గుండె ఊటలు (నానీలు) - యస్. ఆర్. పృథ్వి

Gunde Ootalu(naaneelu)

అక్షరాలు
విడిపోతే ఎలా?
కలపటానికి
కవి తపస్సు చెయ్యలేదూ!

కర కరా నమిలేస్తుంది
సినీ సంగీతం
సాహిత్యాన్నీ
స్వారస్యాన్నీ

కాలం
కరిగి పోతుంది
అది ప్రసవించిన
అక్షరాలు కలకాలం

రోడ్డు మీది చెత్తను
చీపురుతో ఊడ్చవొచ్చు
మరి
మనసులో మలినాల్ని!?

ఇంటి భద్రతకి
తలుపులు, తాళాలు
మనసు భద్రతకి
మౌనం, ధ్యానం

మనసు మీద
సమస్యల కాకులు వాలితే
మెతుకులు
వెదజల్లండి

మరిన్ని వ్యాసాలు

Panchatantram - Koti - Moddu
కోతి మరియు మొద్దు చీలిక
- రవిశంకర్ అవధానం
Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు