దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణ మూర్తి

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!

______________________________________________________________________

 బోయింగ్ కంపెనీలో పని చేసే ఉద్యొగస్థులు కొందరు బోయింగ్ 747 లో ఎమర్జెన్సీకై వుంచే లైఫ్ రేఫ్ట్ ని దొంగలించారు. ఓ వెన్నెల రాత్రి వారు ఆ రేఫ్ట్ లో సముద్రయానానికి వెళ్ళారు. కోస్ట్ గార్డ్ కి చెందిన హెలీకాఫ్టర్ ఆ రేఫ్ట్ దగ్గరకి వచ్చేసింది. కారణం, ఆ ఎమర్జెన్సీ రేఫ్ట్ ని గాలితో నింపగానే, దానికి అమర్చి వుండే ఎమర్జెన్సీ లొకేటర్ బేకన్ కూడా ఏక్టివేట్ అయి, రేడియో తరంగాలని పంపుతుంది. వాటికివారి రక్షణకై హెలీకాఫ్టర్ ని పంపారు. ఇప్పుడు వారు బోయింగ్ కంపెనీ ఉద్యోగస్థులు కారు,

 

 


న్యూయార్క్ లోని ఓ లిక్కర్ స్టోర్ కి తుపాకీ తో దొంగతనానికి వెళ్ళిన ఒకతను తనతో తెచ్చిన బేగ్ నిచ్చి, కేషియర్ ని డబ్బు అందులో వేయమన్నాడు. అతను వేసాక, అతని వెనక కౌంటర్ లో ఉన్న స్కాచ్ బాటిల్ ని చూసి దాన్ని కూడా ఆ బేగ్ లో వేయమన్నాడు. ఆ కేషియర్ అందుకు అంగీకరించలేదు.
ఇరవై ఒక్క ఏళ్ళ లోపు వాళ్ళకి లిక్కర్ ని ఇవ్వను అన్నాడు. వెంటనే ఆ దొంగ తన వయసుని దృవీకరించడానికి తన డ్రైవింగ్ లైసెన్స్ ని జేబులోంచి తీసి చూపించాను. ఇంకా పోలీసులు గుర్తుపట్టి  అతను ఆ స్కాచ్ బాటిల్ ని తెరవకుండానే అతన్ని గంటలోగా అరెస్ట్ చేసేసారు.    .  .