కరోనా-ప్రకృతి విపత్తు కాదు,ప్రకృతి హెచ్చరిక - CHAITANYA NALLALA

కరోనా-ప్రకృతి విపత్తు కాదు,ప్రకృతి హెచ్చరిక

కరోనా – ప్రకృతి విపత్తు కాదు , ప్రకృతి హెచ్చరిక

యావత్ ప్రపంచం నేడు కంటికి కనిపించని ఒక సూక్ష్మజీవి , వైరస్ కబండ హస్తల్లో చిక్కుకుపోయింది .దాదాపు 200 దేశాలు నేడు దీనీ ద్వారా ప్రభావితమయ్యాయ్ . తన లోని జెన్యూ పరిమాణాని మార్చుకుంటూ ఒకో దేశం లో ఒక్కో రకంగా ప్రజల్ని హింసిస్తుంది. ఆనాడు రాక్షసులు , మానవత్వం లేకుండా ఉండే రాజుల ద్వారా కొట్టి,చంపి పీడించబడిన ప్రజలు ప్రజలు,ఈరోజు కంటికి  కనిపించని ఒక వైరస్ ద్వారా అంతకన్నా ఎక్కువ బాధని అనుభవిస్తున్నారు . వైరస్ సోకిన వ్యక్తిని పక్కన పెడితే , మామూలు జనాలు కూడా ఘోరమైన అనుభవాన్ని చవిచూశారు . ప్రపంచం లోని అన్నీ దేశాల్లో ఆర్ధికవ్యవస్థ చిన్నాభినమై0ది. చిరు వ్యాపారులు , ఆటోమొబైల్ రంగం ,వలస జీవులు , ఇల చెప్పుకుంటూ పోతుంటే ఈ భూమి మీద ఈ కరోనా విపత్కర సమయం లో , ఈ వైరస్ ద్వారా లేదా దీని సంక్రమాణాన్ని ఆపేందుకు ప్రభుత్వాలు తెసుకుంటున్న లాక్ డౌన్ లాంటి చర్యల ద్వారా ప్రభావితం కానివారెవారుండరు .

                       కానీ , దీన్ని ఒక విప్పత్తు అనే దానికన్న ఒక హెచ్చరిక అంటే బాగుంటుందని నా అభిప్రాయం . ఇది మానవాళి కి ప్రకృతి చేస్తున్న హెచ్చరిక . ఈ భూమ్మీద అనేకమైన జీవులు ఉన్నాయ్.అందరిలో కన్నా మానవుల మెదడు బాగా అభివృద్ధి  చెందింది . ఒక చీమ , మానం ఈ భూమి నుంచే పుట్టాం . కానీ చీమ మానంత చేయలేదు,మనం చీమన్తా చేయలేం . ఈరోజు మానవాళి చేస్తున్న అభివృద్ధి చాలా ఉపయోగపడుతుంది అని అనడం లో ఎలాంటి సందేహం లేదు.మనం చేస్తున్న అభివృద్ధి మానవజాతి కి సహాయపడి , ఒక విలాసవంతమైన జీవితం అనుభవించడానికి, ఎలాంటి కష్ట0 కూడా లేకుండా ఉండటానికి చేస్తున్నాం కానీ , ఆ అభివృద్ధి లో కేవలం మానవజాతి మాత్రమే ఉంది, ప్రకృతి సహకారం గాని , ఇతర జీవుల మేలు చేకూరే ప్రసక్తే లేదు . ప్రకృతి సహకారం లేనిదే ఏది కూడా జరగద౦టారు . అదే ప్రకృతి తలుచుకుంటే ఎదైన జరగవచ్చు . ఆవిష్కరణలకు ప్రకృతి సహకారం తోడై , సకల జీవులను  మన అభివృద్ధి లో భాగం చేసుకుంటే ఇలాంటివేవీ కూడా జరగడానికి ఆస్కారం ఉండదు.చైనా లోని వ్యూహన్ నగరం లోని మాంస విక్రయశాల నుండి ఈ వైరస్ పుట్టివుండవచని నిపుణుల అంచనా . అది నిజం కావచ్చు కాకపోవచ్చు .ఒకవేళ అది నిజమైతే ఆ నగరవాసులు గబ్బిలల మాంసాన్ని సేవించకపోతే , గబ్బిలాలు,మనం ఎవరి మానాన వాళ్ళు బ్రతికేవళ్ళు .  మనకోసం , మనతో జీవిస్తున్న ఇతర జంతువుల్ని హింసిస్తే,ఇద్దరి తల్లి – భూమాత ఊరుకుంటుందా ? ఇలా ఏదో ఒక రూపంలో మనల్ని హెచ్చరిస్తుంది . ఇలా హెచ్చరికలు మనవాళికి చాలానే వచ్చాయ్,వస్తున్నాయ్,ఇకపై వస్తాయి కూడా . మనం మన అభివృద్ధి లో ప్రకృతి ని జోడి౦చకుండా,దాని పై దండయాత్ర చేస్తే ఇలంటి హెచ్చరికల కలా౦ ముగిసి చివరికి మానవాళి అంతం ఖాయం . ఇప్పుడైనా మనం చేస్తున్న ప్రతి ఒక్క పని లో ప్రకృతికి మేలు చేయకపోయినా ఫర్వాలేదు కానీ కీడుచేకూరిస్తే ఇలాంటివి మళ్ళీ మళ్ళీ సంభవిస్తాయ్.అభివృద్ధి అనే ముసుగులో ప్రకృతిని మరియు ఇతర జీవుల్ని వాటి ప్రాణాల్ని హరిస్తున్నాం.సెల్ ఫోన్ టవర్ల రేడియేషన్ తో పక్షులు ఆ దరిదాప్పులోకి కూడా రావడం లేదు. ఉరేనియం తవ్వకాలను చేపట్టి  అడవుల్ని ద్వంసం చేస్తున్నాం . గనుల తవ్వకాల పేరుతో మట్టిలోని సారాన్ని నాశనం చేస్తున్నాం . ప్లాస్టిక్ వాడకం తో కూడా ఎక్కువ అనార్ధాలు జరుగుతున్నయ్ .అప్పట్లో తిండి లేకుంటే పుట గడవక పోతుండే కానీ ఇప్పుడు ప్లాస్టిక్ వాడకుండా లేనిది పూటగడవడం లేదు. పరిశ్రమల వ్యర్ధల్ని నదుల్లోకి వొదులుతున్నాం . గాలిని చాలా రకాలుగా కలుషితం చేస్తున్నాం .

