కాశీ ప్రయాణ కథలు - అమాయక ప్రజలు - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kashi Prayana Kathalu - Amayaka Prajalu

కాశీ ప్రయాణ కథలు - అమాయక ప్రజలు.

పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరంకొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు బయలుదేరారు.

రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.

అన్నలు ఈరోజు మీకు అమాయక ప్రజలు అనే కథ చెపుతాను వినండి అని శివయ్య కథ చెప్పడం ప్రారంభించాడు...

చందనగిరి రాజ్యాన్ని గుణశేఖరుడు అనే రాజు పరిపాలిస్తుండేవాడు అతని మంత్రి సుబుధ్ధి. చందనగిరిపై పొరుగు దేశమైన ఉత్కళ రాజు వీరకేతు యుధ్ధ సన్నాహలు చేస్తున్నాడని తెలిసిన గుణశేఖరుడు తన మంత్రి, సేనాపతితో అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి " మంత్రివర్యా ఇటువంటి సమయంలో యుధ్ధం చేయాలి అంటే చాలాకష్టం పైగా ఈఏడు ఉల్లిపాయలు విపరీతంగా పడటంతో రైతులు గిట్టుబాటు ధరలేక చాలా ఇబ్బంది పడుతున్నారు అలాంటి వారు ఇప్పుడు యుధ్ధానికి ఆర్ధిక సహయం చేయలేరు కనుక దీనికి తగిన ఉపాయం ఆలోచించండి "అన్నాడు.

"ప్రభు ప్రజలు అమాయకులు ఏది దొరకదు అని తెలిస్తే దాన్నే అవసరానికి మించి కొని దాచుకుంటారు.వారి అమాయకత్వాన్నిమనం తెలివిగా ఉపయోగించుకోగలిగితే ఈఆపదనుండి తేలికగా తప్పుకోవచ్చు మనం వెంటనే ఈపని చేయాలి " అంటూ చేయవలసిన పని వివరించాడు మంత్రి.

ఆదేరోజు రాజ్యంలోని ఉల్లిపాయలు అన్ని కొనుగోలు చేయించిన మంత్రి , వాటిని భద్రపరచి ఈవిధంగా ప్రచచారం చేయించాడు.తమ వద్ద ఉన్న ఉల్లిపాయలు పొరుగురాజ్యాలవారికి అధికధరకు అమ్మామని ,తమవద్ద ఉల్లిపాయలు పరిమితిగా ఉన్నాయని ,యుధ్ధం రాబోతుంది కనుక ఇకపైన ఉల్లిపాయలు దొరకవని ప్రచారం చేయించాడు. ఆప్రచారాన్ని నమ్మిన ప్రజలు అవసరానికి మించి రాజుగారి గోదాములవద్ద ఉల్లిపాయలు అధిక ధరకు కొనుగోలు చేసి భద్రపరచుకున్నారు.

ఉల్లిపాయల అమ్మకం ద్వారా కొశాగారానికి భారీగా ధనం చేరడం చూసిన రాజు "మంత్రివర్యా మీతెలివి అమోఘం ఒకే దెబ్బకు రెండు పిట్టలు రైతులు అందరికి నష్టం రాకుండా మన యుధ్ధానికి కావలసిన ధనం ప్రజలనుండి తెలిగా రాబట్టారు " అన్నాడు.

"ఇప్పుడు చెప్పండి మంత్రీచేసిన పని న్యాయమైనదేనా? " అన్నాడు శివయ్య.

"ఇందులో మంత్రి తెలివికన్నా ప్రజల అమాయకత్వమే రాజుకు మేలు చేసింది, ఏదైనా వస్తువు తక్కువ లభ్యమౌతుంది అంటే దాని వాడకం తగ్గించుకుంటే అందరికి ఆవస్తువు అందుబాటులో ఉంటుంది , అలాకాకుండా అవసరానికి మించి కొనుగోలు చేస్తే ఆవస్తువు అందరికి అందుబాటులోనికి రాకుండాపోతుంది ప్రజలు ఈవిషయం ఎప్పుడు తెలుసుకుంటారో "అన్నాది పార్వతి.

"నిజమే ఏవస్తువైతే తక్కువగా అందుబాటులో ఉంటే దాన్ని ప్రజలు అందరూ వాడకం తగ్గించుకో గలిగితే అందుబాటులోలేని ఆవస్తువు అందరికి అందుబాటులోకివస్తుంది అలాకాకకుండా మరలా మనకుదొరకదేమో అని అనవసరంగా కొనుగోలు చేస్తే ఆవస్తువు అందరికి అందుబాటులోనికిరాకుండాపోతుంది దానిధర విపరీతంగాపెరుగుతుంది ఈసమస్యకు పరిష్కారం ప్రజలు చైతన్యవంతులు కావడమే ఏకైక మార్గం "అన్నది సరస్వతి.

అందరు నిఃద్రకు ఉపక్రమించారు.

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - PRASADAM PARAMAARTHAM
కాశీ ప్రయాణ కథలు - ప్రసాదం పరమార్ధం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaashi Prayana Kathalu - mantra jalam
కాశీ ప్రయాణ కథలు - మంత్రజలం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaka o andamaina baakaa
కాకా... ఓ అందమైన బాక!
- ..... బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అద్దంకి శ్రీరామమూర్తి.
అద్దంకి శ్రీరామమూర్తి.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు