గుండె ఊటలు (నానీలు) - యస్. ఆర్. పృథ్వి

Gunde Ootalu(Naaneelu)

పువ్వుల శోభ
మనసుకి అంటుకుంటే
మనిషి బతుకు నిండా
నవ్వులు

బకెట్ నీళ్ళకు
క్యూలు గట్టే జనం
గొంతు తడిఆరిపోతే
తన్నేస్తారు బకెట్

తెలుగు
పర భాషల్లో కరిగింది
అస్తిత్వం తరిగి
ఆ మాత్రం మిగిలింది

ప్రశ్నలు వేయడం
సరదా పుట్టిస్తుంది
సమాధానం
చెమట పట్టిస్తుంది

న్యాయాన్ని
దేవతను చేశారా?
నైవేద్యాలు పెట్టి
జోకొట్టేందుకు!

మనిషి జీవితం
కర్పూరమే
వెలుగు క్షణికం
విలువ అగణితం

 

మరిన్ని వ్యాసాలు

Vyasaavadhanam - Pollution
వ్యాసావధానం - కాలుష్యం
- రవిశంకర్ అవధానం
Manushullo devudu
మనుషుల్లో దేవుడు
- ambadipudi syamasundar rao
ప్రపంచ వింతలు
ప్రపంచ వింతలు
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బాలలు దాచుకొండి.1.
బాలలు దాచుకొండి.1.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
సతీ సహగమనం.
సతీ సహగమనం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు