నేను ప్రభువులు ప్రేమగా ఇచ్చిన చేదుపండు తినడం కష్టమని పించలేదు "అన్నడు వినయంగా భటుడు.

"గోరుముద్దలు పెట్టి గారాబంగా పెంచిన సంతతి తమ తల్లి,తండ్రిని వీధిలో వదిలేస్తున్న మనుషులున్న ఈలోకంలో నీలాంటి ప్రభు భక్తి పరులు ,

వృత్తినే దైవంగా భావించే నిన్ను అభినందిస్తున్నాను " అన్నాడు రాజుగారు.

ఇంతలో మిగిలి రాజుగారి పరివారం అక్కడకు చేరారు " అన్నాడు.

కథ ముగియడంతో అంతా నిద్రకు ఉపక్రమించారు.

మరిన్ని వ్యాసాలు