సెల్ ఫోన్ పెట్టిన చురక - సూర్య. మండా(MS)

సెల్ ఫోన్ పెట్టిన చురక

సెల్ ఫోన్ పెట్టిన చురక తను కనిపెట్టిన ఆవిష్కరణ మానవ జీవితాలలో పెనువిప్లవం సృష్టిస్తుందని సెల్ ఫోన్ కనిపెట్టిన మహానుభావుడు కూడ ఊహించి ఉండడేమో! పెద్ద పెద్ద మార్పులకు మూలం చిన్న చిన్న ఆలోచనలు అని పెద్దలు ఉరికే అంటారా !. ఏ దివ్య ముహూర్తాన అడుగేట్టిందో తెలియదు కాని మన జీవితాలలో పెద్ద పీట వేసి కూర్చుంది. “సంఘాజీవిని కాస్త సెల్ ఫోన్ జీవిని చేసింది”మనల్ని సమాజం నుండి సంబంధాల నుండి దూరం చేసింది.గాలి, నీరు, ఆహారంతో పాటు సెల్ ఫోన్ కూడ మనం జీవించడానికి ప్రామాణికంగా మారింది. చందమామని చూపిస్తూ గోరు ముద్దలు తినిపించే తల్లులు, మారం చేస్తూ ఏడుస్తూ తినే పిల్లలు, ఎంతైనా ఆరోజులు బాగుండేవి ఇప్పుడు సెల్ ఫోన్ చేతిలో పెడితే తాము అన్నం తినమని మారం చేసే పిల్లలు ఉన్నారా!. ఇంటిల్లపాధి కలిసి మనసు విప్పి మాట్లాడే రోజులు, ఆరు బయట ముచ్చట్లు, స్నేహితులతో కలిసి ఆడిన ఆటలు, బాల్యం అంటే ఇవే గుర్తొస్తాయి. రేపటి తరం యొక్క బాల్యంలో సెల్ ఫోన్ వీటికి చోటు ఇస్తుందా! ఒకప్పుడు ఆటల వలన శరీరానికి గాయాలు అయ్యేవి ప్రతి గాయం వెనక ఒక కథ ఉండేది మొదట నొప్పి పెట్టిన, తర్వాత మానినా ఆ గాయం ఓ మధురనుభూతిని కలిగించేది . ఇప్పుడు ఆడే సెల్ ఫోన్ గేమ్స్ కంటి ఆరోగ్యం మానసిక ఆరోగ్యం దెబ్బతియ్యడం తప్ప మధురమైన చిన్న నాటి గాయల గుర్తులను మిగుల్చుతుందా? మన చేతిలో ఉంటూ మనల్నే శాసిస్తుంది….ఒక్కమాటలో చెప్పాలంటే మనల్ని బానిసలుగా మార్చుకుంది. వలస పాలనని మించిన బానిసలుగా మనల్ని మార్చింది. రాజులా మనల్ని పాలిస్తుంది."ఇందు గలడు అందు లేడు అను సందేహము వలదు” అన్నట్లుగా చిన్నపిల్లల మొదలుగోని పండుముసలి వాళ్ళ వరకు అందరి జీవితాలలో పాత్రగా మారింది. “సెల్ ఫోన్ అంటేనే సర్వంతర్యామి” చరిత్ర చుసిన గొప్ప రాజులలో సెల్ ఫోన్ మహారాజు ఒకడు. సెల్ ఫోన్ తో జరిగిన యుద్ధంలో ఉత్తరాల ఊపిరి ఆగింది, బాల్య క్రీడాలన్నీ భూమిలో కలిసాయి, ఆత్మీయ-అనురాగాల ఆయువు తీరింది. ఇప్పుడు యావత్తు ప్రపంచాన్ని పోటీ లేకుండా పరిపాలిస్తుంది. తన మాటే మన మాట అంతలా మనల్ని శాసిస్తుంది. ఈ రాకాసి సూర్యోదయం మొదలుగోని సూర్యాస్తమయం వరకు మనతోనే ఉంటుంది మన పక్కనే పడుకుంటుంది “చంటి పాపల మన గుండెలమీదే పడుకుంటుంది”, మానవ జీవితాలలో సెల్ ఫోన్ పాత్ర అలాంటిది మరీ! “ఏ బంధం అయినా సెల్ ఫోన్ తో ఉన్న అనుబంధం ముందు ఓడిపోవలిసిందే! అభివృద్ధి పేరుతో అంచేలాంచెలుగా ఎదుగుతున్న మనం, మానవ సంబంధాలలో మాత్రమే రోజు రోజుకి దిగజారుతున్నాం. మనం సృష్టించిన వస్తువులు మనల్ని శాసిస్తుంటే. భవిష్యత్తులో మానవ ఉనికి ప్రశ్నర్ధకం అయ్యే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త సుమీ! *****************************

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Atha sommu alludu danam
కాశీ ప్రయాణ కథలు - అత్తసొమ్ము అల్లుడు..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Samasya manadi-Salahaa vaalladi
సమస్య మనది… సలహా వాళ్లది!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Anthuleni rahasyam gaa mighilina minchesot mystery house
అంతులేని రహస్యం - వించెస్టర్...
- డా:సి.హెచ్.ప్రతాప్
Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్