24-05-2019 నుండి 30-05-2019 వరకు వారఫలాలు - డా. టి. శ్రీకాంత్

మేష రాశి :   (అశ్వని 4 పాదాలు ,భరణి 4 పాదాలు,కృత్తిక 1 వ పాదం )

 ఈవారం నూతన పరిచయాలకు అవకాశం ఉంది. స్త్రీ సంభందమైన సహాకారం వలన లబ్దిని పొందుతారు. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. రుణపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. సోదరులతో మీకున్న అనుభందం మరింతగా బలపడుతుంది, వారితో చర్చలు చేయుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. పూజాదికార్యక్రమాల్లో పాల్గొంటారు.

 

 


 వృషభ రాశి : (కృత్తిక 2,3, 4 పాదాలు ,రోహిణి 4 పాదాలు,మృగశిర 1, 2 పాదాలు)

ఈవారం అధికారుల నుండి నూతన విషయాలు తెలుసుకుంటారు. కుటుంబపరమైన విషయాలలో కాస్త నిదానంగా వ్యవహరించుట సూచన. చేపట్టిన పనులను కాస్త ఆలస్యంగా నైనా పూర్తిచేయుటకు అవకాశం ఉంది. సోదరుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. వ్యాపారపరమైన విషయాల్లో మిశ్రమఫలితాలు పొందుతారు. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. విలువైన వస్తువుల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. ఆరోగ్యం విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. మీ మాటతీరు కొంతమందికి ఇబ్బందిగా ఉంటుంది.

 

 

 

మిథున రాశి :  (మృగశిర 3,4 పాదాలు ,ఆరుద్ర 4 పాదాలు, పునర్వసు 1,2,3 పాదాలు)

ఈవారం ఆరంభంలో చేపట్టిన పనులను జాగ్రత్తగా పూర్తిచేసేలా జాగ్రత్తలు తీసుకోండి. చేపట్టిన పనులను పూర్తిచేయుటలో ఇబ్బందులు తప్పక పోవచ్చును. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. చర్చా పరమైన విషయాలకు సాధ్యమైనంత వరకు దూరంగా ఉండుట సూచన. ఉద్యోగంలో అధికారుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. విదేశాల్లో ఉన్నవారికి గతకొంతకాలంగా ఎదురుచూస్తున్న వాటిలో అనుకూలమైన ఫలితం వస్తుంది. ఆరోగ్యపరమైన సమస్యలు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి, కాస్త జాగ్రత్త అవసరం.

 

 

కర్కాటక రాశి : (పునర్వసు 4 వ పాదం ,పుష్యమి 4 పాదాలు,ఆశ్లేష 4 పాదాలు)

ఈవారం మిత్రులనుండి ముఖ్యమైన విషయాలను తెలుసుకుంటారు. చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తిచేస్తారు. వ్యాపారపరమైన విషయాల్లో అనుభవజ్ఞుల సూచనల మేర ముందుకు వెళ్ళండి. సంతానం విషయంలో గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉండుట సూచన. జీవితభాగస్వామి నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. మానసికపరమైన ఇబ్బందులు మిమ్మల్ని ఇబ్బందికి గురిచేస్తాయి. వాహనాల వలన ఇబ్బందులు కలుగుటకు ఆస్కారం ఉంది. విదేశీప్రయాణప్రయత్నాలు అనుకూలిస్తాయి.

 

సింహ రాశి : (మఖ 4 పాదాలు ,పుబ్బ (పూర్వఫల్గుణి) 4 పాదాలు, ఉత్తర 1 వ పాదం )

ఈవారం మిత్రులతో సమయాన్ని సరదాగా గడుపుతారు, వారితో సమయాన్ని సరదాగా గడుపుటకు అవకాశం ఉంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు లభిస్తాయి. విదేశాల్లో ఉన్నవారికి నూతన అవకాశాలు లభిస్తాయి. బంధువులతో కలిసి శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దలనుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. కుటుంబంలో ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుంటారు. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. దైవపరమైన విషయాలకు సమయం ఇవ్వడం సూచన. సమయానికి భోజనం అలాగే విశ్రాంతి అవసరం.
 

కన్యా రాశి : (ఉత్తర 2,3, 4 పాదాలు ,హస్త 4 పాదాలు,చిత్త 1, 2 పాదాలు )

ఈవారం తీసుకొనే నిర్ణయాల విషయంలో స్పష్టత అవసరం. వ్యాపారపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. బంధువులతో విభేదాలు రాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. పూజాదికార్యక్రమాల్లో పాల్గొంటారు. దూరప్రదేశంలో ఉన్న మిత్రులను కలుసుకొనే అవకాశం ఉంది. సోదరుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. సంతానం విషయంలో ఒకింత ఆందోళన తప్పక పోవచ్చును. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది. చర్చాపరమైన విషయాలకు దూరంగా ఉండుట సూచన.

 

 

తులా రాశి : (చిత్త 3,4 పాదాలు ,స్వాతి 4 పాదాలు, విశాఖ 1,2,3 పాదాలు )

ఈవారం కఠినమైన నిర్ణయాలు తీసుకొనే అవకాశం ఉంది. గతంలో తీసుకున్న నిర్ణయాలకు కట్టుబడి ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. చర్చాపరమైన విషయాలకు సమయం ఇస్తారు. విదేశాల్లో ఉన్నవారికి సంతృప్తికరమైన నూతన విషయాలు తెలుస్తాయి, ఆశిస్తూన్న ఫలితాలు పొందుతారు. ఆరోగ్యం విషయంలో లేక తండ్రితరుపు బంధువుల విషయంలో ఆందోళన చెందుటకు అవకాశం ఉంది. సోదరుల నుండి ఆశించిన సహకారం లభిస్తుంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయుటకు అవకాశం ఉంది, అనుకూలిస్తాయి.

 

 
వృశ్చిక రాశి : (విశాఖ 4 వ పాదం ,అనురాధ 4 పాదాలు,జ్యేష్ఠ 4 పాదాలు )

ఈవారం స్వల్పదూరప్రయాణాలు చేయుటకు ఆస్కారం ఉంది. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతాయి. వ్యాపారపరమైన విషయాల్లో నూతన పరిచయాలకు అవకాశం ఉంది, చర్చల్లో సమయం గడుపుతారు. పెద్దలతో మీ ఆలోచనలు పంచుకుంటారు, వారినుండి అనుమతి లభిస్తుంది. విదేశీప్రయాణ ప్రయత్నాలు చేయువారికి అనుకూలమైన సమయం. తల్లితరుపు బంధువుల నుండి ముఖ్యమైన విషయాలు తెలుసుకుంటాయి. విలువైన వస్తువులను కొనుగోలు చేయుటకు ఆస్కారం ఉంది.

 


ధనస్సు రాశి : (మూల 4 పాదాలు ,పూర్వాషాఢ 4 పాదాలు,ఉత్తరాషాఢ 1 వ పాదం )

ఈవారం  వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు పొందుతారు. చేపట్టిన పనులను మిత్రుల సహకారంతో పూర్తిచేసే అవకాశం ఉంది. బంధువుల నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. గతంలో చేపట్టిన పనుల వలన నలుగురిలో మంచి పేరు లభిస్తుంది. వ్యాపారంలో పెట్టుబడుల కోసం చేసిన ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అనుకోని ఖర్చులకు అవకాశం ఉంది, ఆర్థికపరమైన విషయాల్లో కాస్త జాగ్రత్తగా ఉండుట సూచన. అనవసరమైన విషయాలకు దూరంగా ఉండండి. ఎవ్వరితోను మాటపట్టింపులకు వెళ్ళకండి. ప్రయాణాలు కలిసి వస్తాయి.
 

మకర రాశి : (ఉత్తరాషాఢ 2,3, 4 పాదాలు ,శ్రవణం 4 పాదాలు,ధనిష్ఠ 1, 2 పాదాలు )

ఈవారం ముఖ్యమైన నిర్ణయాల్లో కాస్త తడబాటు ఉండే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో బాగానే ఉన్న పెద్దగా సంతృప్తి ఉండకపోవచ్చును. చిన్న చిన్న విషయాలకే ఇబ్బంది పడుతారు. ప్రయాణాలు చేయునపుడు తగిన జాగ్రత్తలు తీసుకోండి. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది, ఋణం ఎవరి కన్నా ఇవ్వాల్సి వచ్చినపుడు కాస్త ఆచితూచి వ్యవహరించుట సూచన. సంతానం నుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. విదేశాల్లో ఉన్నవారు స్వదేశానికి తిరిగి వచ్చే అవకాశం ఉంది. నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. 

 

 

కుంభ రాశి : (ధనిష్ఠ 3,4 పాదాలు ,శతభిషం 4 పాదాలు, పూర్వాభాద్ర 1,2,3 పాదాలు )

ఈవారం చిన్న చిన్న విషయాలకు సైతం ప్రాముఖ్యత ఇవ్వడం  మేలుజరుగుతుంది. బంధువులతో మీ ఆలోచనలు పంచుకొనే ప్రయత్నం చేయుట మంచిది. వ్యాపార పరమైన విషయాల్లో మిశ్రమ ఫలితాలు పొందుతారు. విదేశీప్రయాణప్రయత్నాలు చేయుటకు చేయు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. సోదరులతో మీ ఆలోచనలు పంచుకుంటారు. సంతానం విషయంలో నూతన నిర్ణయాలు తీసుకుంటారు. వారినుండి ఆశించిన మేర సహకారం లభిస్తుంది. రావాల్సిన ధనం సమయానికి చేతికి అందుతుంది. ఉద్యోగంలో నూతన అవకాశాలు ముందుకు సాగుతాయి.

మీన రాశి :  (పూర్వాభాద్ర 4 వ పాదం ,ఉత్తరాభాద్ర 4 పాదాలు,రేవతి 4 పాదాలు )

ఈవారం ఆరంభంలో కొంత ఇబ్బంది పడే అవకాశం ఉంది. వ్యాపారపరమైన విషయాల్లో నూతన అవకాశాలు లభిస్తాయి. నూతన పెట్టుబడుల కోసం చేయు ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. అధికారుల నుండి ఆశించిన మేర సహకారం లభ్సితుంది. సోదరులతో చర్చలు చేయుటకు అవకాశం ఉంది, ఆశించిన మేర సహకారం లభిస్తుంది. నూతన వాహనాలను కొనుగోలు చేయాలనే ఆలోచన ముందుకు సాగుతుంది. భాగస్వామ్య ఒప్పందాలు ముందుకు సాగుతాయి. విదేశీప్రయాణ ప్రయత్నాలు ముందుకు సాగుతాయి. చర్చల్లో అధిక సమయం కేటయించే అవకాశం ఉంది.

 

డా. టి. శ్రీకాంత్
వాగ్దేవి జ్యోతిషాలయం