కాశీ ప్రయాణ కథలు - ప్రసాదం పరమార్ధం - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kaashi Prayana Kathalu - PRASADAM PARAMAARTHAM

కాశీ ప్రయాణ కథలు - ప్రసాదం పరమార్ధం.

పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.

రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.

ఈరోజు నేను ప్రసాదం పరమార్ధం తెలియజేస్తాను అన్న పార్వతమ్మ చెప్పడం ప్రారంభించింది...

"అన్నం పరబ్రహ్మస్వరూపం అని శృతులు చెపుతున్నాయి.

ప్రాణంకాపాడేది అన్నంకనుక,అన్నాన్నిప్రసాదంగాచూడమని ఆదిత్య పురాణంచెపుతుంది.

"పూజితం హ్వశనం నిత్యం బలమూర్జంచ యచ్ఛతి"

పవిత్ర జలంతో పరిశుభ్రంగా పవిత్ర భావంతో వండిన అన్నం పరబ్రహ్మ స్వరూపం అవుతుంది. పదిమందికి పంచగా మిగిలిన శేషాన్ని 'అన్నయజ్ఞం'తరువాత భుజింపమని విజ్ఞులు చెపుతారు.దానాల్లోకెల్లా 'అన్నదానం'గొప్పదని పెద్దలు చెపుతారు.

'అన్నాన సదృశం దానం నభూతో నభవిష్యతి'

శుధ్ధము,సిద్ధము,ప్రసిధ్ధము అని ప్రసాదాన్ని లాక్షణికులు మూడు విధాలుగా పేర్కొన్నారు.గురుభుక్తశేషాన్ని'శుధ్ధము' దైవభుక్తశేషాన్ని 'సిద్ధము' భగవత్ భక్తులు భుజింపగా మిగిలిన శేషాన్ని'ప్రశిధ్ధమని'పెద్దలు అన్నారు.అందుకే' అన్నబ్రహ్మతత్వరాధనకు'భారతీయ సంస్కృతి పెద్దపీట వేస్తాయి.

అన్నంబ్రహ్మ"అహంచబ్రహ్మ"భోక్తాంచబ్రహ్మ"అన్నారు పెద్దలు.ప్రసాదమంటే ప్రసన్నత,తేటదనము,నైర్మల్యము, ఈప్రసాదం పంచకుండా తింటే విషతుల్యం అంటారు.

'అన్నపూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే'

జ్ఞానవైరాగ్య సిధ్యార్థం బిక్షాందేహిచపార్వతీ'

అన్నం నైవేద్యరూపంలో ఒక విశిష్ఠత పరమార్ధంగా గోచరిస్తుంది .అన్నంనిండి నిబిడీకృతమైన శక్తి పాలతో కలసినపుడు, దీనికి తీపి పదార్ధంకలిపితే,ద్విగుణీకృతమౌతుంది.రెట్టింపై 'చక్కెరపొంగలిగా' మారుతుంది.దానికి పెసరపప్పు,కొబ్బరిముక్కలు కలిస్తే వచ్చే పోషకవిలువలు అపారం.అలా నివేదన చేయబడిన 'పిడికెడు'నైవేద్యం ఒ అభాగ్యుని అర్ధఆకలిని తీర్చగలుగుతుంది.అలాగే 'పులిహార''పొంగలి' 'దద్దోజనం'వంటి ప్రసాదాలలో అన్నంకంటే పోషక విలువలు ఎక్కువగా ఉంటాయి కనుకనే వాటిని భగతార్పణం చేసి భుక్తశేషాన్ని మాత్రమే అమృతంగా భావించి స్వీకరించాలి.అందుకే 'ఏకభుక్తం మహాయోగి, ద్విభుక్తం మహాభోగి,త్రిభుక్తంమహారోగి అన్నారు.

ఆకలితొఉన్నవారికి రుచితెలియదుఅని'క్షుథాతురాణంనరుచిఃనచకాలమ్ .ఆకలిగా ఉన్నప్పుడు దొరికిన ఆహారం అమృతతుల్యం. మనిషి మరణించ వచ్చుగాని,దానశీలి మరణానంతరము చిరంజీవే.అన్నిదానవలన మనిషి మహనీయుడిగా గుర్తింపబడతాడు.ఈ ఈశ్వరార్పణ భావనకి సత్త్యశుధ్ధి కలుగుతుంది.అప్పుడే చిత్తశుధ్ధి,జ్ఞానం,జాలి,దయా,కరుణభావాలు ఏర్పడతాయి.ఈలక్షణాలు కలిగిన మనిషి ఇలలో మహాన్నతుడిగా కొనియాడబడతాడు' అన్నది.

సంతృప్తితో అందరరూ నిద్రకు ఉపక్రమించారు.
 

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - mantra jalam
కాశీ ప్రయాణ కథలు - మంత్రజలం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kaka o andamaina baakaa
కాకా... ఓ అందమైన బాక!
- ..... బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - garvam veedina raju
కాశీ ప్రయాణ కథలు - గర్వం వీడిన రాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
అద్దంకి శ్రీరామమూర్తి.
అద్దంకి శ్రీరామమూర్తి.
- డా. బెల్లంకొండ నాగేశ్వరరావు