తొలగినభ్రాంతి - ---ఆదూరి.హైమావతి.

Toligina Brahnti

    కనపర్తిగ్రామ పొలిమేరల్లోని బాహుదా నదీతీరంలో సత్య దేవుడనే ఒక యోగి చిన్న

పర్ణశాల నిర్మించుకుని, అడవిలో లభించే పండ్లో ,కాయలో భుజిస్తు దైవధ్యానం

చేసుకుంటూ ఉండేవాడు. 
   

ఆయన సకలశాస్త్రాలనూ ,వేదసారాన్నీ ఔపోసన పట్టిన విద్యావేత్త..   
       

కనపర్తికి వచ్చిపోయే జనం నది నీరుత్రాగి అలసట తీర్చుకోను ఆ ఆశ్రమ పరిసరాల్లో

కొంతసేపు విస్రమించి వెళ్ళే వారు. కుటీరం బయట ఎప్పూడైనా సత్య దేవుని

చూసినపుడు జనులు ఆయనున సమీపించి నమస్కారం చేసేవారు. వారితో ఆయన

ఎంతోశాంతంగా,ఆప్యాయంగా మాట్లాడేవాడు. ఆయన చెప్పే మాటలు వారి

హృదయాలకు హత్తుకునేవి. 
   

       ఆయన చిన్న కధల రూపంలో వేదాంతసారాన్నీ, ఆధ్యాత్మికతనూ, మానవతా

విలువలను రంగరించి చెప్పే వాడు. అప్పూడప్పుడూ వారు తమ సందేహాలను  ,

ఇబ్బందులనూ కూడా చెప్పుకోగా  ఆయన వారిని  మంచి మాటలతో ఓదార్చి తగిన

సూచనలు చేసేవాడు. 
       

    అలా ఆనోట ఆనోటా సత్య దేవుని గురించి గ్రామాల్లో బాగా ప్రచారమైంది. అనేక

మంది కేవలం ఆయన మాటలు విననే వచ్చే వారు.గ్రామాల నుంచీ  బండ్లు కట్టుకుని

వచ్చి ,వండుకు తింటూ అక్కడే మూడు నాలుగు రోజులుగడిపేవారు . అలా అలా

ఆయన విద్వత్తును  గుర్తంచి ,యన గురించీ తెలిసి దూర గ్రామాలవారు సైతం 

వచ్చి, తమ బిడ్డలకు విద్యా దానం చేయమని బ్రతిమాల సాగారు. జనం తమబిడ్ద ల

తో అలావచ్చి విద్య బోధించమని కోరగా అన్నిదానా ల్లోకీ విద్యాదానం గొప్పది గనుక

కాదనలేక ఆయన వారినంతా తన ఆశ్రమంలో చేర్చుకుని విద్యబోధించ సాగాడు.

జనమంతా తమ బిడ్దలకోసం వారే అక్కడ చిన్న చిన్న నివాసాలు నిర్మించి , కావలసి

న వస్తు సామాగ్రీకూడా ఏర్పరచి ,తమ బిడ్దలను ఆయన సం రక్షణలో వదలి వెళ్ళసా

గారు.  

 సత్య దేవుని  పర్ణశాల ఒక ఆశ్రమ పాఠశాలగా మారిపోయింది. సత్య దేవుని వద్ద విద్యా

భ్యాసం    ముగించిన వారు పరాయి రాజ్యాలకెళ్ళి, విద్యా బోధ చేస్తి గురువు కీర్తి

ని  చాటు తూ ,పేరుప్రతిష్టలు పొంది , ధన మార్జించి సుఖంగాజీచించ సాగారు.       

 క్రమక్రమేపీ సత్య దేవుడు వృధ్ధాప్యం  వల్ల బలహీనపడ్డాడు. తొమ్మిదిమంది విద్యార్ధు

లుమాత్రం తమ విద్య పూర్తైనా ఆయన్ను  వదలి వెళ్లక అక్కడే ఉండసాగారు.

సత్యదేవుడు ఎంత చెప్పినా వారు "గురుదేవా మిమ్ము వదలి వెళ్లనే వెళ్లము. మిమ్ము

వీడి మేము బ్రతకలేము " అని చెప్పి ఆయన్నే ఆశ్రయించుకుని ఉండసాగారు. సత్య

దేవుడు, " బిడ్డలారా!  విద్యాబ్యాసం  పూర్తై చాలాకాలమైంది.మీరింకా మీమీ గ్రామాకు

వెళ్ళి, ఎదో వృత్తి చేపట్టి మీ తల్లిదండ్రులను పోషించాలి. మీ జీవన విధానాన్నీ

రూపొందించుకోవాలి .వెళ్ళిరండి." అని ఎన్నిమార్లుచెప్పినా వారు "గురుదేవా ! మేము

మిమ్ము వదలి  జీవించలేము. మన్నించండి." అని సమాధానం చెప్పారు.ఆయన

చిరునవ్వు నవ్వి ఊరుకున్నాడు.   

   కొంత కాలానికి సత్య దేవుడు భౌతిక శరీరాన్ని వీడాడు.ఆతొమ్మిదిమందీ ఆయన

పార్ధివదేహం చుట్టూ చేరి విలపించసాగారు.
 
     ఇంతలో అటు వెళుతున్న  ఒక భిక్షకుడు ఆ ఆశ్రమ సమీపానికి వచ్చి ,

"ఎందుకయ్యా ! ఇలా విలపిస్తున్నారు?ఏంకష్టం వాటిల్లింది " అని ప్రశ్నించాడు.

దానికివారు "అయ్యా మాకుకలిగిన కష్టం ఇంతింతని చెప్పలేనిది. మాసర్వస్వం ఐన

మా  మాగురుదేవులు మమ్ము వదలి వెళ్ళారు. ఇంత కంటే కష్టం మాకేముంది?" అని

విలపిస్త్యున్న శిష్యులతో   "మీవంటి మూర్ఖులు, అవివేకులూ శిష్యులైనందుకు బ్రతికి

ఉంటే మీ గురువుగారు ఎంతో బాధపడి ఉండేవారు.ఎంతో కాలం ఆయన దగ్గ నేర్చు

కున్న విద్య మీకు  కొంతైనా అంటనందుకు మీకు సిగ్గుగాలేదా!"అని చెప్పి ఆయన

వెళ్ళిపోయాడు.   
   

  ఆయన వెళ్ళేక ఆ తొమ్మిది మందీ  లోచించి తమ అవివేకానికి సిగ్గుపడి, ఆవచ్చి

నాయన సామాన్య భిక్షువుకాదనీ, ఎవరో అవధూత అనీ తెల్సుకుని , తమ గురుదేవులు

చెప్పిన వేదాంత సారాన్నీ, ఆధ్యాత్మికతనూ , గురువుబోధించిన ఆత్మ తత్వాన్నీ గుర్తు

కు తెచ్చుకుని గురువు భౌతికకాయానికి తగిన కర్మక్రతువులు గావించి, గ్రామగ్రామానా

తిరుగుతూ తాము నేర్చిన ఆధ్యాత్మికసారాన్ని ప్రవచించసాగారు.  
 

విద్య విలువ , యదార్ధ జ్ఞానం గ్రహించని చదువు వృధాకదా!