గుండె ఊటలు (నానీలు) - యస్.ఆర్. పృథ్వి

Gunde Ootalu(naaneelu)

కూడికలు
తీసివేతలు
గణితంలో మాత్రమేకాదు
జీవితంలో కూడా

గాలిని ఆరగించి
బ్రతికారు మునులు
మోసాలను ఆరగిస్తూ
చచ్చే జనులు

భువన విజయం
నాటి ఆనందం
కవన విజయం
నేటి చైతన్యం

గడ్డి పెట్టినా
ఆరగిస్తాది
కమ్మని పాలనే
కానుకగా ఇస్తాది

తప్పును
ఒప్పు కోవాలి
కప్పు కోవాలనుకుంటే
తప్పు మీద తప్పు

బుల్లి తెర
అయస్కాంతానికి
పిల్లలు, పెద్దలు
ఇనుప రజను

మరిన్ని వ్యాసాలు

జరాసంధుడు.
జరాసంధుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Yuvathalo nera pravruthi
యువతలో నేర ప్రవృత్తి!
- సి.హెచ్.ప్రతాప్
బకాసురుడు.
బకాసురుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Nakka - Sanyasi
నక్క -సన్యాసి
- రవిశంకర్ అవధానం
అక్రూరుడు.
అక్రూరుడు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు