అంగరంగ వైభవంగా జరిగిన కౌశిక్ బాబు, రత్నప్రభల వివాహం - ..

Kaushik Babu and Ratnaprabala's wedding

అనేక సినిమాలలో బాలనటుడిగా ప్రేక్షకులకు సుపరిచితుడైన కౌశిక్ బాబు ఆ తర్వాత అయ్యప్పస్వామి సీరియల్ ద్వారా ప్రేకషకుల మనసుల్లో చెరగని ముద్ర వేసాడు. భారీ తారాగణంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన జగద్గురు చిత్రం కౌశిక్ బాబు కెరీర్ లో మరో గొప్ప మైలు రాయి...మిస్టర్ కె చిత్రం తో మాస్ పాత్రలో తళుక్కుమన్న కౌశిక్ కొన్ని షార్ట్ ఫిల్మ్ స్ ద్వారానూ వీక్షకులను ఆకట్టుకుంటున్నాడు. నవంబర్ 21 న కౌశిక్ బాబు వివాహం చి.ల.సౌ. రత్నప్రభ తో చెన్నై లోని ఎస్.కె.వి. మహల్ లో జరిగింది. 25 సోమవారం రోజున హైద్రా బాద్ లోని తారామతి బారాదరిలో జరిగిన రెసెప్షన్ కి పలువురు సినీ, రాజకీయ, పత్రికా రనగ ప్రముఖులు హాజరై వధూవరులను ఆశీర్వదించారు. కౌశిక్ బాబు తండ్రిగారు పి. విజయబాబు నాలుగు దశాబ్దాలుగా పాత్రికేయ రంగంలో ఉన్నారు.

సహసంపాదక స్థాయి నుంచి సంపాదకస్థాయి వరకు అనేక సంవత్సరాల పాటు ఆంధ్రప్రభ దినపత్రికకు సేవలందించారు. ఆ తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎంపికలో సమాచార హక్కు కమీషనర్ గా సేవలందించి పదవీ విరమమణ చేసి, న్యాయవాదిగా కొనసాగుతున్నారు....  

మరిన్ని వ్యాసాలు

Yuathalo Atmanyunataa bhaavam
యువతలో ఆత్మనూన్యతా భావం
- సి.హెచ్.ప్రతాప్
పింగళి లక్ష్మికాంతం కవి.
పింగళి లక్ష్మికాంతం కవి.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
బి.వి.నరసింహారావు.
బి.వి.నరసింహారావు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు
Kutumbame Jeevanadharam
కుటుంబమే జీవనాధారం
- సి.హెచ్.ప్రతాప్
Pempakam lo premarahityam
పెంపకంలో ప్రేమరాహిత్యం
- సి.హెచ్.ప్రతాప్