22-02-2019 నుండి 28-02-2019 వరకు వారఫలాలు - - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

  ఈవారం పెద్దలనుండి నూతన విషయాలను తెలుసుకుంటారు. భాగస్వామ్య ఒప్పందాలకు ఆస్కారం కలదు. గతంలో చేపట్టిన పనులు వలన మంచి పేరు లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ చేయకండి. తగినంత విశ్రాంతి అవసరం. కుటుంబంలో మీ ఆలోచనలు పంచుకుంటారు, సోదరులతో చేపట్టిన చర్చలు ముందుకు సాగుతాయ. ఆర్థికపరమైన విషయంలో మాత్రం స్పస్టమైన ఆలోచన అవసరం. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. చిన్న చిన్న విషయాలకే హైరానా చెందుటకు ఆస్కారం ఉంది, ఫలితాల కోసం ఆలోచన చేయక మీ పనిలో మీరు నిమగ్నం అవడం సూచన.

 

 


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం ప్రయాణాల వలన సంతృప్తిని పొందుతారు. ఆరోగ్యం కాస్తా కుదుట పడుతుంది. ఖర్చులు మాత్రం పెరుగుటకు ఆస్కారం ఉంది. సోదరుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. సంతానం నుండి వచ్చే సూచనల విషయంలో మరొకసారి ఆలోచన చేయుట మంచిద. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. వాహనాల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. పెద్దలతో మీకున్న పరిచయం మీకు ఉపయోగపడుతుంది. తండ్రితరుపు బంధువులతో చర్చలు జరుగుటకు ఆస్కారం ఉంది. ఉద్యోగంలో అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. 
 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం సంతానంతో సమయం గడుపుతారు. వారినుండి పూర్తిగా సహకారం పొందుతారు. ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. అనుకోని ఖర్చులకు ఆస్కారం ఉంది. స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం కలదు. బంధువుల నుండి వచ్చే సూచనలు మీలో కొత్త ఆలోచనలకు శ్రీకారం అవుతాయి. తండ్రితరుపు బంధువులను కలుస్తారు. విదేశాల్లో ఉన్న మిత్రులనుండి ముఖ్యమైన సమాచారం వస్తుంది. పెద్దాలనుండి వచ్చిన సహకారం మీకు సంతృప్తిని ఇస్తుంది. మీ మాటతీరు కొంతమందికి ఇబ్బందిని కలిగించే ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.

 

 

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. చిన్న చిన్న విషయాలపై ప్రత్యేకమైన ద్రుష్టి పెట్టండి. ఆరోగ్యం విషయంలో ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. సమయానికి భోజనం చేయుట మంచిది. జీవితభాగస్వామితో విభేదాలు రాకూండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. సాధ్యమైనంత మేర అనవసరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. దూరప్రదేశంలో ఉన్న బంధువుల నుండి సమాచారం వస్తుంది, వారితో సమయం గడుపుతారు.

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం స్వల్పదూర ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడులకు ఆస్కారం ఉంది. ఆలోచనలు తగ్గించుకోవడం వలన తప్పక మేలుజరుగుతుంది. మిత్రులతో సర్దుబాటు విధానం అవసరం, వారితో కలిసి నూతన పనులను చేపట్టుటకు అవకాశం ఉంది. దూరప్రదేశ ప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. కుటుంబంలో మీరు తీసుకొనే నిర్ణయాల వలన మంచి గుర్తింపు లభిస్తుంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. చర్చాపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ముందుకు వెళ్ళుట, అలాగే స్పష్టమయిన ఆలోచనల్తో ముందుకు వెళ్ళండి.

 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది, వారినుండి నూతన విషయాలు తెలుస్తాయి. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి విజయవంతంగా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. ఉద్యోగంలో నలుగుర్ని కలుపుకొని వెళ్ళుట వలన మేలుజరుగుతుంది. సోదరుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది, మీ ఆలోచనలను వారితో పంచుకుంటారు. సంతానం విషయంలో ఒకింత ఆందోళన తప్పక పోవచ్చును. చాలావిషయాల్లో దూరద్రుష్టి అవసరం. ఏమాత్రం కోపానికి లోనవకపోవడం మంచిది. విలువైన వస్తువులను కొనుగోలు చేస్తారు.  

 

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం పెద్దలను కలుస్తారు, నూతన ప్రయత్నాలు కలిసి వస్తాయి. చేపట్టిన పనులను అనుకున్న సమాయానికి పూర్తిచేస్తారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఆరంభంలో మాత్రం మానసిక పరమైన ఇబ్బందులను పొందుతారు. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు సూచితం. చిన్న చిన్న విషయాల్లో అశ్రద్ధ చూపడం వలన నష్టపోతారు. భాగస్వామ్య ఒప్పందాలు ఇబ్బంది పెట్టుటకు ఆస్కారం ఉంది. సోదరులతో కలిసి ప్రయాణాలు చేయుటకు అవకాశం ఉంది. కుటుంబంలో కీలకమైన ఆలోచనలు చేయుటకు ఆస్కారం ఉంది. స్పష్టమైన ఆలోచనలు చేయుట మంచిది.

 

.

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం ముఖ్యమైన విషయాలకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. చిన్న చిన్న విషయాలకు సమయం ఇవ్వడం మంచిది. తలపెట్టిన పనుల విషయాల్లో స్పష్టమైన అవగాహన తప్పక మేలుచేస్తుంది. ప్రయాణాలు అనుకోకుండా వాయిదాపడుటకు ఆస్కారం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో మీకంటూ ఒక విధానం ఉండుట అలాగే ఒప్పందాలు చేసే సమయంలో జాగ్రత్తగా ఉండుట సూచన. దైవపరమైన విషయాల్లో పాల్గొంటారు. ఆరోగ్యం విషయంలో కాస్త ఇబ్బందులు తప్పక పోవచ్చును. సంతానం నుండి సంతృప్తి కరమైన సహకారం అలాగే ఫలితాలు పొందుతారు. సమయాన్ని సరదాగా గడుపుటకు ఇష్టపడుతారు.


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

 ఈవారం బంధువులను కలుస్తారు, వారినుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. ఖర్చుల విషయంలో స్పష్టత అవసరం. తలపెట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా పూర్తిచేసే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు.మానసికపరమైన ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది , దృడంగా ఉండే ప్రయత్నం చేయుట మంచిది. ఎవరితో మాటపట్టింపులకు వెళ్ళకండి. సర్దుబాటు విధానం మంచిది. సంతానం విషయంలో ముఖ్యమైన ఆలోచనలు చేస్తారు, అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. ఆరోగ్యపరమైన విషయాల్లో ఏమాత్రం అశ్రద్ధ వద్దు.
 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారంలో కుటుంబంలో కీలకమైన ఆలోచనలు చేస్తారు, నిర్ణయాలు తీసుకొనే విషయంలో పెద్దలను సంప్రదించుట మంచిది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పెట్టుబడుల కోసం చేసే ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. పూజాదికార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దలతో మీకున్న పరిచయం మరింతగా లబ్దిని కలిగిస్తుంది. ఉద్యోగంలో నూతన ప్రయత్నాలు మొదలు పెట్టుటకు ఆస్కారం ఉంది. తండ్రితరుపు బంధువుల నుండి నూతన విషయాలు తెలుస్తాయి. విలువైన వస్తువులను నష్టపోయే అవకాశం ఉంది, కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన.

 

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

 ఈవారంలో ఆరంభంలో కాస్త ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. చిన్న చిన్న పనులను పెద్దల సహకారంతో ముందుకు తీసుకు వెళ్ళుట సూచన. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. స్వల్పదూరప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. నూతన పరిచయాలకు అవకాశం ఉంది. ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బంది పెట్టె అవకాశం ఉంది. సోదరుల నుండి వచ్చే సూచనలు మీకు లబ్దిని కలుగజేస్తాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆవకాశం ఉంది.

 

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

 ఈవారంలో పెద్దలను కలుస్తారు,వారితో మీ ఆలోచనలు పంచుకుంటారు. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన ఆలోచనలు కలిగి ఉంటారు. దైవపరమైన విషయాలకు సమయం ఇస్తారు. చిన్న చిన్న విషయాలకు సైతం శ్రద్దచూపుట మంచిది. సంతానం విషయాల్లో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. ప్రయాణాలు అనుకోకుండా వాయిదా పడుటకు ఆస్కారం ఉంది. విదేశీప్రయానాలు చేయుటకు అవకాశం ఉంది. తల్లి తరుపు బంధువులలో ఒకరి ఆరోగ్యం మిమ్మల్ని ఇబ్బందికి గురిచేసే అవకాశం ఉంది. చర్చల్లో సమయం గడుపుతారు. 
 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం

మరిన్ని వ్యాసాలు

Kaashi Prayana Kathalu - Atha sommu alludu danam
కాశీ ప్రయాణ కథలు - అత్తసొమ్ము అల్లుడు..
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Samasya manadi-Salahaa vaalladi
సమస్య మనది… సలహా వాళ్లది!
- బొల్లిముంత వెంకట రమణా రావు
Anthuleni rahasyam gaa mighilina minchesot mystery house
అంతులేని రహస్యం - వించెస్టర్...
- డా:సి.హెచ్.ప్రతాప్
Kaashi Prayana Kathalu - Surya Vamsham
కాశీ ప్రయాణ కథలు - సూర్య వంశం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
గణేషుని కల్యాణం
గణేషుని కల్యాణం
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
Clay Ganesh
మట్టి వినాయకుడు
- పడాల హరీష్ కుమార్