నవ్వుల జల్లు - జయదేవ్

"ఉత్తరం వైపున్న వెయిన్ని రెండు వందల ఎకరాలు మీది - దక్షిణ దిశగా వున్న వెయిన్ని నాలుగు వందల ఎకరాల పొలం మాది! సరేనా?"

చిలక - 1 : అన్ని వందల ఎకరాల పొలం గురించి మాట్లాడుకుంటున్నారు, ఎవరు వాళ్ళు??
చిలక - 2 : మిడతల దండ్లు!!

 



అయ్యవారు : సాలగ్రామ ఖనియందు కరకురాయి పుట్టినదే అయ్యహో!!
తవ్వకం పని చేసేవాడు : చీదరించుకోకు అయ్యోరా! అది గరుకు రాయి కాదు, గ్రానైటు రాయి! మాకు బంగారం పండినట్లే!!

రామరాజ భూషణుడు : ఈ సభలో, తెనాలి రాముడి స్థానంలో ఒక ఏనుగును నిలిపారే?
సేవకుడు : ఈ రోజు అష్ట దిగ్గజ కూటమి సభ అటగా! తెనాలి రాముల వారు శలవు పెట్టారు. బదులుగా ఈ ఏనుగును పంపించారు.
 

ఇంటి యజమాని : "వరద రాజ... నిన్నే... కోరి... వచ్చితిరా..."
వరదరాజు : ఆ త్యాగరాజు కీర్తన ఆపవయ్యా బాబూ! అద్దె అడగడానికొచ్చినప్పుడల్లా, ఆ పాటొకటి అందుకుంటావ్ గానీ!! అద్దె తెస్తాను, నోర్మూసుకు కూచో!!

జనంలో ఒకడు : ఆ శిష్యుడు గారు, దౌడు తీసి పారి పోతున్నారే?
జనంలో మరొకడు : జీవ సమాధి కాబోతున్న గురువుగారు, శిష్యుడ్ని కూడా తమతో కూర్చోమన్నారట!!

పేడ పురుగు - 1 : నా బలానికి పరీక్ష పెట్టకు! నిన్ను తొక్కేయగలను జాగ్రత్త!!
పేడ పురుగు - 2 : ఓ యబ్బో! ఎన్నడూ లేని ప్రలోభాలు పలుకుతున్నావ్! ఏమైంది నీకు?
పేడ పురుగు - 1 : ఈ రోజు ఏనుగు పేడ భుజించాం!!


దిష్టిబొమ్మ - 1 : నువ్వు నది ఒడ్డునే వున్నావు! జలకాలాడే ఆడంగుల అందమంతా, నీ కళ్ళు నింపుతుంది కదా?
దిష్టిబొమ్మ - 2 : పొరబడ్డావ్! బట్టలిప్పేసి, నా మీద వేసి, నా మొహం కప్పేస్తారు! నాకేమీ కనిపించదు!!


వాయుదేవుడు : బంగాళాఖాతంలో వాయుగుండమట! తక్షణం తరలి వెళ్తున్నాను!!
వరుణదేవుడు : ఐతే చచ్చినట్లు నీ వెంట నేనూ రావాలిగా? తప్పదుగా? హు!!


శాస్త్రి : రుచికరమైన భోజనం వడ్డించారు గానీ... ముద్దముద్దకీ పుల్లలు తగిలాయి!!
శర్మ : పుల్లలా?
శాస్త్రి : ఔను! కుట్టు విస్తట్లో వడ్డించారు లే!!
 


పెద్ద దెయ్యం : నా నీడను, నేనస్సలు తొక్కను తెలుసా?
చిన్న దెయ్యం : నేను మాత్రం తొక్కుతానేంటీ? దెయ్యాలకి కాళ్ళుండవుగా!!

 

మరిన్ని వ్యాసాలు

రామాయణంలో కొన్ని పాత్రలు.
రామాయణంలో కొన్ని పాత్రలు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
వీర శైవ మతం.
వీర శైవ మతం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
రామాయణానికి ముందు.
రామాయణానికి ముందు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Poorva janma krutam paapam
పూర్వజన్మ కృతం పాపం
- సి.హెచ్.ప్రతాప్
బిల్వపత్రం ప్రాశస్త్యం
బిల్వపత్రం ప్రాశస్త్యం
- సి.హెచ్.ప్రతాప్
సీనియర్ శ్రీరంజని.
సీనియర్ శ్రీరంజని.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు