మిస్టరీ(కవిత) - ప్రతాప వెంకట సుబ్బారాయుడు

mistery

అసలు మనసు ఎలా వుంటుంది?
ధవళవర్ణ దంతప్పెట్టెలానా
ఇంద్రధనుస్సు చుట్టిన గిఫ్ట్ ప్యాక్ లానా
అనూహ్యమైన ఆకాశంలానా
అంతు తెలియని అగాథంలానా
ఇన్నన్ని ఆలోచనలు బావిలోని వూటలా
ఎలా తన్నుకొస్తున్నాయి
అపరిమితమైన అనుభూతులు
ఎలా నిక్షిప్తమవుతున్నాయి
మనవాళ్ళని పరాయివాళ్ళని గీత గీసి
వేరు చేసే లాజిక్ ఎలా దానికలవడింది
తప్పొప్పుల తరాజులా జడ్జిమెంట్
ఇచ్చే శక్తి దానికెక్కడిది
ఆవర్ణమంత సంతోషాన్ని... అనంత విషాదాన్నీ
ఎలా దాచుకోగలుగుతుంది
మనిషిమరణంతో మనసు చచ్చిపోతుందా..లేక
గాలిలో కలిసిపోయి ఆత్మకి మార్గదర్శకమవుతుందా
ఏదేమైనా మరణంలాగా మనసూ ఒక చేధించాల్సిన
మిస్టరీ!