కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం - డా.బెల్లంకొండ నాగేశ్వరరావు

Kaashi Prayana Kathalu - Surya Vamsham

కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం .

పూర్వం సిరిపురం అనే గ్రామంలో ఒకే వీధిలో బ్రహ్మయ్య, సరస్వతమ్మ, శ్రీహరి,శ్రీలక్ష్మి,శివయ్య,పార్వతమ్మ అనే దంపతులు ఇరుగు పొరుగుగా నివశిస్తుండేవారు, వీరికి కాశీవెళ్ళాలి అనే కోరిక కలగడంతో తమ సంతతిని తమపెద్దలవద్ద ఉంచి దారిలో తమ ఆహరం కొరకు కావలసిన వస్తువులను పెట్టుకుని ముగ్గురు దంపతులు కాశీకి బయలుదేరారు.

రాత్రికి ఓగ్రామంచేరి ఆహరం తయారుచేసుకు తిని ఆలయ వెలుపల మండపంలో విశ్రమించారు.

"సోదరులారా ఈరోజు మీకు సూర్య వంశం గురించి చెపుతాను వినండి అన్న శ్రీలక్ష్మి చెప్పడం ప్రారంభించింది... "

సూర్యుడు, వైవస్వతుడు, మనువు, ఇక్ష్వాకుడు, కుక్షి, వికుక్షి, పురంజయుడు, యోవనాశ్వుడు, మాంధాత, పురుకుత్సుడు, త్రనదస్యుడు, అరణ్యుడు, త్రిశంకుడు, హరిశ్చంద్రుడు, బాహుకుడు, అసమంజసుడు, అంశుమంతుడు, దిలీపుడు, భాగీరధుడు, నాభాగుడు, అంబరీషుడు, సింధుద్వీపుడు, నయుతాయువు,  ఋతుపర్ణుడు, సర్వకాముడు, సుదాముడు, కల్మషపాదుడు, అశ్మకుడు, మూలకుడు, ఖట్వాంగదిలీపుడు, రఘునృపాలుడు, అజమహారాజు, దశరధమహారాజు, శ్రీరాముడు, లక్ష్మణుడు, భరతుడు, శత్రుఘ్నుడు ఇలా సాగిన సూర్యవంశంలో....... శ్రీరాముని సంతతి కుశ-లవుడు. తన ఆదేశం మేరకు లక్ష్మణుడు అవతార పరిసమాప్తి అయోధ్యా నగరం లోని సరయూనది లో కావించడంతో, లవునికి 'శ్రవస్తి', కుశునకు 'కుశపురం', లక్ష్మణ సంతతి అంగదునికి 'అంగదీయరాజ్యం, చంద్రకేతునకు 'చంద్రకేతు రాజ్యం', భరతుని సంతతి తక్షకునకు'తక్షశిల', పుష్కళునకు 'పుష్కలావతి' రాజ్యాలు, శత్రుఘ్నడి సంతతి సుబాహు కు'మధుర',  శత్రుఘతికి 'విదీష' రాజ్యాలను నిర్మించి అప్పగించిన శ్రీరాముడు. భరత, శత్రుఘ్నల సమేతంగా అగ్నిని చేతపట్టి, అయోధ్య వదలి ఉత్తర దిశగా ప్రవహిస్తున్న 'సరయు'(సర్జు.నాటినదిపేరు) నదిలో అవతార సమాప్తి కావించారు.

దశరధుని మనుమ సంతతి చక్కగా రాజ్యపాలన చేయసాగారు. ఒకరోజు అయోధ్య నగర దేవత కుశునకు కలలో కనిపించి, 'నీపూర్వికులు పాలించిన అయోధ్యను జనరంజకంగా పాలనచేయి' అని కోరడంతో, కుశావతి పట్టణాన్ని బ్రాహ్మణులకు ధారబోసి, అయోధ్య పాలించసాగాడు. ఒక రోజు కుశుడు పరివారసమేతంగా వచ్చి, సరయూనదిలో జలక్రీడలు ఆడుతుండగా కుశుని చేతినుండి 'చైత్రాభరణం'జారి నీటిలో పడిపోయింది. అది అగస్త్యమహర్షి నుండి తన తండ్రి స్వికరించి తనకు ఇచ్చిన దివ్య ఆభరణం దాని కొరకు ఎంతవెదికించినా ప్రయోజనం లేకపోవడంతో కోపగించిన కుశుడు తన ధనస్సులో గరుడాస్త్రాన్ని సంధించి నదికి ఎక్కుపెట్టాడు.

'రక్షించండి మహావీరా' ఇదిగో మీఆభరం , నేను కుముదుడు అనే నాగరాజును పాతాశలోక నివాసిని ఈమె నా చెల్లెలు 'కుముద్వవతి' తమరు ఈమెను వివాహం చేసుకోవాలని నామనవి' అని చేతులు జోడించాడు.వారి వివాహనంతరం కొంతకాలానికి వారికి 'అతిథి'అనే కుమారుడు జన్మించాడు. అన్ని విద్యలు నేర్చిన అతిథికి నిషద రాజకుమార్తెతో వివాహం జరిపించారు. వీరికి 'నిషాదుడు' జన్మించాడు.

'దుర్జయుడు' అనేరాక్షసుడు ఇంద్రునితో యుధ్ధనికిరాగా ఇంద్రుడు కుశుని సహాయంకోరాడు .తమ వంశ ఆచార ప్రకారం శరణాగతులను రక్షించడం ఆచారం కనుక కుశుడు దుర్జయుని తో పోరాడుతూ అతన్ని సంహారించి తనూ ప్రాణాలు కోల్పోయాడు. అతని భార్య కుముద్వతి నాటి ఆచారప్రకారం సతీసహగమనంచేసింది. నిషాదునికి 'నలినాక్షుడు',  అతనికి 'నభుడు',  అతనికి 'పుండరీకుడు', అతనికి 'క్షామధన్వుడు, 'అతనికి'దేహనీకుడు', అతనికి 'అహీనగుడు', అతనికి 'పారియాత్రుడు', అతనికి 'శీలుడు', అతనికి 'ఉన్నభుడు', అతనికి 'వజ్రనాభుడు', అతనికి 'శంఖణుడు', అతనికి 'వ్యుషితాశ్వుడు', అతనికి విశ్వసహుడు', అతనికి 'హిరణ్యనాభుడు', అతనికి 'కౌసల్యుడు', అతనికి బ్రహ్మిష్ఠుడు', అతనికి 'పుత్రుడు', అతనికి 'పుష్యుడు', అతనికి 'ధ్రువసంధి, 'అతనికి 'సుదర్మనుడు', అతనికి 'అగ్నివర్ణుడు.

వ్యాధిగ్రస్తుడు అయిన అగ్నివర్ణుడు మరణించేనాటికి అతనిభార్య గర్బవతి, ఆమె రాజ్యపాలన స్వికరించింది.మంత్రులు,రాజోద్యోగుల అండదండలతో రాజ్యపాలన కొనసాగించింది " అన్నది.

శ్రీలక్ష్మి చెప్పిన వివరణకు త్రుప్తి చెందిన అందరూ నిద్రకు ఉపక్రమించారు.

మరిన్ని వ్యాసాలు