రింగు రింగుల 'పొగ'కు ఇకపై 'చెక్‌'.! - ..

check

'కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడింది..' అన్నట్లుగా మారింది ఇండియాలో స్మోకర్స్‌ పరిస్థితి. వివరాల్లోకి వెళితే, పొగాకు ఆరోగ్యానికి హానికరం, స్మోకింగ్‌ ఈజ్‌ ఇంజ్యూరియస్‌ టు హెల్త్‌.. అంటూ క్యాప్షన్స్‌ విడుదల చేయడం తప్ప, ఆ హానికరమైన పొగాకును నియంత్రించే దిశగా ప్రభుత్వాలు చేపట్టిన మార్గాలేమైనా ఉన్నాయా.? అంటే నో నెవ్వర్‌ అని పూర్తిగా చెప్పలేం. కానీ, ఒక మార్గం ఉంది. ఏళ్ల తరబడి పొగాకుకు అలవాటు పడి ఆ వ్యసనాన్ని మార్చుకోలేని వారికి, వాటి బదులుగా ఈ మధ్య ఇ - సిగరెట్లు మార్కెట్లోకి అందుబాటులోకి తెచ్చారు. పొగాకుతో చేసిన సిగరెట్స్‌తో పోల్చితే, ఈ ఇ - సిగరెట్స్‌లో టొబాకో సబ్‌స్టెన్సస్‌ తక్కువగా ఉంటాయట. సో ఆ రకంగా ఈ వ్యసనాన్ని కొన్ని రోజులకు విడిచి పెట్టేస్తారనేది ఇంతవరకూ తెలిసిన నిజం. అయితే అదిప్పుడు గతం. ఇవి ఆరోగ్యానికి అంతగా హానికరం కాదనే మాట కూడా అవాస్తవం.

తాజా అధ్యయనాల ప్రకారం, ఇ - సిగరెట్స్‌తో హెల్త్‌ ఇష్యూస్‌ ఎక్కువగా వస్తున్నాయట. మొదట్లో దిగుమతి అయిన ఇ - సిగరెట్స్‌కీ, ఇప్పుడు వస్తున్న ఇ - సిగరెట్స్‌కీ డిఫరెన్స్‌ ఉంటోందట. ఇప్పుడొస్తున్న ఇ - సిగరెట్స్‌లో మత్తు కలిగించే కెమికల్స్‌ని ఎక్కువగా మిక్స్‌ చేస్తున్నారట. దాంతో యూత్‌ ఎక్కువగా ఈ ఇ - సిగరెట్స్‌కి అలవాటు పడుతున్నారు. నమ్మలేని నిజమేంటంటే, టీనేజర్లు కూడా ఇ - సిగరెట్లకు అలవాటు పడుతున్నారంటే, పరిస్థితి ఎంత దారుణంగా మారిపోయిందో అర్ధం చేసుకోవచ్చు. అందుకే సెంట్రల్‌ గవర్నమెంట్‌ ఇ - సిగరెట్స్‌పై నిషేధం విధించింది. ఇప్పటికే ఇండియాలోని పలు రాష్ట్రాలు వీటిని బ్యాన్‌ చేశారు. మరికొన్ని దేశాలు కూడా బ్యాన్‌ చేశాయి. అయితే, ఇంతవరకూ విదేశాల నుండి దిగుమతి చేసుకునే ఇ - సిగరెట్ల సంస్థలు, ఇండియాలోని కొన్ని సంస్థలతో కలిసి ఇక్కడే ఎస్టాబ్లిష్‌ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయట. అందుకే మన సెంట్రల్‌ గవర్నమెంట్‌ వీటిపై బ్యాన్‌ విధించే డెసిషన్‌ తీసుకుంది. గవర్నమెంట్‌ ఆదేశాలు పాఠించక వీటిని ఉపయోగించేవారికి లక్షల్లో జరిమానాలు, సంవత్సరం పాటు జైలు శిక్షలు కూడా విధించేలా ఆదేశాలు జారీ చేసింది.

ఏదో అనుకుంటే, ఇంకేదో అయ్యిందంటే ఇదే మరి. పొగాకు అలవాటును మాన్పించే ఉద్దేశ్యంతో ప్రవేశపెట్టబడిన ఇ - సిగరెట్లుకు, అలవాటున్న వారు మానడం లేదు సరికదా.. కొత్తగా అలవాటు చేసుకున్న వారు సరికొత్త కిక్‌ని ఆస్వాదిస్తున్నారు. ఇ - సిగరెట్స్‌లోని నికోటిన్‌ అనే ద్రవ పదార్ధం మండి, ఆవిరి రూపంలో పొగని విడుదల చేస్తుంది. ఈ ఆవిరి పొగని ఆస్వాదించేందుకు యూత్‌ అమితమైన ఆసక్తి చూపుతోంది. తద్వారా స్మోకింగ్‌ ఈజ్‌ ఇన్‌జ్యూరియస్‌ టు హెల్త్‌ అనే క్యాప్షన్‌ కాస్తా, స్మోకింగ్‌ ఈజ్‌ ఎంజాయ్‌ఫుల్‌ టూ యూత్‌ అన్నట్లుగా మారిపోయింది. మామూలు పొగాకులో ఉండే హానికరమైన కెమికల్స్‌తో పోలిస్తే, ఈ ఇ - సిగరెట్స్‌లో హానికారక కెమికల్స్‌ని ఎక్కువగా చొప్పించడంతో అది మెదడు, నాడీ వ్యవస్థలపై వింత పరిణామాలకు దారి తీస్తోందట. అలాంటప్పుడు ఇలాంటి వాటిని బ్యాన్‌ చేయాలి.. తప్పదు కదా. అదే మన ప్రభుత్వం చేస్తోంది. అంతా బాగానే ఉంది కానీ, ప్రభుత్వ చర్యలతో ఈ వికృత వ్యసనానికి అడ్డుకట్ట పడుతుందా.? ఏమో చెప్పలేం. బట్‌ లెట్స్‌ వెయిట్‌ అండ్‌ సీ.!