కాశీ ప్రయాణ కథలు - తేలు కుట్టిన దొంగలు - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kashi Prayana Kathalu - Telu Kuttina Dongalu

కాశీ ప్రయాణ కథలు - తేలు కుట్టిన దొంగలు

పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.

రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.

"సోదరులారా ఈరోజు మీకు తేలుకుట్టిన దొంగలు అనేకథ చెపుతాను...

చందనపురి రాజ్య శివార్లలోని సిరిపురం అనే గ్రామంలో సింగయ్య అనే ధనికుడు నివసిస్తు ఉండేవాడు , ఆచుట్టుపట్ల గ్రామాలలో అతడే ధనవంతుడు కావడంతో ధనం అవసరం పడిన వారికి అధిక వడ్డిలకు

ఇస్తూ,ఇచ్చిన ధనంకంటే రెట్టింపు చూపించి పోలాలు,ఇళ్ళు,బంగారం వంటివి తాకట్టు పెట్టించుకుని పత్రం రాయించుకుని సొత్తుదారులకు తను పత్రం రాసి ఇచ్చేవాడు .

ఒక రోజు రాత్రి సింగయ్య ఇంట్లో దొంగలుపడి బంగారం,ధనం,కుదువపెట్టి రాయించుకున్న పత్రాలు అన్ని తీసుకు వెళ్ళారు.

తెల్లవారుతూనే సింగయ్య గ్రామ న్యాయాధికారిని కలసి తన ఇంట జరిగిన దొంగతనం గురించి వివరించాడు.

రెండు రోజుల అనంతరం రాజభటులు ఇరువురు యువకులను బంధీలుగా తీసుకువచ్చి న్యాయాధికారిముందు నిలబెట్టి '' వీళ్ళే వడ్డి వ్యాపారి సింగయ్య ఇంట్లో దొంగతనం చేసింది " అన్నారు. "ఇది నిజమేనా మీరు ఆదొంగతనం చేసారా ? "అన్నాడు న్యాయాధికారి .

"మేము ఆదొంగతనం చేసింది నిజమే ,సింగయ్య అక్రమంగా తప్పుడు పత్రాలతో మావ్యవసాయ భూములు కాజేసాడు ఆకోపంతొనే ఈదొంగతనం చేసాము "అన్నారు.

"దొంగిలించిన సొమ్ము ఎక్కడ దాచారు " అన్నాడు న్యాయాధికారి.

"దొంగిలించినవి అన్ని మట్టి కుండలో పెట్టి అడవిలో దక్షణ భాగాన ఉన్న బాదం చెట్టు మొదట్లో భూమితొవ్వి అక్కడ భద్ర పరచాము, మమ్మల్ని అక్కడకు తీసుకువెళితే సొమ్ము దాచిన ప్రదేశం చూపిస్తాము " అన్నారు.

అందరు కలసి ఆయువకులు సొమ్ము దాచిన ప్రదేశానికి వెళ్ళేసరికి, అప్పటికే ఎవరో అక్కడ ఉన్నదంతా తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడి దృశ్యం చూసిన న్యాయాధికారి " దొంగిలించబడిన సేమ్ము దొరకలేదు కనక మిమ్ములను దోషులుగా నిర్ధారించి శిక్షించలేను సింగయ్యవలన మీకు అన్యాయం జరిగినా మీరు దొంగతనం చేయడం తప్పు చేసిన తప్పు నిజాయితీగా అంగీకరించినందున మిమ్మల్ని నిర్ధోషులుగా భావించి వదిలి వేస్తున్నాను మరెన్నడు తప్పుడు పనులు చేయకూడదని హెచ్చరిస్తున్నాను. రాజభటులు ఇక్కడ దాచబడినవి ఎవరు దొంగిలించారో విచారించండి, సింగయ్య గారు మీకు త్వరలోనే న్యాయం చేస్తాం అందరూ పదండి " అన్నాడు న్యాయమూర్తి.

కొద్దిరోజులలో పలువురు రైతులు తాము తీసుకున్నపైకము న్యాయమైన వడ్డి కలిపి చెల్లించి వెళ్ళసాగారు. పేదరైతులలోని నిజాయితికి తాను వారిపట్ల ప్రవర్తించిన తీరుకు తేలుకుట్టిన దొంగలా సిగ్గుపడిన సింగయ్య ,తన వ్యవసాయ భూములు అమ్మి తనవద్ద బంగారం తాకట్టు పెట్టిన వారందరికి వారి బంగారం ధర నిజాయితీగా చెల్లించాడు 'అన్నాడు శ్రీహరి.

కథ ముగియడంతో అంతా నిద్రకు ఉపక్రమించారు.

మరిన్ని వ్యాసాలు