Anapakunta - వినాయకం ప్రకాష్

అనపకుంట

" హైదరాబాద్ లోని బంజారాహిల్స్ ప్రాంతంలో ఇంద్ర భవనం లాంటి బహుళ అంతస్తుల నగల షోరూం ముందు కారు ఆగింది, అందులోంచి ఠీవిగా నడుచుకుంటూ షో రూమ్ లోకి వెళ్తున్న వినోద్ కు మెయిన్ డోర్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్ వంగి నమస్కరిస్తూ వెల్కమ్ సార్ అంటూ చేతులు జోడించి వినయంగా స్వాగతం పలికాడు, చిరునవ్వులు చిందిస్తూ చేతులు జోడించి స్వాగతం పలికిన అతనికి చిరునవ్వుతో ధన్యవాదాలు తెలుపుతూ లోనికి వెళ్లిన వినోద్ కు అక్కడ ఉన్న రకరకాల వెరైటీ వజ్రాలు, బంగారు ఆభరణాలు కనువిందుగా ఉన్నా5యి. వెంటనే వినోద్ దగ్గరకు సేల్స్ టీమ్ చేరుకొని " సర్ వెల్కమ్ సర్ మీకు ఎటువంటి నగలు కావాలి..? అని అడగగానే" నాకు మోడరన్ అండ్ సింపుల్ ఇయర్ రింగ్స్ పెద్దవారికి కావాలి .. అనగానే, సూర్ సర్ "మా దగ్గర చాలా వెరైటీస్ ఉన్నాయి ఇలా కూర్చోండి సర్ చూపిస్తాము" అంటూ కుర్చీ చూపించి రకాల డిజైన్లను వినోద్ ముందు ఉంచింది వాటి ప్రత్యేకతలను కూడా తెలుపుతుంటే అందులోంచి ఒక చక్కటి డిజైన్ ఎంచుకొని ప్యాక్ చేయమని చెప్పాడు. తన మొదటి జీతంతో తన తల్లికి చెవి కమ్మలు కొంటున్నందుకు చాలా సంతోషంగా ఉంది ,ఎప్పుడెప్పుడు ఇల్లు చేరుదామా.?, తెచ్చిన కమ్మలు తన తల్లికి ఇద్దామా ...అని చాలా ఆతృతగా ఉక్కిరిగా ఉంది . కారు మెహదీపట్నం మీదుగా శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు పీవీ నరసింహారావు ఫ్లైఓవర్ మీదుగా వేగంగా వేగంగా వెళ్తోంది ,దాదాపు పది కిలోమీటర్లు ఉన్న ఫ్లైఓవర్ మీద కారు ప్రయాణం చాలా గమ్మత్తుగా ఉంది, వంపులు తిరుగుతూ ఎటువంటి ట్రాఫిక్ లేకుండా చాలా వేగంగా ఆహ్లాదకరంగా సాగుతున్న ప్రయాణం చాలా మధురానుభూతిగా ఉంది. ఊహల్లో తేలుతుండగానే ఎయిర్పోర్ట్ రానే వచ్చింది, బోర్డింగ్ పాస్ తదితర నియమావళి మొత్తం దాటుకొని తిరుపతి వెళ్లే ఫ్లైట్ ఎక్కి కూర్చున్నాడు మొదటిసారి విమానం ప్రయాణం చాలా సంతోషంగా ఉంది, విమానం నుంచి కిటికీలో చూస్తే మేఘాలు మరియు భవనాలు చిన్న చిన్నవిగా చిమల్లాగా ఉంటే దానిని చూస్తూ చాలా సంతోషంగాసాగుతోంది విమాన ప్రయాణం, ఎంజాయ్ చేస్తుండగానే విమానం తిరుపతి చేరిపోయింది, టాక్సీ మాట్లాడుకుని సొంతూరు పీలేరు దగ్గర వేపులబైలు గ్రామానికి బయలుదేరాడు వినోద్.. సమయము రాత్రి పది దాటింది, ఊహించని ప్రయాణం కనుక వినోద్ రాక గురించి ఎవరికీ తెలీదు, హటాత్తుగా కొడుకుని చూసిన తండ్రి రమణయ్యకు మాటలు రావడం లేదు సంతోషంతో బిడ్డను ఆ లింగం చేసుకుని క్షేమ సమాచారాలు అడిగి తెలుసుకున్నాడు, అమ్మ ఎక్కడ న్నాన్న ...? అనగానే "మీ అమ్మకు ఒంట్లో కాస్త జ్వరంగా ఉంటే మాత్రలు వేసుకొని పడుకునింది లేరా...! అని చెప్పగానే, ఏమైంది ....!