బాబోయ్... బస్సు(కవిత) - డా. జడా సుబ్బారావు

baboi bassu
మెలికలు తిరిగిన
నల్లటి తారురోడ్డు మీద
నిండుగర్భిణిలా అవస్థలు పడుతోంది బస్సు...!
లో స్పీడుతో నడవలేక...
హైస్పీడు అందుకోలేక...
భుక్తా యాసంతో పరిగెడుతోంది బస్సు...!


టిక్కెట్లు... టిక్కెట్లు... అంటూ
జనం మధ్యలో కండక్టర్ ఇక్కట్లు...!
నిల్చోను చోటులేక... కూర్చోను సీటులేక...
ప్రయాణికుల సిగపట్లు...!
ఉక్కపెట్టి... గుక్కపట్టి... పసిపిల్లల పడరాని పాట్లు...!

సీటు దొరికినవాడు
కళ్ళుమూసుకుని... కలెక్టరైనట్లు కలలు కంటున్నాడు...!
సీటు దొరకనివాడు
గుడ్లు మిటకరించి... రాని స్టేజి కోసం ఎదురుచూస్తున్నాడు...!

మూలల నుంచి మూలుగులు...
కాలేజీ కుర్రకారు ఈలలు...
చెయ్యెత్తిన ప్రతీ చోటా
ఆపబడును...
ఆపి మరీ నరకం చూపించబడును...!

గతుకుల గుంటలో ప్రయాణం
పై ప్రాణాలు పైనే పోవడం ఖాయం...!
బ్రేకు వేసినప్పుడల్లా...
బాడీ మొత్తం షేకయి...
ప్రాణాలన్నీ గాలిలో ఉయ్యాలలూగుతున్నాయి...!

ప్యాసింజర్లని...
ప్రాణమున్న ముద్దలుగా మార్చి
పాతాళానికి తీసుకెల్తోంది బస్సు...!
రేగిన జుట్టు... నలిగిన బట్టలు...
జరుగుతున్న పోట్లాటలు... పెరుగుతున్న కొట్లాటలు...
గమ్యం చేరేదాక
ఆయుర్దాయం అనుమానమే...!

బస్సు...
అధిక జనాభాకు ప్రతీక
రాబోయే అనర్ధాలకి వేదిక...!
మెలికలు తిరిగిన
నల్లటి తారురోడ్డు మీద
నిండుగర్భిణిలా అవస్థలు పడుతోంది బస్సు...!

మరిన్ని వ్యాసాలు

Yuathalo Atmanyunataa bhaavam
యువతలో ఆత్మనూన్యతా భావం
- సి.హెచ్.ప్రతాప్
పింగళి లక్ష్మికాంతం కవి.
పింగళి లక్ష్మికాంతం కవి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బి.వి.నరసింహారావు.
బి.వి.నరసింహారావు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kutumbame Jeevanadharam
కుటుంబమే జీవనాధారం
- సి.హెచ్.ప్రతాప్
Pempakam lo premarahityam
పెంపకంలో ప్రేమరాహిత్యం
- సి.హెచ్.ప్రతాప్