వద్దురా – కొనవద్దురా – పాడు చైనా సరుకు! - నూజిళ్ళ శ్రీనివాస్

 

 

వద్దురా – కొనవద్దురా – పాడు చైనా సరుకు,
ముద్దుగా కనబడుతోందని మాయలో పడకు!
సవకగ అమ్మేత్తున్నామంటూ సెత్తను దింపేత్తన్నాది
ఏపుగ ఎదిగి, మనపైనే కయ్యానికి సయ్యంటన్నాది!

సూది పిన్ను నుండి స్మార్ట్ ఫోను దాకా - అన్నీ అమ్ముత ఉంటాది
అందమైన పేకింగ్ తోటి ఆకట్టుతూ, గేరంటీ మాట లేదంటాది
నాసి సరుకు తెచ్చి, దేశంలోన ఇంటింటా తిష్ట వేస్తంటాది
లాబాలన్నీ మూట గట్టుకొని మన పైనే లంఘిస్తుంటాది! --- వద్దురా!!

మోసకారి చైనా మాయదారి పాకిస్తానుతో దోస్తీ కడతంది
సిక్కిం, ఉత్తరఖండూ, లడకుల్లోన మన పైన లడాయికి వస్తోంది
డోక్లా లోన బరితెగించి హద్దులు దాటి మనపైన సవాల్ చేస్తోంది
నలుపు దాచి గురివింద చందంగా మన పైనే హుంకరిస్తోంది--- వద్దురా!!

పనికిరాని చైనా ప్లాస్టిక్కు బొమ్మలు పిల్లలకు అనారోగ్యమట
భద్రత లేని మొబైల్ బ్యాటరీలు ప్రాణాలకే పెను ముప్పంట
“మేకిన్ ఇండియా” స్ఫూర్తితోటి మనం స్వదేశీ వస్తువులే కొందాం
మోసకారి చైనా మెడలు వంచేలాగా అందరొక్కటై ఉద్యమిద్దాం! --- వద్దురా!

 

 

మరిన్ని వ్యాసాలు

గణేషునీ కల్యాణం.
గణేషునీ కల్యాణం.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్
Kuldara Mystery
కుల్ధారా మిస్టరీ
- డా:సి.హెచ్.ప్రతాప్
Kashi Prayana Kathalu - Phalitham leni Mantram
కాశీ ప్రయాణ కథలు - ఫలితం లేని మంత్రం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Prapancha Enugula Dinotsavam
ప్రపంచ ఏనుగుల దినోత్సవం
- .....బొల్లిముంత వెంకట రామనా రావు