ఆసుపత్రికి వెళ్లారా... లేదా....? నాకు ఈ విషయం ముందే ఎందుకు చెప్పలేదు నాన్న..?? అంటూ కంగారుగా వెంటనే తల్లిని చూడాలని గదిలోకి వెళ్తే నిద్రపోతున్న తల్లిని గమనించి ....కాస్త ఆగి ఎందుకు ఇప్పుడు డిస్టర్బ్ చేయడం అనుకొని మార్నింగ్ సర్ప్రైజ్ చేద్దామనుకుని.. నిద్రలోకి జారుకున్నాడు . ఉదయం 5.30 గంటలకు గుడిలో వినిపించే సుప్రభాతం వినపడటం లేదు దానికి బదులు రణగొణ ధ్వనులు జెసిపి హారన్లువినిపిస్తోంటే ఉలిక్కిపడి లేచాడు వినోద్ ...ఏమైంది..! అనుకుంటూ గదిలో నుంచి బయట వచ్చి చూసేసరికి, తన గది ముందు తల్లి అనసూయమ్మ దీనంగా కూర్చుని ఉంది , తల్లిని చూడంగానే కన్నీళ్లతో బాగున్నావా అమ్మా...కౌగిలించుకుకన్నాడు. అమ్మ ...... ఏమైందమ్మా నీకు..?ఆరోగ్యం బాలేకుంటే ఇన్ని రోజులు నాకు ఎందుకు చెప్పలేదు అని కంగారుగా తల్లిని పరీక్ష గా చూసి..గొంతు కింద చేయి పెట్టిజ్వరాన్ని చూసాడు...రే కన్నా వినోద్ ఎం లేదు లేరా కొద్దిగా అలసిపోవడం వల్ల వచ్చింది లే అంటూ.. కొడుకుని చూసి ప్రేమగా ఆలింగనం చేసుకుంది... వెంటనే గదిలోకి వెళ్లి వెంటనే గదిలోకి వెళ్లి తను తల్లికోసం, ప్రేమగా తీసుకుని వచ్చిన చెవి కమ్మలను తెచ్చి తల్లి చేతిలో పెట్టాడు, అరే కన్నా ఇప్పుడు ఎందుకు ఇవన్నీ నాకు నువ్వు బంగారు కమ్మలు తెచ్చావని సంతోషపడాలో ..?బంగారు పంటలను పండే భూమి నాశనం అవుతుందని బాధపడాలో తెలియడం లేదు నాయనా..? అంటూ కూలిపోయింది. ఏమైంది..? ఏం మాట్లాడుతున్నావు అమ్మా..! మన భూమికి ఏమైంది..? ....అన్నట్టు మన ఊరిలో ఎందుకు ఇన్ని జెసిపిలు వెళ్తున్నాయి.? ఎక్కడ పని జరుగుతోందమ్మా ..! అని అనగానే నాయనా దూరంలో ఉంటూ ఉద్యోగం చేసుకుంటూ ఉన్నావని , ఇక్కడ జరిగేది నీకు చెబితే బాధపడతావని నీకు చెప్పలేదు, మన ఊరి చెరువు గుండా , మన పంట పొలాల్లో ఆరు వరసల రోడ్డు పని అని ప్రభుత్వం వాళ్లు మన భూములు అన్ని లాగేసుకున్నారు, నెల నుంచి రోడ్డు నిర్మిస్తున్నారు , మనవే కాకుండా మన ఊరి వాళ్ళవి కూడా భూములన్ని రోడ్డుకి వెళ్లిపోయాయి, రోడ్డు పక్కన ఇన్నాళ్లు మనకు కన్న తల్లిగా ఆదుకున్న అనపకుంట కూడా రోడ్డు పుణ్యమా అని పూడ్చేశారు, మన కొంగుబంగారం అంకాలమ్మ గుడి కూడా నిర్మాణంలో భాగంగా కూల్చివేశారు, ఆ రోడ్డు పుణ్యమా అని మన ఊరి రూపురేఖలే మారిపోయాయి , మొత్తం దుమ్ము ధూళితో నిండిపోయింది పనులు పూర్తి కావడానికి ఇంకా ఒకటి నుంచి రెండు