కాశీ ప్రయాణ కథలు - తిక్కలరాజు - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kashi Prayana Kathalu - tikkala raju

కాశీ ప్రయాణ కథలు - తిక్కలరాజు

పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.

రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.

సోదరులారా ఈరోజు మీకు తిక్కలరాజు అనే కథ చెపుతాను వినండి అని శ్రీహరి కథ చెప్పడం ప్రారంభించాడు ...

మత్య దేశాన్ని పాలించేరాజు చంద్రసేనుడు అతను వీరుడు,పరిపాలనాదక్షత కలిగి ప్రజలను బాగా చూసుకునేవాడు.అతనికి వేపకాయంత వెర్రి ,వెలగపండు అంత తిక్క ఉండేవి. అతని చేసేపనులు ప్రజలకు బాగా వినోదాన్ని కలిగించేవి.

ఒకరోజు చంద్రసేనుడు రాజ సభలో ఒక ప్రకటన చేస్తు ' ప్రజలారా మీలో ఎవరైనా నాగుర్రానికి కడుపునిండా ఆహరం పెడాతారో వారికి వంద వరహలు బహుమతి మరియు నాఆంతరంగ సహదారుడి పదవి ఇస్తాను . నిబంధన ఏమిటి అంటే మీరు గుర్రాన్ని నావద్దకు తీసుకు వచ్చినప్పుడు నేను దానికి పచ్చిగడ్డి పెడితే తినకూడదు 'అన్నాడు చంద్రసేనుడు.

ప్రతిరోజు ఎవరో ఒకరు వచ్చి గుర్రాని తమతో తీసుకువెళ్ళి గుర్రానికి కడుపునిండా పచ్చిగడ్డి,ఉలవ గుగిళ్ళు తినిపించి రాజు గారి వద్దకు తీసుకువచ్చేవారు తనవద్దకు వచ్చిన గుర్రానికి గుప్పెడు పచ్చిగడ్డి,మంచినీళ్ళు ఉంచగానే ఆగడ్డిని తిని ఆనీళ్ళను తాగేది గుర్రం.

తాము ఎంత గడ్డితినిపించి,నీళ్ళు తాపించినా రాజుగారి వద్దకు రాగానే గుర్రం మరలా గడ్డితిని నీళ్ళు ఎందుకు తాగుతుందో ఆగుర్రాని తెచ్చిన వారికి అర్ధమైఏదికాదు.

కొద్దిరోజుల అనంతరం గణపతి అనే యువకుడు ,చంద్రసేనుడి వద్దకువచ్చి

"మహరాజా నేను మీనిబంధనలకు ఒప్పుకుంటున్నాను కానీ పదిరోజుల సమయం మీగుర్రం నావద్ద ఉండేలా తమరు అనుమతించాలి " అన్నాడు.

"మాకు ఎలాంటి అభ్యంతిరం లేదు కాని మీవద్దనుండి గుర్రం మావద్దకు వచ్చినపుడు మేము పెట్టే పచ్చిగడ్డితిని ,నీళ్ళు తాగకూడదు అదేమా నిబంధన "అన్నాడు చంద్రసేనుడు.

"అలాగే మహరాజా "అని గుర్రాని తీసుకు వెళ్ళిన గణపతి పదిరోజుల అనంతరం వచ్చాడు. ఎప్పటిలా రాజ సభలో అందరిముందు గుర్రానికి పచ్చిగడ్డి అందించాడు మహరాజు. గుర్రం గడ్డి తినకుండా ముఖం పక్కకు తిప్పుకుంది, మంచినీరు గుర్రం ముందు పెట్టించాడు రాజుగారు. నీటికి దూరంగా వెళ్ళింది గుర్రం.

ఆశ్చర్యపోయిన చంద్రసేన మహరాజు ప్రకటించిన విధంగా వందవరహలతోపాటు తన సలహ దారుడిగా గణపతిని నియమించుకున్నాడు.

గణపతి తెలివితేటలతో క్రమంగా రాజుగారిలో మార్పు తీసుకువచ్చాడు.

అదిచూసిన మత్స్య దేశప్రజలు ఆందించి,గణపతిని అభినందించారు.

సొదరులారా కథ విన్నారుగా గణపతి గుర్రాన్నిరాజసభలో గడ్డి,నీళ్ళు తీసుకోకుండా ఏలా మార్చగలిగాడో చెప్పగలరా "అన్నాడు శ్రీహరి.

"నాధా గతంలో గుర్రాని తీసుకువెళ్ళినవారు దానికి ఎంత ఆహరం పెట్టినా

అక్కడనుడి రాజసభకు నడచి రావడంతో ఆహరం అరిగిపోవడంతో పాటుగా దాహంవేసేది అందుకే గుర్రం రాజసభలో ప్రవేసించా కొద్దిగా గడ్డి తిని నీళ్ళు తాగేది అలా దాని ప్రయాణ బడలిక తీర్చుకునేది. గణపతి తెలివైన వాడు తనవద్ద ఉన్న గుర్రానికి రాత్రులు మాత్రమే పచ్చిగడ్డి,చల్లటి నీళ్ళు,గుగిళ్ళు అందించేవాడు,పగటి సమయంలో వేపఆకుల రసం కలిపిన పచ్చిగడ్డి, వేడిగా మరిగిన నీళ్ళు గుర్రం ముందు పెట్టేవాడు, చేదుగాఉన్న పచ్చిగడ్డిని,వేడిగా ఉన్న నీటిని చూసిన గుర్రం పగటి పూట ఆహరం,నీళ్ళు మానివేసి రాత్రులు సాధారణమైన పచ్చిగడ్డి ,ఉలవ గుగ్గిళ్ళు, చల్లటి నీరు తాగడానికి అలవాటు పడినది ,అలా గణపతి గుర్రంలో మార్పు తీసుకువచ్చాడు "అన్నది శ్రీలక్ష్మి.

శ్రీలక్ష్మి సమాధానంతో సంతృప్తి చెందిన అందరూ నిద్రకకు ఉపక్రమించారు.

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Atha sommu alludu danam
కాశీ ప్రయాణ కథలు - అత్తసొమ్ము అల్లుడు..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Samasya manadi-Salahaa vaalladi
సమస్య మనది… సలహా వాళ్లది!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Anthuleni rahasyam gaa mighilina minchesot mystery house
అంతులేని రహస్యం - వించెస్టర్...
- డా:సి.హెచ్.ప్రతాప్
Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్