                    ఇలా నేల , నీరు , గాలి,అడవి,జంతువులు,పక్షులు అన్నింటిని నాశనం చేస్తున్నాం.కారణం , కేవలం “మన సుఖం”. ”మా” అనే భావన పోయి “మనం” అనే భావన రావాలి .ఇది మానవునికోసం తయారుచేసిన ప్రపంచం కాదు , మనం మనకు అనుగుణంగా మార్చుకొని “ఇది మా భూమి“ అని అనుకుంటున్నం . అది వాస్తవం కాదు . మానవుడు తన దుర్భుద్ధి తో అభివృద్ధి అనే ముసుగు లో మన భూమిని మనమే నాశనం చేసుకుంటున్నం . మనం చేస్తున్న అభివృద్ధి లో ప్రకృతిని భగస్వామ్యం చేస్కుందాం . తోటి జీవుల్ని బ్రతికిస్తూ మనం బ్రతుకుదా౦. ప్లాస్టిక్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గిదా౦. సేంద్రీయ వ్యవసాయం వైపు అడుగులు వేదాం. ప్రభుత్వాలు కూడా సేంద్రీయ మరియు నియంతృత వ్యవసాయం వైపు రైతుల్ని ప్రోత్సహించాలి . ప్రకృతి శక్తి ముందు మానవ శక్తి పరిమితం అని గుర్తుంచుకొని ప్రకృతిని , మన చుట్టూ ఉండే జీవ-జంతువుల్ని గౌరవిస్తూ , మన అభివృద్ధి లోని లోటుపాట్లను సరిదిద్దుకొని జీవనం సాగిద్దా౦. దీన్ని రాజకీయ అంశం గా కాకుండా ఒక సవాల్ గా తీసుకొని , జయించి , మనం కూడా ప్రకృతి లో ఒక భాగ౦గా కానీ,ప్రకృతిని మించిన వాళ్ళం కాదని గ్రహించి “ప్రకృతిక జంతు సహ జన - జీవన స్రవంతి “అనే ఎజెండా తో ముందుకు నడుద్ద౦.చివరిగా ధర్మాన్ని రక్షిస్తే ధర్మమే మనల్ని రక్షిస్తుందని విన్నాం , కానీ ఇప్పుడు ప్రకృతిని రక్షించి, గౌరవిస్తే ప్రకృతే మనల్ని రక్షిస్తుందని గుర్తిద్దాం.

                                           

                                                                                ఎన్.చైతన్య

                                                                              

మరిన్ని వ్యాసాలు

Cine srungaram
సినీ శృంగారం
- మద్దూరి నరసింహమూర్తి
Heaven On Earth - Kashmir
భూలోక స్వర్గం కాశ్మీర్
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
రెండవ ప్రపంచ యుద్ధం-రహస్యాలు/విశేషాలు 6
రెండవ ప్రపంచ యుద్ధం - 6
- శ్యామకుమార్ చాగల్
పెళ్ళి పదికాలాలూ నిలవాలంటే పాత ప్రేమికులను వదులుకోవాల
పెళ్ళి పదికాలాలూ నిలవాలంటే...
- సదాశివుని లక్ష్మణరావు
ప్రభల సంస్కృతి .
ప్రభల సంస్కృతి .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
బుడబుక్కలవారు.
బుడబుక్కలవారు.
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
పూరి జగన్నాధ రథ యాత్ర .
పూరి జగన్నాధ రథ యాత్ర .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.
వీధి నాటకం .
వీధి నాటకం .
- డా.బెల్లంకొండ నాగేశ్వరరావు.