భయాందోళన - బన్ను

bhayandolana

నకి పోలీసులంటే భయం! మనం తప్పు చెయ్యకపోయినా పోలీసులు మన గురించి వచ్చారని తెలిస్తే మనకి నిద్ర పట్టదు. 'ఎందుకొచ్చారంటారు?... నేనేమైనా తప్పు చేశానా...' ఇలా రకరకాల ఆలోచనలు మనల్ని వేధిస్తాయి.

మొన్నీమధ్య నేను 4రోజులు సింగపూర్ వెళ్ళాల్సి వచ్చి వెళ్ళాను. నేను లేనప్పుడు ఇద్దరు యువకులు నా ఫోన్ నెంబర్ తీసుకుని మా ఆఫీసుకొచ్చారట. రిసెప్షన్ లో ఉన్నతనికి నా నెంబర్ చూపించి 'ఈ నెంబర్ ఎవరిదో ఆయనతో మాట్లాడాలి' అన్నారట. రిసెప్షన్ లో వ్యక్తి తన ఫోన్ నుంచి ఆ నెంబర్ డయల్ చెయ్యగానే నా ఫోనని తెలుసుకుని' ఇది ఫలానా ఆయనదండి... ఆయన సింగపూర్ వెళ్ళారు. మండే 11గంటలకి వస్తారు అని చెప్పగానే వెళ్ళిపోయారట.

ఆ విషయం నా సింగపూర్ నెంబర్ కి ఫోన్ చేసి చెప్పగానే... (నేను సింగపూర్ లో ఉన్నప్పుడు ఇండియా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాను) నాకు చాలా ఆశ్చర్యం వేసింది. 'ఏమై ఉంటుంది?'... మళ్ళీ మన మనస్సాక్షి మనకి ధైర్యం చెబుతుంది. "నువ్వేమన్నా మర్డర్ చేశావా?" లేక "నేరం చేశావా?" అని! కానీ మనకి అదేమిటో తెలిసేదాకా నిద్ర పట్టదు.

ఇండియా వస్తూనే... సరాసరి ఫలానా పోలీస్ స్టేషన్ లో నా గురించి ఎందుకొచ్చారో తెలుసుకుంటే నా మిత్రుడి పై కేసు నమోదైందని... అతని ఫోన్ లో కాల్ రికార్డ్స్ లో ఉన్న వాళ్ళందరినీ ఆ మిత్రుడి గురించి ప్రశ్నలడిగారని తెలిసింది. 'ఓకే' అనుకుని ఆరోజు హాయిగా నిద్రపోయాను. కారణం ఏదైనా కావచ్చు... అదేమిటో తెలిసేదాకా... మనసు మనసులో ఉండదు!!