గుండె ఊటలు (నానీలు) - యస్.ఆర్. పృథ్వి

gunde ootalu(naaneelu)

ఎంత సుందరమైనవి
పాపి కొండలు!
పోలవరం వస్తే
చట్టు బండలు

నెమలి పురి విప్పింది
ఫించంలో గాలి
హాయిగా
నలిగి పోతోంది

ఆకలి మంట
అందరికి సమానమే
అన్నం మాత్రం
కానేకాదు

కథలు ఎన్నని
వినమంటారు?
వెత ఒక్కటే
పాత్రలే మారతాయి

గాంధీజీ
బిచ్చగాడిగా అవతారం
స్వతంత్రాన్ని
మళ్ళీ అడుక్కుంటున్నాడా!

జీవితాలు
పాపిటలా ఉంటాయా
అప్పుడప్పుడూ
జుట్టు రేగదూ!

 

మరిన్ని వ్యాసాలు

Kashi Prayana Kathalu - tikkala raju
కాశీ ప్రయాణ కథలు - తిక్కలరాజు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Baruvu badhyatha
బరువు బాధ్యత!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Kashi Prayana Kathalu - Sthithapragnudu
కాశీ ప్రయాణ కథలు - స్థితప్రజ్ఞుడు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Offer lo konna jeevitham
ఆఫర్‌లో కొన్న జీవితం !
- బొల్లిముంత వెంకట రమణారావు
Kashi Prayana Kathalu - vikatakavi telivi
కాశీ ప్రయాణ కథలు - వికటకవి తెలివి
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు