దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణమూర్తి

duradrushtapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!

______________________________________________________________________

విసిసిపిలోని లాంగ్ బీచ్ కి చెందిన ఓ ముసుగుదొంగ ఓ కన్సూమర్ మెన్స్ స్టోర్ కి వెళ్ళి తుపాకి చూపించి 200 డాలర్లు దోచుకున్నాడు. మర్నాడు ఆ దొంగ ఆ స్టోర్ కే సామాను కొనడానికి వెళ్ళి పట్టుబడ్డాడు. అతని కుడి మోచేతి మీదగల పుట్టు మచ్చని గుర్తు పెట్టుకున్న కేషియర్ ఆదొంగని గుర్తుపెట్టి పోలీసులని పిలిచి పట్టించాడు.


 

న్యూయార్క్ రాష్ట్రంలోని హేంబర్గ్ కి చెందిన నికోలస్ తన దుకాణానికి నిప్పంటించాడు. అది పూర్తిగా కాలక ఇన్ సూరెన్స్ ఇచ్చే నష్టపరిహారం కోసం. అయితే అతను తన మిత్రుడికి ఈ సంగతి చెప్పడానికి ఓ నంబర్ డయల్ చేసి తను తెలివిగా ఎలా దుకాణానికి నిప్పంటించాడో వివరించాడు. అతని దురదృష్టం కొద్దీ ఆఖరి నంబరు 1 బదులు 9 డయల్ చేయడంతో, అది ఫైర్ చీఫ్ గుడాంగో ఇల్లవడంతో మొత్తం వ్యవహారం బయటపడింది.
 

మరిన్ని వ్యాసాలు

పింగళి లక్ష్మికాంతం కవి.
పింగళి లక్ష్మికాంతం కవి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బి.వి.నరసింహారావు.
బి.వి.నరసింహారావు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kutumbame Jeevanadharam
కుటుంబమే జీవనాధారం
- సి.హెచ్.ప్రతాప్
Pempakam lo premarahityam
పెంపకంలో ప్రేమరాహిత్యం
- సి.హెచ్.ప్రతాప్