సిని నారదులు.10. - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

సిని నారదులు.10.

డ్రిమ్ గర్ల్ అంటే హేమామాలిని అని ఠక్కున చెప్పగలం.తెలుగునాట డ్రిమ్ బాయ్ అని పిలిపించుకున్న నటుడు బుధ్ధరాజుఅప్పలహరనాధ్ రాజు.వీరు 1936 సెప్టెంబర్ 2న జన్మించారు.వీరితండ్రి.వరహాలరాజు తూర్పుగోదావరి జిల్లాలోని పిఠాపురం లో సంపన్నకుటుంబం. ఇంగ్లీషు బాగామాట్లాడేవారు, పత్రికలకు కథలు రాసేవారు వీరికి పిఠాపురంలో ఉండే దేవులపల్లి కృష్ణశాస్త్రి, పిఠాపురం రాజావారితో మంచి పరిచయం ఉండేది. రాజావారు కొద్దిరోజులు మద్రాసులోనూ కొద్దిరోజులు పిఠాపురంలోనూ గడిపేవారు.అలా వారితోపాటు మద్రాసువెళ్ళిన వరహాలరాజు అక్కడేమకాం మార్చారు. ప్

మన డ్రింమ్ బాయ్. చదువంతా మద్రాసులో సాగినా, డిగ్రీ చేసింది కాకినాడలో తరువాత కాలంలో నిర్మాతలైన జగపతి రాజేంద్రప్రసాద్, ఏడిదనాగేశ్వరరావు గార్లతో మంచి స్నేహంఉండేది.కప్పలు,-ఇనిస్పెక్టర్ జనరల్ నాటకాల్లొ రాజెంద్రప్రసాద్ ఆడవేషం,ఏడిదనాగేశ్వరరావు వృధ్ధుడి వేషం,హరనాధ్ కథానాయకుడు వేషం వేసేవారు.మద్రాసు వచ్చిన హరనాధ్ నటుడు ముక్కామల దర్శకత్వంలో 'బుష్యశృంగ'(1961) దీనికంటే ముందే హరనాధ్ నటించిన మరోచిత్రం నవశక్తివారి 'మాయింటిమహాలక్ష్శి' (1959)విడుదల అయింది.ఈచిత్రం సారధిస్టూడియో కట్టిన తరువాత మొదట నిర్మింపబడింది.నిర్మాతగా గంగాధరరావుకు,దర్శకుడిగా గుత్తా రామినీడుకు ఇదే తొలి చిత్రం.

నందమూరివారి 'సీతారామకళ్యాణం'(1961) చిత్రంలో రాముని పాత్ర హరనాధ్ కు మంచిగుర్తింపును తెచ్చింది.ఈ చిత్రం ద్వారానే మణి అనే పేరు కలిగిన మంచి నర్తకిని సీత పాత్రలో 'గీతాంజలి'పేరున పరిచయం చేయబడ్డారు,

నందమూరి,అక్కినేనిల తరువాత తెలుగులో హరనాధ్ బిజీ అయ్యాడు. అలా'కలసిఉంటేకలదుసుఖం'(1961)'భీష్మ'(1962)'పెంపుడుకూతురు'(1963) సర్వర్ సుందరం'(1966) 'మురళికృష్ణ'(1964) 'భక్తప్రహ్లాద'(1967) 'అమరలిల్పిజక్కన్న'(1964)' పల్నాటియుధ్ధం'(1966)' పెళ్ళిరోజు'(1968) పాలమనసులు'(1968) 'లేతమనసులు'(1966)' శ్రీదేవి'(1970)'నాదీ ఆడజన్మ'(1965) 'మదన కామరాజుకథ' (1962)' కథానాయకిమొల్ల' (1970) 'ఆడజన్మ'(1970) 'గుండమ్మకథ'(1962)'చిట్టిచెల్లెలు'(1970) 'పాండవవనవాసం'(1965)వంటి 177 తెలుగు,12తమిళం' 1హిందీ,1 కన్నడ చిత్రాలలోనటించాడు.అతను మందుకు బానిస అయ్యాడు. అందాలనటుడు ముఖం కళావిహీనంగా మారిపోయింది.అతని పతనం వెనుక పెద్ద కుట్రజరిగిందని పరిశ్రమలో పలువురు అభిప్రాయపడ్డారు. హరనాధ్ చివరి చిత్రం'నాగు' (1984)హరనాధ్ కుమారుడు శ్రీనివాసరాజు 'మాతెలుగు తల్లి'(1988) చిత్రంలో పరుచూరి బ్రదర్స్ దర్శకత్వంలో కథానాయకుడిగా నటించాడు.కృష్ణంరాజు ప్రోత్సహించినా నటుడిగా నిలదొక్కుకులేక పోయాడు.నిర్మాతగామారి'తొలిప్రేమ'(1998) చిత్రతీసి విజయం సాధించాడు.హరనాధ్ అందాలనటుడు.చేతిలో చిత్రాలు లేకపోయినా చివరివరకు రాజులానే జీవించారు.తన 53 ఏట తనువుచాలించారు.

డా.బెల్లంకొండనాగేశ్వరరావు.

మరిన్ని వ్యాసాలు

Robotic Surgery
రోబోటిక్ సర్జరీ
- డా:సి.హెచ్.ప్రతాప్
Digital yugamlo mahila bhadratha
డిజిటల్ యుగంలో మహిళా భద్రత
- డా:సి.హెచ్.ప్రతాప్
నాళం కృష్ణారావు.
నాళం కృష్ణారావు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Digital fencing
డిజిటల్ ఫెన్సింగ్
- డా:సి.హెచ్.ప్రతాప్