కాకూలు - సాయిరాం ఆకుండి

అమ్మ నేర్పిన భాష

అంతస్థులు పెరిగిన వాళ్లకి...
తెలుగులో మాట్లాడడం ఒక చిన్నతనం!

అమ్మ విలువ తెలిసిన వాళ్లకి...
తెలిసి వస్తుంది అందులోని కమ్మదనం!!


అవిభక్త కవలలు

రాజకీయాలూ వ్యాపారమూ
కలగలిసి పోయాయి!

ప్రజాశ్రేయస్సూ సమభావమూ
మంటగలిసి పోయాయి!!


సు'రుచి'రం

పిజ్జా బర్గర్ ఎంత టేస్టు అనిపించినా...
పెసరట్ ఉప్మా ముందు వేస్టురా నాయనా!

పబ్ కల్చర్ పిచ్చ క్రేజీగా కనిపించినా....
పండగ కళ సోగసే వేరురా కన్నా!!

మరిన్ని వ్యాసాలు