సంవత్సరాల టైం పడుతుంది అంట అని కన్నీళ్ళతో కుమిలిపోతూ.. ఇంక మనకు వంక కింద ఉన్న రెండు ఎకరాల భూమి ,కొండ కింద ఉన్న 3 ఎకరాలు మాత్రమే మిగిలింది , రోడ్డు పని వాళ్లు వంకను కూడా పూడికతో అక్కడక్కడా నింపేస్తున్నారు, రాబోయే కాలంలో తిండి గింజల కూడా కరువు వస్తుందేమో..? కన్న తల్లి లాంటి చెరువు పోయింది కడుపు నింపే భూమి పోయింది ఇంకెలా బతకాలో తెలియడం లేదు, చేతి ఖర్చులకు , ఇంటి ఖర్చులకు నీ దగ్గర చేయి చాపకుండా బతికే వాళ్ళం, ఇంక ఇప్పుడు నిన్ను అడగాలంటే నాకెందుకో ఏదోలా ఉంటుంది కన్నా , చేతుల్లో బలం ఉన్నన్ని రోజులు కష్టపడి నీకు ఆసరాగా నిలబడితే నువ్వు కూడా నిలదొక్కుకుంటావు..ఎం అని కనీళ్లతో రోధిస్తోంది,తల్లి మాటలకు ఒకసారిగా షాక్ లోకి వెళ్లిపోయాడు వినోద్ , అమ్మా నేను ఉండగా నీకు దిగులు వద్దు, నిన్ను నేను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటానమ్మా.. ఏంటమ్మా... నేను రాత్రి రావడం వల్ల గమనించ లేదు, అంకాలమ్మ గుడి, చెరువు పూడ్చి వేశారా ..??భూములన్ని కూడా రోడ్డుకు వెళ్లిపోయాయా..?? ఎంత ఘోరం జరిగిపోయింది అమ్మ.... నాకెందుకు ఇంతవరకు చెప్పలేదు..? నాయనా.... రోడ్డు ప్రభుత్వం వారి నిర్ణయం కదా మన.ఊరొళ్లు అందరూ రోడ్డుకు భూమి ఇచ్చేశారు అందుకు నష్టపరిహారంగా 10 లక్షలు ఇస్తామని చెప్పి చేతులు దులుపుకున్నారు, ఆ ప్రభుత్వం వారిని డబ్బులు ఎవరికి కావాలి.??.....ఇంక బాధ పడినా అన్ని రావు గానీ....నువు, స్నానం చేసి రాపో, టిఫిన్ చేస్తా... అనగానే , లేదమ్మా నేను ఇప్పుడే వస్తాను ఉండమ్మ ,అంటూ పరుగు పరుగున రోడ్డుమీదకు దవుడు తీశాడు, రాగి మను రచ్చ బండ కాడ నుంచి రోడ్డు పనులు చాలా వేగంగా జరుగుతున్నాయి ఎత్తు పల్లాలు ఎగుడుదిడుగులు చేయడం కోసం పల్లి వెనక ఉన్న మద్దెలగుట్ట సగం తవ్వేశారు, ఆ మట్టితో రోడ్డును చదునుచేస్తున్నారు, అనపకుంట చెరువులోని నీళ్లన్నీ మోటార్లతో లోడివేసి అందులో పిల్లర్లు దించి నిర్మాణం సాగిస్తూ చెరువు పూర్తిగా చదువు చేశారు , బంగారు పంటలు పండే భూములన్నీ కూడా మట్టి తోలి చదును చేసి రోడ్డు రూపంలోకి తెస్తున్నారు, ఆ చిత్రాన్ని చూసిన వినోద్ హృదయం ఒకసారిగా బాధతో ద్రవించిపోతోంది, కోరుకున్న కోరికలను తీర్చే కొంగు బంగారం అయిన అంకాలమ్మ గుడి కూడా కూల్చివేశారు, కూల్చి వేసిన గుడిని రోడ్డు పక్కన పెద్దలు పునర్ నిర్మాణం చేసేందుకు రెడీ అవుతున్నారు, ఊరు మొత్తం దుమ్ము ధూళితో నిండిపోయింది, దీనంగా జిల్లా పరిషత్ పాఠశాల కాంపౌండ్ గోడకు అనుకొని ఉన్న మర్రిమాను కింద కుప్పకూలాడు వినోద్, మనసులో గత జ్ఞాపకాలను గిర్రున తిరుగుతున్నాయి అనపకుంట ఎప్పుడూ, నీటితో కలకలలాడుతూ చూపరులను అందరిని ఆకట్టుకునేది, ఎప్పుడూ నిండు గర్భిణిలా నిండుగా ఉండేది, రంగురంగుల కలువ పూలు, నీటి మొక్కలు ,కట్ట మీద ఏపుగా పెరిగిన పచ్చటి కానుగ,చింత,రావి చెట్లు, పొదలతో కలకలా ఉండేది, ఆ చెట్ల మధ్య రోడ్డు మీద ప్రయాణం చాలా.గమ్మత్తుగా ఉండేది, నీటిలో ఎగిరి దూకే కొరవీరును, బంగారు తీగలు, పక్కి పిల్లలు లాంటి చేపలతో చిన్నారుల కేరింతలు, ఈతలతో కళకళలాడుతుండేది, వినాయక చవితి రోజు వినాయక విగ్రహాలను నిమర్జనం కూడా కుంటలోనే అంగరంగ వైభవంగా జరిగేది , కేదారేశ్వర నోములు తర్వాత గౌరమ్మను కూడా ఇందులోనే నిమర్జనం చేసేవాళ్ళు, వేసవిలో అయితే త తల్లి ఒడిలో ఆడుకున్నట్లు పిల్ల పెద్ద అందరూ ఇందులో ఈతలు కొట్టి సందడి చేసేవాళ్లు ,వర్షాకాలంలో చీటికిమాటికి మరువబోతూ కనువిందు చేస్తూ చెరువుకోళ్లు, కొంగలతో, పక్షులతో ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చ తోరణం లా ఉండేది అనపకుంట. ఇప్పుడు కూకటి వేళ్ళతో సహా పెకిలించి విసిరేసిన మహా వృక్షంలా దీనగా మౌనంగా రోదిస్తోంది, తన కడుపులో నుంచి వస్తున్న కన్నీటితో కుమిలిపోతుంది, పచ్చని పంటలు పండే ప్రాంతాలన్నీ దుమ్ము ధూళితో నిండిపోయాయి , ఇవన్నీ చూసిన వినోద్ మనసు అల్లకల్లోలంగా ఉంది.దీనంగా ఇంటి బాట పట్టి గదిలోకి వెళ్లి దీర్ఘంగా ఆలోచించాడు. వినోద్ మరుసటిరోజు గ్రామస్తులందరినీ సమావేశపరచి రోడ్డు కారణంగా మన బతుకులన్నీ వలస కార్మికులకు మిగిలిపోతాయని, కొద్దీ రోజులకి చెరువులు లేక పోవడంతో తాగునీళ్లు, సాగినీరు లేక ఇబ్బందులు తప్పవని హెచ్చరించాడు, పక్కన రోడ్డు పక్కన వెలిసే డాబాలు, హోటల్ లు తప్ప మన ఊరికి వచ్చే లాభమేమీ లేదని ప్రత్యామ్నాయ మార్గాలుగ వ్యవసాయ భూములను రెడీ చేసుకోవాలని సూచించాడు, కానీ ఎవరు కూడా తనమాటలను ఆలకించలేదు ,కనీసం తను చెప్పేది ఏదో కూడా వినడం లేదు. ఇంక లాభం లేదు అనుకుని ఉద్యోవుగానికి రెండు నెలలు సెలవు పెట్టి ఇన్నాళ్లు దాచుకున్న ఐదు లక్షలు, తల్లిదండ్రులు లను ఒప్పించి వారివద్ద మరో ఐదు లక్షల రూపాయల డబ్బులు పెట్టి కొత్తగా వేస్తున్న రోడ్డుకు ఎగువ ప్రాంతంలో, గతంలోని అనపకుంట వర్షం నీరు వచ్చే ప్రదేశంలో ఆరు ఎకరాల బంజరు భూమి కొని అందులో చెరువు నిర్మాణం చేపట్టాడు , అందరూ కూడా హేళన చేశాడు లక్షలు పెట్టి తవ్వడం కన్నా పట్టణాలలో ఇంటి జాగ కొనుక్కుంటే భవిష్యత్తులో బాగుపడతారు, ఇలా చెరువు తవ్వడం వల్ల ఏమి ఉపయోగం లేదని హేళన చేశారు , కానీ వినోద్ వారి మాటలు వినలేదు అకుంఠిత శ్రమతో చెరువు నిర్మాణం ప్రారంభించాడు, డబ్బులు సరిపోక పోవడంతో మళ్ళీ ఉద్యోవుగాకి వెళ్లి జీతం డబ్బులతో మరియ మిత్రుల సహాయం తో ఒక సంవత్సరంలోనే ఆరు ఎకరాలలో చెరువును తవ్వి రాతితో గట్టు బాగా నిర్మించి మొరవ నీరు మొత్తం వృధా కాకుండా అక్కడక్కడా చిన్న చెక్ డ్యామ్ లతో కాలువ నిర్మాణం చేసి, వంక లోకి నీరు వెళ్ళేలా ప్రణాళికలు రూపొందించాడు , కానీ 3 సంవత్సరాలు చినుకు జాడ లేదు, గ్రామంలో తీవ్రంగా నీటి ఎద్దడి వచ్చింది , చెరువు విలువ గ్రామానికి తెలిసింది, గంగమ్మ కు బోనాలు, కప్ప దేవర అన్ని చేశారు, వినోద్ అకుంఠిత దీక్షకు మద్దతుగా ప్రకృతి మాత కూడా ఇన్నాళ్లకు కరుణించి భారీ వర్షం కురిపించింది మూడు రోజుల్లోనే వర్షాలతో వినోద్ తవ్వించిన చెరువు పూర్తిగా నీటితో నిండిపోయింది, మరో అనపకుంటలా చెరువు మారింది, మొరవ కూడా రోడ్డు దగ్గర ఏర్పాటు చేసిన తూము గుండా దగ్గర్లోని వంకలోకి ఏర్పాట్లు చేసిన కాలువ గుండా ఎవరికి ఇబ్బంది లేకుండా ముందు ఏ విధంగా అయితే అనపకుండా ఉండేదో అదే విధంగా సాగింది .చెరువు నిండిందని విన్న వినోద్ సంతోషానికి అవధులు లేవు వెంటనే బయలుదేరి సొంతూరికి వచ్చాడు, నిండు కుండలా ఉన్న చూసి సంతోషం తో చిందులు వేసాడు,చేరువుకి అనపకుంట అని పేరు పెట్టాడు, కొన్నాళ్లకు కొత్త అనపకుంట లోకూడా పాత చెరువు మాదిరి అన్ని చేకూరాయి, జీవ వైవిధ్యం తో కొత్త అందాలు సంతరించుకుంది, గ్రామస్తులు ఏవైతే పండుగలు చేసేవారో అన్ని కూడా కొత్త అనపకుంట లో చేయడం మొదలుపెట్టారు, దగ్గర్లోని బోరు బావులు అన్నీ కూడా నీటితో రీఛార్జ్ అవ్వడం మొదలయ్యాయి ఒకప్పుడు తిట్టిన వాళ్ళందరూ కూడా వినోద్ సాహసానికి మెచ్చి అతన్ని పొగడ్తలతో ప్రశంసించారు, వినోద్ కూడా చెరువు పక్కనే వ్యవసాయ భూములు కొని ఉద్యోవుగానికి రాజీనామా చేసి పొలం బాటపెట్టేందుకు నడుం బిగించిన వినోద్ ను చూసి చెరువు లోని తామర పూలు కూడాకృతజ్ఞతతో నమస్కరించినట్లుగా నన్ను నవ్వుతూ తల్లుపుతున్నాయి.నీటి అలలు తెరలు తెరలుగా నవ్వుతూ స్వాగతం పలుకుతున్నాయి.

మరిన్ని కథలు

Nenoo naa manasu
నేనూ, నా మనసు
- మద్దూరి నరసింహమూర్తి
Vaarasudu
వారసుడు
- యమ్.శ్రీనివాసరావు
Devude kaapaadaadu
దేవుడే కాపాడాడు
- మోహనకృష్ణ
Lokam teeru
లోకం తీరు..!
- యు.విజయశేఖర రెడ్డి
Bhale baamma
భలే బామ్మ
- కొడవంటి ఉషా కుమారి
Manchi salahaa
మంచి సలహ.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Nijayitee viluva
నిజాయితీ విలువ
- సి.హెచ్.ప్రతాప్
O anubhavam
ఓ అనుభవం!!
- జి.ఆర్.భాస్కర బాబు