రాజమండ్రిలో మురళీమోహన్‌ - -

murali mohan in rajahmundry

సినీ నటుడు మురళీమోహన్‌, నిర్మాతగా కూడా పలు సినిమాలు నిర్మించారు. తెలుగు సినీ పరిశ్రమకున్న పెద్దల్లో మురళీమోహన్‌ కూడా ఒకరు. కేవలం సినీ సెలబ్రిటీగా మాత్రమే కాకుండా, రాజకీయాలలోనూ ఉన్నారు ఆయన. అయితే ఇదివరకు పూర్తిస్థాయి రాజకీయ నాయకుడిగా కాకుండా, ఎన్నికల్లో పోటీ చేసి ఊరుకోవడం వరకే అన్నట్టుగా వ్యవహరించారు మురళీమోహన్‌.

2009 ఎన్నికలలో రాజమండ్రి నుంచి పార్లమెంటుకు పోటీ చేసి ఓడిపోయిన మురళీమోహన్‌, ఓటమిని చాలా సీరియస్‌గా తీసుకున్నారు. అప్పటినుంచీ వీలు చిక్కినప్పుడల్లా నియోజకవర్గంలో పర్యటిస్తూ, ప్రజలకు చేరువయ్యేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆ ప్రయత్నాలు చూస్తోంటే, ఎంపీ కావాలన్న ఆయన కోరిక నెరవేరేలాగానే ఉంది.

రాష్ట్రంలోని ప్రత్యేక పరిస్థితుల దృష్ట్యా గందరగోళం ఇప్పటిదాకా ఉన్నప్పటికీ, విభజన ఖాయంతో రాజకీయ గందరగోళం కూడా తగ్గింది. మురళీమోహన్‌ విస్తృతంగా నియోజకవర్గంలో పర్యటించి, ప్రజల్లోకి వెళుతూ తెలుగుదేశం పార్టీ విధానాలను వారికి తెలియజేస్తూ, తాను ఎంపీ అయితే ఏమేం చేస్తానో వివరిస్తున్నారు. బెస్టాఫ్‌ లక్‌ మురళీమోహన్‌గారూ.

 

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు