కాశీ ప్రయాణ కథలు - ఫలితం లేని మంత్రం - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kashi Prayana Kathalu - Phalitham leni Mantram

కాశీ ప్రయాణ కథలు - ఫలితం లేని మంత్రం.

పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి, శ్రీలక్ష్మి, శివయ్య, పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీ వెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమ పెద్దల వద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.

రాత్రికి ఓ గ్రామం చేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.

ఈరోజు నేను మీకు ఫలితం లేని మంత్రం అనే కథ చెపుతాను.

"సిరిపురం శివావాలయం ప్రాంగణం పరిశుభ్రపరచి, పూలతో ఒకవ్యెక్తి తనకోసం ఎదురు చూస్తూ ఉండటం చూసిన ఆలయ పూజారి ఆలయ తలుపులు తాళంతీస్తూ ' ఎవరు నాయనా నీవు ? మాఊరివాడవు కాదే' అన్నాడు.

"అయ్యా నా పేరు సుబ్బయ్య నా అనేవారు లేని వాడిని ఇక్కడే ఉండి ఆలయానికి నా వంతు సేవలు చేసుకుంటాను" అన్నాడు.

"సరే ఆలయ కోనేరు వద్ద మడపం లో ఉండు, రోజు రొండు పూటల స్వామి వారికి నివేదించిన ప్రసాదం ఇస్తాను స్వీకరించి నీ ఆకలి తీర్చుకో" అన్నాడు పూజారి.

అలా కోనేరు సమీపంలోని మండపంలో ఉంటూ ప్రతిరోజు ఆలయానికి వచ్చే భక్తులకు, పిల్లలకు విభూధి పెడుతూ, అనారోగ్యంతో ఉండే పిల్లలకు, వంటగదిలో ఉండే దినుసులతో వైద్య సలహలు ఇవ్వసాగాడు. అతని వైద్య సలహలపై నమ్మకం కుదిరిన ఆఊరి ప్రజలతోపాటు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు రాసాగారు. సుబ్బయ్య కూడా ఉచితంగా వారికి వైద్యం చేయ సాగాడు.

అదేఊరిలో ఉంటున్న రంగయ్య అనే భూత వైద్యుడు, సుబ్బయ్య రాకతో తన ఆదాయం తగ్గిపోవడంతో... సుబ్బయ్య తన మంత్రాలతో చేతబడి, చిల్లంగి వంటి క్షుద్ర పూజలు చేస్తూ పలువురి మరణానికి కారణమైయ్యడని ఆరోపణ చేస్తూ రాజుగారికి ఫిర్యాదు చేసారు.

రాజు గారి సభలో "సుబ్బయ్యగారు తమరు బాణామతి, చేతబడి వంటి క్షుద్రపూజలతో మనుషులను మరణించేలా చేస్తున్నావని, పసువుల పేడ తమరే స్వయంగా సేకరించి ఆ పసువుల పై క్షుద్రశక్తులు ప్రయోగిస్తున్నావని, ఈగ్రామ భూతవైద్యుడు ఆరోపిస్తూ మిమ్మల్ని తక్షణం గ్రామ బహిష్కరణ చేయవలసిందిగా కోరుతున్నాడు ఈ ఆరోపణలకు మీసమాధానం ఏమిటి "అన్నాడు మంత్రి.

"అయ్యా నేను నిరపరాధిని నాకు ఏమంత్రాలు రావు.పూజారిగారు, ఈ గ్రామ ప్రజల వలన నాకు రెండు పూటలా ఉతంగా ఆహరం లభిస్తుంది. అటువంటి గ్రామప్రజలకు నేను కీడు ఎందుకు తలపెడతాను?, నాకు ఎవరితోనూ శతృత్వం, ఆస్తి తగాదాలు లేవు . పసువుల పేడ నేనే స్వయంగా సేకరించినది నిజమే! రేపు వర్షకాలంలో దేవుని నైవేద్యం సిధ్ధంచేయడానికి ఎండుకట్టెలు లభించవు ఆ కారణంగా పేడ సేకరించి పిడకలుగా చేసి భద్రపరిచాను " అన్నాడు.

"రామయ్య గారు మీరు సుబ్బయ్యకన్నా గొప్ప భూతవైద్యులని విన్నాను నిజమేనా అన్నాడు మంత్రి.

"అయ్య మీరు విన్నది నిజమే ఈచుట్టుపక్కల గ్రామాలలో నేనే గొప్ప భూతవైద్యుడను " అన్నాడు .

"సరే మీరు అంతగొప్ప భూతవైద్యులైతే, సుబ్బయ్య క్షుద్రపూజలవలన మరణించీన మనుషులను లేక పసువులలో ఒకరిని తమ మంత్రాలతో బ్రతికించండి మీమంత్రాలతో " అన్నాడు మంత్రి.

"అయ్యా మరణించినవారిని మంత్రాలతో బ్రతికించడం అసాధ్యం" అన్నాడు రామయ్య.

"ఎందుకు సాధ్యంకాదు ఒక మంత్రంవలన మరణం సంభవించినపుడు, మరో మంత్రంతో చనిపోయిన వారిని బ్రతికించడం ఎందుకు వీలుకాదు? మీరు మీమంత్రాలతో చనిపోయిన వారిని బ్రతికించకపోతే మీ తల తీయిస్తాను" అన్నాడు మంత్రి.

గడగడా వణికిపోతూ రామయ్య "మహప్రభో రక్షించండి పని సోమరినై ఇలా భూతవైద్యుడిగా ,తప్పుడు తనం తో బ్రతుకుతున్నా సుబ్బయ్య మాగ్రామం రావడంతో నాకు ఆదాయం లేకపోవడంతో అతనిపై తప్పుడు ఆరోపణలు చేసాను తమరు నన్ను మన్నించి వదలివేస్తే జీవితంలో ఎన్నడూ ఇటువంటి తప్పులు చేయను రక్షించండి " అని రామయ్య రెండు చేతులు జోడించాడు.

"ఫలించని మంత్రాల పేర్లు చూప్పుకుని గ్రామాలలో తమకు వ్యతిరేకంగా ఉన్నవారిని క్షుద్రపూజల పేరిట హింసించడం జరుగుతుంది. ఈవిషయం ప్రజలు అందరూ తెలుసుకోవాలి. మంత్రాలకు మనుషులు మరణిస్తారు అనడం అవివేకం ,సుబ్బయ్యని నిర్ధోషిగా తీర్పుచెపుతూ,రామయ్య తన తప్పు తెలుసుకున్నందుకు ప్రభులపేరిట క్షమిస్తున్నాం " అన్నాడు మంత్రి "అన్నది సరస్వతమ్మ .

కథ ముగియడంతో అందరూ నిద్రకు ఉపక్రమించారు.

మరిన్ని వ్యాసాలు