భువనగిరి రాజ్యాన్ని గుణశేఖరుడు పరిపాలిస్తుండేవాడు ,అతనిమంత్రిపేరు సుబుధ్ధి. రాజుగారి ఆర్ధిక సలహదారుని పదవికి తగిన వ్యక్తిని ఎంపిక చేసే పని మంత్రి సుబుధ్ధికి రాజు అప్పగించాడు.
ఆపదవికి పలువురు పోటీపడినప్పటికి రామన్న ,సోమన్న అనే ఇరువురు యువకులు చివరివరకు పోటీలో నిలిచారు.
వారి ఇరువురితో మంత్రి ' నాయనలారా మీతెలివికి చివరి పరిక్షఇది
మనరాజ్య పొలిమేరలలో ఉన్న సిరిపురం గ్రామంలో శివయ్య అనే వ్యాపారి ఉన్నాడు అతని అంగడిలో అన్నిరకాల వస్తువులు లభిస్తాయి మీకునేను అడిగినంత ధనం ఇస్తాను వాటితో శివయ్య అంగడిలో మీరు ఒకరి తరువాత మరొకరు సరుకులు కొనుగోలుచేసి మీవద్ద సహయకులుగా పనిచేయడానికి సహయకులుని
కూడా శివయ్యే ఏర్పాటు చేస్తాడు ,మూడురోజుల్లో మీరు నావద్ద తీసుకున్న ధనం రెట్టింపు చేసుకుని రావాలి ,మీ ఇరువురికి చెరో ఎడ్ల బండి ఏర్పాటు చేసాను .మీఇరువురు ఒకరు చేసే వ్యాపారం మరొకరికి తెలియకూడదు "అని ఇరువురు అడిగినంత ధనం ఇచ్చి ఎడ్లబండిదాకావచ్చి సాగనంపాడు మంత్రి.
మూడవరోజు సాయంత్రం వచ్చిన రామన్న " మంత్రివర్యా మీరు ఇచ్చిన ధనంతో నేను శివయ్య అంగడిలో వస్త్రాలు కేనుగోలు చేసాను
నేను తిరిగి వచ్చే దారిలో ఉన్న గ్రామాలలో వస్త్రాలు అమ్మతూవచ్చాను కాని వస్త్రాలు అన్ని అమ్ముడు పోలేదు కనుక కొద్దిపాటి లాభం మిగిలింది 'అన్నాడు.
మరికొద్దిసేపటికి వచ్చిన సోమన్న 'మంత్రివర్యా నేను శివయ్య అంగడిలో పిండివంటల సరుకులు ,ఇరువురు వంటవాళ్ళను తీసుకుని రాజధానికి వచ్చే దారిలోని గ్రామాలలో విచిత్రమైన వంటకాలు అంటే మునగాకు పకోడి, వాము ఆకు బజ్జిలు వంటి పలురకాల కొత్త రుచులు కలిగినవి అమ్ముతూవచ్చాను. మీరు ఇచ్చినధనం మూడు రెట్లు చేసాను అన్నాడు .
" సోమన్నా భళా మనుషుల తత్వం విచిత్రమైనది జీహ్వ చాపల్యం లేని మనిషి ఉండటం అరుదు ఎన్నడు తినని రుచులకోసం నీవంటకాలు తిన్నారు
ఎదటి వారి అవసరాలు తెలుసుకోవడం మంచిలక్షణం నీకే ఈపదవి " అన్నాడు మంత్రి.

