కాశీ ప్రయాణ కథలు - స్థితప్రజ్ఞుడు.
పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.
రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.
"సోదరులారా ఈరోజు మీకు స్థితప్రజ్ఞత అంటే తెలిసేకథ కథ చెపుతాను వినండి అని శంకరయ్య కథ చెప్పడం ప్రారంభించాడు ...
స్థిత ప్రజ్ఞుడు అనే పదం సంస్కృత భాష నుండి వచ్చిందే. ఇది భగవద్గీతలో ప్రస్తావించబడిన ఒక ప్రధాన అంశం. స్థిత ప్రజ్ఞుడు అనగా, ఏ పరిస్థితుల్లోనైనా మనస్తత్వంలో స్థిరత్వం కలిగి ఉండే వ్యక్తి. భగవద్గీతలో వివరణ: భగవద్గీత 2వ అధ్యాయం (సాంఖ్య యోగం) లో స్థిత ప్రజ్ఞుడి గుణాలను శ్రీకృష్ణుడు అర్జునుడికి వివరించాడు. ముఖ్యంగా, స్థిత ప్రజ్ఞుడు ఎటువంటి పరిస్థితులనైనా సమానంగా స్వీకరిస్తాడు, అతని మనసు అలజడికి గురికాదు.
"దుఃఖేషు అనుద్విగ్నమనాః సుఖేషు విఘతస్పృహః"
(దుఃఖంలో చిక్కుకోక, సుఖంలో తగిన ఆసక్తి లేకుండా ఉంటాడు.)
"వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే"
(రాగం, భయం, క్రోధం లేని వ్యక్తి స్థిత ప్రజ్ఞుడని పిలువబడతాడు.)
ఎక్కడా దేనికి తలొగ్గకుండా,శుభా అశుభాలని పొందినప్పుడు ఆనందించక, ద్వేషించక నిలిచి ఉంటాడో అతనే స్థితప్రజ్ఞుడు అని పిలవబడతాడు
స్థిత ప్రజ్ఞుడి లక్షణాలు
సంయమనం: సుఖం లేదా దుఃఖం వంటి విపరీత పరిస్థితులలో సమచిత్తంతో ఉండటం.
రాగద్వేషరహితత్వం: ఆకర్షణలు (రాగం) మరియు ద్వేషాలు (విరక్తి) లేకుండా ఉండటం.
ఇంద్రియ నిగ్రహం: ఇంద్రియాలను (చక్షు, శ్రవణ, వగైరా) నియంత్రించుకుని జ్ఞానం వైపు మనస్సును మరలించడం.
స్వతంత్ర ఆత్మగౌరవం: బాహ్య పరిస్థితుల వల్ల ప్రభావితంకాకుండా తనను తాను నడిపించుకోవడం.
ఆత్మసమాధానం: తన ఆత్మలోనే తృప్తి కలిగి ఉండడం, అనర్థపు ఇంద్రియానందాలపై ఆధారపడకపోవడం.
స్థిత ప్రజ్ఞుడు కావడం ఒక ప్రయాణం. ఇది ఒక్క రోజులో సాధ్యం కాదు. కానీ నిరంతర ప్రయత్నంతో ఎవరైనా స్థిత ప్రజ్ఞుడు కావచ్చు. స్థిత ప్రజ్ఞుడు కావడం వల్ల మనం జీవితాన్ని మరింత సంతోషంగా సాగుతుంది.
ఓ సముద్రతీరంలో ఒక పాప ఆడుకుంటూ ఇసుకతో ఇల్లు కట్టసాగింది,ఇంతలో పెద్దఅల వచ్చి ఆపాప కట్టిన ఇసుక ఇంటిని పడదోసింది, ఉక్రోషపడిన ఆపాప ' నువ్వు ఒకుళ్ళుబోతువు 'అని వెళ్ళిపోయింది.
అక్కడకు సమీపంలో నీటిలో ఆడుకుంటున్న బాలుని చెప్పులు అలలు తమతో సముద్రంలోనికి తీసుకువెళ్ళాయి ,కోపగించుకున్నబాలుడు సముద్రుని చూస్తూ ' నువ్వు దొంగవి నాచెప్పులు తీసికెళ్ళావు ' అని వెళ్ళిపోయాడు.
అప్పుడే సముద్రంలోనుండి పడవపై వెలుపలకు వచ్చిన జాలరి తనకు లభించిన చేపలను చూసుకుంటూ ' ఈరోజుకు నాకుటుంబానికి ఆహరం ప్రసాదించిన నీవు దేవుడవు 'అని నమస్కరించి వెళ్ళిపోయాడు .
సముద్రం వద్దకు వచ్చిన ఒమహళ గతంలో నిన్ను చూడాలని ఆశగా నీళ్ళలోదిగిన నాబిడ్డ నీలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు నువ్వో రాక్షసుడవు 'అని తిట్టి వెళ్ళిపోయింది.
కాని సముద్రం ఎవరి పొగడ్తలు ,ధూషణలు స్వీకరించక ఎప్పటిలా తనలో పుట్టిన అలలను ఒడ్డుకు తరలిస్తునే ఉంది. సముద్రుడిలా ఎప్పుడూ ఏక రీతిన తొణకని నిండు కుండాలా నిశ్చల మనసు కలిగిన వారే స్థితప్రజ్ఞులు ' అన్నాడు శివయ్య.
కథ ముగియడంతో అంతా నిద్రకు ఉపక్రమించారు.

