దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణమూర్తి

duradrushtapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!

______________________________________________________________________

టెక్సాస్ సిటీలోని బ్యాంక్ కు దొంగతనానికి వెళ్ళిన ఓ దొంగ క్యాష్ కౌంటర్ మధ్యలో నిలబడ్డాడు. డిపాజిట్స్ స్లిప్ మీద 'అరిస్తే చస్తావ్. డబ్బంతా ఇవ్వు. నా చేతిలో పిస్తోల్ ఉంది.' అని రాసి, తన వంతు రాగానే ఆ స్లిప్ ఇచ్చాడు. క్యాషియర్ పిస్తోల్ చూసి నిశ్శబ్దంగా డబ్బంతా ఇచ్చేసింది. ఆ దొంగని పోలీసులు అరగంటలో అతనింట్లో అరెస్టు చేశారు. డిపాజిట్స్ స్లిప్ చూడగానే అలవాటుగా అతని ముందు 'టు ది క్రెడిట్ ఆఫ్' అన్నచోట తన పేరు రాసుకున్నాడు. దాంతో టెలిఫోన్ డైరెక్టరీ లో అతని పేరు ముందున్న అడ్రస్ ను చూసి పోలీసులు అతడిని తేలిగ్గా కనుక్కొని అరెస్టు చేయగలిగారు.


 

న్యూయార్క్ లోని రూధర్ పార్డ్ బ్రాంచికి చెందిన బేంక్ లోకి డిఫాల్కో (53) అనే దొంగ ప్రవేశించి తుపాకీ చూపించి డబ్బు దొంగతనం చేసాడు. తర్వాత తన సెల్ ఫోన్ నుంచి ఓ టేక్సీ కంపెనీ కి ఫోన్ చేసి రప్పించుకుని దాంట్లో పారిపోయాడు. దొంగ పారిపోయిన సమయంలో ఒకరు బేంకులోంచి బయటికివచ్చి టేక్సీ ఎక్కడం చూసిన ఓ సాక్షి పోలీసులకాసంగతి చెప్పాడు. పోలీసులు విచారణచేయగా ఆ దొంగని టేక్సీ డ్రయివర్ దింపిన అడ్రస్ దొరికింది. డిఫాల్కోని దొంగతనం జరిగిన ముఫ్ఫావు గంటలో అతనింట్లో అరెస్ట్ చేసి దొంగిలించిన మొత్తం డబ్బుని పోలీసులు రికవరీ చేసారు.
 

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు