దురదృష్టపు దొంగలు - మల్లాది వెంకట కృష్ణ మూర్తి

duradrustapu dongalu

నేరం చేసాక, పరిశోధనలో పోలీసులకు ఆ నేరస్థులు చిక్కడం, వారే తాము దురదృష్టవంతులు అనుకోవడం కద్దు. అలాకాక నేరం చేస్తున్న సమయంలోనే పోలీసులకు చిక్కడం ఇంకా ఎంతో దురదృష్టకరం. ఇలా రకరకాల నేరాలు చేస్తూ పోలీసులకు చిక్కిపోయిన వివిధ సందర్భాలలోని అలాంటి దురదృష్టపు దొంగలను మీకు పరిచయం చేసి నవ్వించే శీర్షిక ఇది!

______________________________________________________________________
 

షిగాగో లోని ఓ దొంగ రాత్రుళ్ళు బంగారు నగల దుకాణం అద్దాల కిటికీల మీదకి ఇటుక రాళ్ళు విసిరి పగలగొట్టి, షో విండోలోని నగలని ఎత్తుకెళ్ళే వృత్తిలో వున్నాడు. ఓ రోజు అతను పోలీసులకి దొంగతనం చేస్తూ పట్టుబడ్డాడు. అతను విసిరిన ఇటుకరాయి ఓ విండోలోని ప్లెక్సీ గ్లాస్ కి తగిలి, బంతిలా వెనక్కి వచ్చి అతని తలకి తగలడంతో స్పృహ తప్పి పడిపోయాడు. పోలీస్ బీట్ కానిస్టేబుల్ చేత చిక్కాడా దొంగ.

 

 


. ఫొర్ట్స్ మౌత్  నగరానికి చెందిన గ్రెగరీ రోజా అనే అతను పెట్రోల్ పంపుల్లో, హోటళ్ళలో, పచారీ దుకాణాల్లో తను కొన్న    వస్తువులకి కేవలం నాణాలనే చెల్లిస్తున్నాడని తెలిసిన ఆ నగర పోలీసులు అతని ఇంటికెళ్తే, బస్తాల కొద్దీ నాణాలు కనబడ్డాయి. గత ఆరు నెలలుగా నగరంలోని వెండింగ్ మెషీన్స్ ని ఎత్తుకెళ్ళిన దొంగగా అతన్ని పోలీసులు గుర్తించారు. ఆ యంత్రాలని పగల కొట్టి అందులోని నాణాలని అతను దొంగిలించి ఖర్చు చేస్తున్నాడు.