మీ జీవితానుభూతిని మార్చే ప్రక్రియ - ..

inner-engineering

లౌకికమైన శ్రేయస్సు పొందడానికి మనకు శాస్త్రాలూ, సాంకేతికలూ ఉన్నాయి, మనం బాహ్య ప్రపంచాన్ని ఇంజినీర్ చేశాము. ఎన్నో విధాలుగా ఇవి మనకి సౌకర్యాన్ని, సుఖాన్ని కలిగిస్తాయి. ఇవన్నీ కూడా మనం, పోయిన వంద సంవత్సరాల్లో చేసినవే..! మనం ఈ ప్రపంచంలో ఎంతో ఇంజినీరింగ్ చేశాం. మన ముందు తరాల వారు ఎరుగనటువంటి సౌకర్యాలనూ, సౌఖ్యాలనూ అనుభవిస్తున్నాం. మన తరం ఈ భూమి మీద ఖచ్చితంగా ఎంతో సౌకర్యవంతంగా జీవిస్తోంది.

అయినప్పటికీ మానవులు ఇంకా ఆనందంగా లేరు. వారు అంతకు ముందుతరం కంటే, ఏమాత్రం సంతోషంగా లేరు. ఇది ఎందుకనంటే, మానవుడి అంత:కరణం నిర్లక్ష్యం చెయ్యబడింది. మనం ఇక్కడ ఎదైతే అందిస్తున్నామో, దానిని “ఇన్నర్ ఇంజినీరింగ్” అని పిలుస్తున్నాము. మీకు కావలసిన విధంగా, కావలసిన పరిస్థితుల్లో మీరు ఉండడానికి మీరు బయటి పరిస్థితిని ఎలా అయితే ఇంజినీర్ చేసుకోగలరో; అదే విధంగా మీ అంత:కరణంలో కూడా, మీకు కావలసిన విధంగా మీరు ఉండగలిగేలాగా ఇంజినీర్ చేసుకోవచ్చు. అందుకని; మీ అంత:కరణంలోకి మీరు చూడండి.

మీకు కావలసిన విధంగా బాహ్యమైన పరిస్థితులను మలచుకోవాలంటే, దానికి ఎన్నో విషయాలు కలిసి రావాలి. అదే మీ అంత:కరణంలోనికి వచ్చేసరికి..కావలసింది కేవలం మీరు మాత్రమే..! అందుకని ఇది మీకు సంబంధించిన ఇంజినీరింగ్. ఒక వ్యక్తి తనను తాను ఏ విధంగా కావాలనుకుంటాడో, ఆ విధంగా ఇంజీనీర్ చేసుకోగలిగితే, అతను ఎంతో ప్రశాంతంగా, ఆనందంగా, పారవశ్యంతో ఉంటాడు. మీ శరీరం, మీ మనస్సు, మీ మేధస్సు ఇవన్నీకూడా మీరు ప్రశాంతంగా, సంతోషంగా ఉన్నప్పుడే అద్భుతంగా పని చేస్తాయి.

అందుకని, “ఇన్నర్ ఇంజినీరింగ్” మీ జీవితానుభూతిని మార్చేస్తుంది. ఇది, మిమ్మల్ని జీవితంలో ఆనందాన్వేషణ చేస్తున్న స్థితి నుంచి ఆనందానుభూతిని వ్యక్తపరచే స్థితికి మారుస్తుంది. మీరు అద్భుతంగా పని చెయ్యగలిగేలాగా చేస్తుంది. మేము కార్పొరేట్ లలో, ఇంకా వివిధ ప్రదేశాల్లో వారి వారి సామర్థ్యాలు ఎంతగానో పెరగడం గమనించాము. ఎక్కువ ప్రశాంతంగా, ఎక్కువ సంతోషంగా ఉండగలిగిన స్థితే ఇందుకు కారణం. వారి మనస్సు, శరీరం ఎంతో క్రమబద్ధంగా ఉంటాయి. ఇది ఒక శాస్త్రం. ఇది ఒక బోధన కాదు, ఇది ఒక తత్వం కాదు, ఇది ఒక నమ్మక వ్యవస్థ కాదు. ఇది అంత:కరణానికి సంబంధించిన శాస్త్రం.

(ఇషా ఫౌండేషన్ సౌజన్యంతో...)

మరిన్ని వ్యాసాలు

విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్