ప్రముఖ బాలీవుడ్ నేపధ్య గాయకుడు - కిషోర్ కుమార్ - ambadipudi syamasundar rao

ప్రముఖ బాలీవుడ్ నేపధ్య గాయకుడు -  కిషోర్ కుమార్

భారతీయ సినీ ప్రేక్షకులకు ఏ ప్రాంతము వారికైనా కిషోర్ కుమార్ తన పాటల ద్వారా చిరపరిచితుడు తన నేపధ్య గానముతో ఎన్నో సినిమాలను విజయవంతము చేసిన ప్రముఖ గాయకుడు కిషోర్ కుమార్. ఈయన గంగూలీ సోదరుల్లో చిట్ట  చివరి వాడు. గంగూలీ సోదరులలో పెద్దవాడు అశోక్ కుమార్ ప్రముఖ బాలీవుడ్ నటుడు. కిషోర్ కుమార్ అసలు పేరు అభాస్ కుమార్ గంగూలీ ఒక బెంగాలీ బ్రాహ్మణుడు ఆగస్టు 4న కుంజలాల్ గంగోపాధ్యాయ అనే లాయర్, గౌరీ దేవి అనే ధనిక దంపతులకు మూడవ సంతానంగా మధ్యప్రదేశ్ లోని ఖాండ్వా లో జన్మించాడు  తరువాతి సోదరుడు అనూప్ కుమార్ కూడా బాలీవుడ్ నటుడే వీళ్ళు ముగ్గురు కల్సి నటించిన చల్తీకానామ్ గాడి సినిమా ఆరోజుల్లో సూపర్ డూపర్ హిట్ ఇప్పటికి ఆ పాటలు బాగా ఫెమస్ కిశోరె కుమార తండ్రి కామవిసదర్ గోఖలే కుటుంబానికి లాయర్ గా  ఖండ్వా వచ్చాడు 1960లో అప్పటి ప్రముఖ హీరోయిన్ మధుబాలను పెళ్లి చేసుకోవటానికి అబ్దుల్ కరీమ్  గా పేరు మార్చుకొని ఇస్లామ్ మతము స్వీకరించాడు. ఈ పెళ్లిని కిషోర్ కుమార్ కుటుంబము వాళ్ళు కానీ మధుబాల కుటుంబము వాళ్ళు కానీ అంగీకరించలేదు అందుచేత మధుబాల పెళ్లి అయినా నెలకే బాంద్రా లోని తన సొంత ఇంటికి వచ్చేసింది. ఈయన మొత్తము నాలుగు సార్లు పెళ్లిళ్లు చేసుకున్నాడు మొదటి భార్య రుమా ,రెండవ భార్య మధుబాల, మూడవ భార్య యోగితా , నాల్గవ భార్య లీనా. కిషోర్ కుమార్ కు మొదటి భార్య ద్వార అమిత్ కుమార్, రుమ అనే  కొడుకులు లీనా ద్వార సుమిత్ కుమార్ అనే కొడుకు ఉన్నారు నాలుగు పెళ్లిళ్లు చేసుకున్నా ఒంటరి జీవితానికి ఇష్టపడేవాడు మొక్కల పట్ల అభిమానంతో మొక్కలతో మాట్లాడుతుండేవాడు. అందుచేత చాలా మంది కిషోర్ కుమార్ ను పిచ్చివాడు  అనేవారు మొక్కలకు పేర్లు పెట్టి ఆ మొక్కలను ఆ పేర్లు పెట్టి పిలిచేవాడు ఎవరైనా ఇంటిముందు గెట్ కు బీవేర్ ఆఫ్ డాగ్స్ (కుక్కలున్నాయి జాగ్రత్త )కాని కిషోర్ కుమార్ వెరైటీగా గెట్ కు " బీవేర్ ఆఫ్ కిషోర్ కుమార్ " (కిషోర్ కుమార్ ఉన్నాడు జాగ్రత్త )అని బోర్డు తగిలించుకున్న మేధావి
కిషోర్ కుమార్ చిన్నవాడుగా ఉన్నప్పటికి అశోక్ కుమార్ బాగా పేరున్న నటుడు అలాగే రెండవ సోదరుడు అనూప్ కుమార్ కూడ అన్న అశోక్ కుమార్ సాయముతో చిత్ర సీమలో అడుగుపెట్టాడు కిషోర్ కుమార్ ఇండోర్ లోని క్రిస్టియన్ కాలేజినుండి గ్రాడ్యుయేట్ పట్టా పుచ్చు కున్నాడు.  కిశోర్ కుమార్ భారతీయ చలన చిత్ర పరిశ్రమలో చాలా ప్రసిద్ధిచెందిన గాయకుడు అనేక రకాల పాటలు పలుభాషలలో పాడి జనాన్ని మెప్పించిన గాయకుడు ఈ రోజు ఆ మనిషి లేకపోయినా అయన పాటలు ఇష్టపడని ప్రేక్షకులు లేరు.ఈయన స్వరము చాలా చిత్ర విచితరముగావుండేది సినిమాపాటలే కాకుండా ప్రయివేట్ ఆల్బమ్స్ కూడా ప్రెసెంట్ చేసేవాడు ఈయన కెరీర్ లో 8 ఫీల్మ్  ఫేర్ అవార్డులు పొందాడు ఇది ఏ మెల్ ప్లే బాక్ సింగర్ సాధించని రికార్డు.1997 లో మధ్యప్రదేశ్ ప్రభుత్వమూ కిషోర్ కుమార్ పేరుతొ ఒక అవార్డు ను హిందీ సినిమాకు అయన చేసిన సేవలకు గుర్తింపుగా నెలకొల్పింది ఇంకొక అబ్దుతమైన రికార్డు ఏమిటీ అంటే అయన చివరిగాపాడిన పాట  ఇంకా విడుదల కాకుండానే 2012 లో వేలానికి వెడితే 1,56మిల్లియన్ రూపాయలకు అమ్ముడైయింది ఈయన సినీ చరిత్ర అంతా రకరకల వింత వింత సంఘటనలతో జరిగిపోయింది
ప్రముఖ హిట్ సినిమా ఆనంద్ లో మొదట రాజేష్ ఖన్నా వేసిన వేషానికి కిషోర్ కుమార్ ను అనుకున్నారట ఆ సినిమా డైరెక్టర్ ముఖర్జీ అగ్రిమెంట్ సైన్ చేయించు కోవటానికి కిషోర్ కుమార్ ఇంటికి వెళితే గెట్ కీపర్ కిషోర్ కుమార్ ఏ బెంగాలిని ఇంట్లోకి తానివ్వదని చెప్పడని  ముఖర్జీని ఇంట్లోకి వెళ్లనివ్వలేదు ఎందుకంటే అంతకుమునుపు కిశోరె కుమార్ కు ఒక  బెంగాలీ షో ఆర్గనైజర్ ఇవ్వవలసిన డబ్బు పూర్తిగా ఇవ్వలేదని ఏ బెంగాళిని ఇంట్లోకి రానివ్వదని ఆర్డర్ ఇచ్చాడు ఆ విధముగా కిషోర్ కుమార్ ఆనంద్ సినిమా ఛాన్స్ పోగొట్టుకున్నాడు.39 ఏళ్ల  వయస్సు వరకు కిషోర్ కుమార్ సక్సెస్ కోసము స్ట్రగుల్ అవుతూనే వున్నాడు 1969లో ఆరాధన సినిమాపాటల వల్ల కిషోర్ కుమార్ కు విజయము వరించింది దురదృష్టము ఏమిటి అంటే అదే సంవత్సరములో భార్య మధుబాల చనిపోయింది.
కిషోర్ కుమార్ ను చిత్ర సీమలో కిషోర్ దా అని ముద్దుగా పిలిచేవారు. ఆశ్చర్యము ఏమిటి అంటే కిషోర్ దా ఏ నాడు ఏమాత్రము సంగీతము నేర్చుకోలేదు కానీ ఆనాటి ప్రముఖ గాయకుడు కెఎల్ సైగల్ కు వీరాభిమాని మొదట్లో అయన స్టైల్ ను అనుకరించేవాడు అందుచేత సైగల్ ను తన గురువుగా చెప్పుకొనేవాడు.అలాగే విశ్వ కవి రవీంద్ర నాధ్ టాగోర్ అన్న అభిమానమే.అలాగే హాలీవుడ్ నటుడు గాయకుడు అయిన డ్యానీ కే కు అభిమాని కూడా అందుచేత ఈ ముగ్గురి ఫోటోలను తన గౌరీ కుంజ్ నివాసములో తగిలించుకొని వారికి తన శ్రద్ధాంజలి ఘటిస్తూ ఉండేవాడు. తరువాతి రోజుల్లో అహమ్మద్ రష్ది అనే ప్లే బాక్ సింగర్ ప్రభావము కూడా ఈయన పాడే పాటల మీద ఉండేది ఒకసారి లండన్ రాయల్ ఆల్బర్ట్ హాల్ లో అయన పాడిన పాటలు పాడుతూ అయన పట్ల తనకున్నగౌరవాన్ని చాటుకున్నాడు.కిషోర్ కుమార్ పాటలుపాడేటప్పుడు ప్రత్యేకమైన "యోడెలింగ్ " అనే దాని ప్రక్రియను వాడేవాడు అది బాగా ఫెమస్ అయింది దీనికి ప్రేరణ హాలీవుడ్ సింగర్లు జిమ్మీరోడ్జెర్స్ మరియు టెక్స్ మోర్టాన్
ఇందాక చెప్పినట్లు కిషోర్ దా నిర్మాతలతో డైరెక్టర్లతో వింతగా ప్రవర్తించేవాడు ఒకసారి ఒక ప్రముఖ దర్శకుడు పాటల రికార్డింగ్ కు రమ్మన్నప్పుడు ఆ డైరెక్టర్ స్టూడియోకు దోతీ కుర్తా వేసుకువస్తేనే తానూ రికార్డింగ్ కు వస్తానని షరతు పెట్టాడు తనకు రావలిసిన  డబ్బు విషయములో నిర్మాతలతో చాలా గట్టిగాఉన్నప్పటికీ తనకు ఇష్టమైన వాళ్లకు ఫ్రీగా పాటలు పాడేవాడు అటువంటి మిత్రులలో రాజేష్ ఖన్నామరియి డాని డెన్ జొప్ప ఉన్నారు.ఒకసారి ఒక నిర్మాత సగము డబ్బులే ఇచ్చి సగము బాకీ ఉంటె సగమే ముఖానికి మేకప్ చేసుకొని నీవు సగమే డబ్బులు ఇచ్చావు కదా?అని చెప్పాడట. అటువంటి వింత సంఘటనలు కిషోర్ జేసీని జీవితములో చాలా ఉన్నాయి  1975-77 లో ఎమర్జెన్సీ రోజుల్లో ప్రధాని ఇందిరాగాంధీ కొడుకు సంజయ్ గాంధీ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్రచారానికి పాటలు పాడమని అడిగితె కిషోర్ దా తిరస్కరించటం వలన కిషోర్ దా పాటలను అల్ ఇండియా రేడియోలో అనధికారికంగా సంజయ్ గాంధీ నిషేధించాడు.
కిషోర్ దా తన మరణాన్ని ముందుగానే  ఉహించాడని  అంటారు చనిపోయే ముందు తన చిన్న కొడుకు ఈత క్లాసుకు  వెళుతుంటే వద్దు ఇంటి దగ్గరే ఉండమని అన్నాడుట.అలాగే తన కొడుకు అమిత్ కుమార్ ఫ్లయైట్ ఇండియా రావటానికి ఆలస్యము అయితే వర్రీ అయినాడుట. అక్టోబర్ 13, 1987న గుండె నొప్పితో కిషోర్ దా మరణించాడు తన అంత్యక్రియలను తన జన్మస్థలం అయినా ఖండ్వాలో జరగాలని కోరుకున్నాడు. అలాగే జరిగింది కిషోర్ దా మరణించిన కొద్దికాలంలోనే కిషోర్ దా మొదటి భార్య రుమా (ప్రముఖ దర్శకుడు సత్యజిట్ రే మేనకోడలు) మరణించింది.
అన్న అశోక్ కుమార్ సినిమాలలో నటిస్తూ ఉండటం వలన గంగూలీ కుటుంబము తరచుగా బొంబాయి వస్తు ఉండేవారు కిషోర్ కుమార్ అన్న ప్రవుద్బలముతో సినిమా రంగములో తన అదృష్టాన్ని పరీక్షించుకోవటానికి బృంద గానములో ఒక సభ్యుడిగా బాంబే టాకీస్ లో కెరీర్ మొదలు పెట్టాడు 1946ల వచ్చిన షికారు సినిమా నటుడిగా కిషోర్ కుమార్ మొదటి సినిమా.ఆ సినిమాలో అన్న అశోక్ కుమార్ హీరోగా నటించాడు.   .
అప్పట్లో సంగీత దర్శకుడు ఖేమ్ చంద్  ప్రకాష్ కిషోర్  కుమార్ కు జిద్ధి సినిమాలో పాడే అవకాశము ఇచ్చాడు ఆ తరువాత కిషోర్ కుమార్ కు అనేక అసైన్మెంట్స్ వచ్చినాయి కానీ వాటి పట్ల కిషోర్ కుమార్ శ్రద్ద పెట్టలేదు 1951లో బాంబే టాకీస్ వారి అందోళన్ సినిమాలో లీడ్ రోల్ లభించింది. నటుడిగా కెన్నీ ఆఫర్లు వచ్చినా కిషోర్ నటన మీద కన్నా గాయకుడిగా సెటిల్ అవ్వాలని ప్రయత్నించాడు.ఎందుకంటే 1946 నుండి  1955 వరకు నటించిన 22 సినిమాలలో 16 దాకా ఫెయిల్ అయినాయి. ఆ తరువాత అంటే 1955 నుండి 1966 మధ్య వచ్చిన లడీకి ,మిస్ మలేషియా, చార్ పైసే , వంటి సినిమాలు హిట్ అవటం వలన మళ్ళా కిషోర్ కుమార్ కు నటన మీద అభిమానము పెరిగింది.
అప్పట్లో ప్రముఖ సంగీత దర్శకుడు  సలీల్ చౌదరి కిషోర్ కుమార్ కు సంగీత పరిజ్ఞాన ము  లేదుకాబట్టి అతని చేత పాటలు నౌకరి సినిమాలో పాటలు  పాడించటానికి ఒప్పుకోలేదు హేమంత్ కుమార్ చేత పాటలు పాదిద్దామని అనుకున్నాడు కానీ కిషోర్ కుమార్ పాడటం విన్నాక పాటలు పాడే ఛాన్స్ ఇచ్చాడు.ఆ తరువాత చాలా కమ్మర్షియల్ హిట్ పాటలు కిషోర్ కుమార్ ఖాతాలో చేరినాయి. నటుడిగా విజయవంతమైన పీరియడ్ 1954 నుండి 1966 మధ్యకాలం ఆ కాలములో ప్రముఖ లీడింగ్ హీరోయిన్లతో కల్సి నటించి విజయవంతమైన సినిమాలు ఇచ్చాడు. హాఫ్ టికెట్ అనే సినిమాలో ఒక యుగాల గీతము కిషోర్ కుమార్ లతామంగేష్కర్ లతో పాడించాలి ఆ సమయానికి లతాజీ లేకపోవటంతో కిషోర్ కుమార్ అడా మెగా గొంతులతో తానె మొత్తము పాత పది సూపర్ హిట్ చేసాడు ఈ సినిమాకు కూడా కిషోర్ కుమార్ ను వద్దన్నా సంగీత దర్శకుడు సలీల్ చౌదరి యే.
కిషోర్ కుమార్ టాలెంట్ ను బయటకు తెచ్చిన వ్యక్తి ఎస్ డి బర్మన్ సంగీత దర్శకుడే మార్షల్ సినిమా తీస్తున్నప్పుడు బర్మన్ అశోక్ కుమార్ వెళ్ళి నప్పుడు కిషోర్ కుమార్ కె ఎల్ సైగల్ ను అనుకరిస్ట్ పాటలు పాడటం విన్నాడు అప్పుడు అనుకరించటం కంటే తన సొంత స్టైల్ డెవలప్ చేసుకోమని సలహాఇచ్చాడు.ఆవిధముగా కిషోర్ కుమార్ యోడలింగ్ స్టైల్ దేవ్ లాప్ చేసుకున్నాడు 1950 లోనె ప్రముఖ నటుడు దేవ్ ఆనంద్ కు పాటలు పాడటం మొదలుపెట్టాడు అవన్నీ కూడా మంచి హిట్ సాంగ్స్ గాపేరు తెచ్చుకున్నాయి. .బర్మన్ ట్రైనింగ్ తో కిషోర్ మంచి గాయకుడిగా వృద్ధి చెందాడు.ఆ విధముగా అనేక మంది సంగీత దర్శకులతో పని చేసి మంచి పాటలను శ్రోతలకు అందించాడు అలాగే మరొక ప్రఖ్యాత సంగీత దర్శకుడు సి రామచంద్ర కిషోర్ కుమార్ కు అవకాశము ఇచ్చి "ఈనా మీనా డీకా " వంటి పాటలను పాడించాడు. శంకర్ జైకిసాన్ లతో పనిచేసి క్యాట్ మానె బిల్లీ ,హమ్ తో మొహబ్బత్ కరేగా వంటి హిట్ పాటలు రవితో పాడాడు.
కిషోర్ కుమార్ పాడటమే కాకుండా జుమ్రూ సినిమాకు మ్యూజిక్ కంపోజ్ చేయటము టైటిల్ సాంగ్ రచించటము కూడా చేసాడు. తరువాత దూర్  గగన్ కి చాహుమే అనే సినిమాను సొంత దర్శకత్వములో నిర్మించాడు. అలాగే ఒక తండ్రి తన మూగ చెవిటి కొడుకుతో ఉండే సంబంధాన్ని వివరించే సినిమాకు స్క్రిప్ట్ వ్రాసి తన సొంతకొడుకు అమిత్ కుమార్ తో నటింపజేశాడు(తండ్రి పాత్ర తానూ ధరిస్తూ)  ఆ విధముగా 1965 వరకు తన బహుముఖ ప్రజ్ఞను చూపిస్తూ చిత్ర సీమలో వెలుగు వెలిగాడు.
1966 తరువాత వరుస ఫెయిల్యూర్స్ వలన ఇన్కమ్ ట్యాక్స్ గొడవల్లో పడ్డాడు ఇన్కమ్ ట్యాక్స్ బకాయిలు చెల్లించటానికి మ్యూజికల్ షోస్ ఏర్పాటు చేసుకునేవాడు.1968లో రాహుల్ దేవ్ బర్మన్ తో కలిసి పనిచేసి పడోసన్ సినిమాలో మేరె  సామ్నే వాలే కిడికిమే పాత పాడటమే కాకుండా బెంగాలీ బాబులను ఇమిటేట్ చేస్తూ కిల్లి నములుతూ ఒక పాత్ర కూడా వేసాడు ఈ సినిమాలోనే కిషోర్ కి పోటీగా మెహమూద్ తమిళ సంగీతము మాష్టారుగా పోటాపోటి నటిస్తాడు. 1969లో వచ్చిన ఆరాధనలోని  రూప్ తేరా మస్తానా వంటి పాటలు సూపర్ హిట్స్ ఈ పాటల వల్ల కిషోర్ కుమార్ బాలీవుడ్ లో లీడింగ్ ప్లే బ్యాక్ సింగర్ గా సెటిల్ అయి  1970 నుండి 1980 మధ్య కాలములో అందరు కొత్త పాత అనే తేడా లేకుండా  హీరోలకు పాటలు పాడాడు మొత్తము మీద కిషోర్ కుమార్ తన కెరీర్ లో ఎక్కువ పాటలు పాడింది రాజేష్ ఖన్నాకే (245పాటలు 92సినిమాలలో)ఆ తరువాత 202 పాటలు జీతేంద్రకు ,119 పాటలు దేవ్ ఆనంద్ కు, 131 పాటలు అమితాబ్ బచ్చన్ కు పాడాడు. ఎస్ డి బర్మన్ .ఆర్ డి బర్మన్ లతో కిషోర్ కుమార్ కాంబినేషన్ మంచి విజయవంతమైన పాటలను ఇచ్చింది కిషోర్ కుమార్ కు సంగీతము రాకపోయినా ఆర్ డి బర్మన్ కిషోర్ కుమార్ చే సెమి క్లాసికల్ పాటలు పాడించాడు. ఎస్ డి బర్మన్ ఆఖరుగా కంపోజ్ చేసిన పాత కిషోర్ కుమార్ పాడినదే, బాలీవుడ్ లోని ప్రముఖ సంగీత దర్శకులందరితో కిషోర్ కుమార్ పనిచేశాడు మహమ్మద్ రఫీ మన్నాడే లత మంగేష్కర్ ఆశా భోంస్లే వంటి గాయకులతో కలిసి పాడాడు
1981లో అమితాబ్ బచ్చన్ తన సినిమాలో గెస్ట్ రోల్ నిరాకరించి నందున ఆయనకు పాటలు పాడటం ఆపేసాడు కానీ కొన్నాళ్ళకు ఇద్దరికీ సయోధ్య కుదిరి షెహనాషా సినిమాకు సోలో పాట తో మళ్ళా పాడటం మొదలుపెట్టాడు అలాగే తాను డైవర్స్ ఇచ్చిన యోగితా బాలి ని వివాహము చేసుకున్నాడని మిథున్ చక్రవర్తికి కూడా పాటలు కొంత కాలము ఆపేసి 1970లో మళ్లా  1980లో మంచి హిట్ సినిమాలకు పాడాడు.
కిషోర్ తన సొంత సినిమా మమతా కి  ఛాహోం మే  లో రాజేష్ ఖన్నా పై తన లాస్ట్ సాంగ్ పిక్చరైజ్ చేసి 1987లో చనిపోయినాడు రాజేష్ ఖన్నా స్నేహ ధర్మముగా కిషోర్ కొడుకు అమిత్ కుమార్ కు ఆ సినిమా 1989లో రిలీజ్ అవటానికి ఆర్ధిక సహాయము చేశాడు అంతకు ముందే 1987లోనే చిత్రసీమనుండి రిటైర్ అవుదామని నిర్ణయించుకున్నాడు ఎందుకంటే మారుతున్న పాటల ట్యూన్స్ పట్ల సంగీత దర్శకుల పట్ల అసంతృప్తితో ఈ  ఇర్ణయము తీసుకున్నాడు. రిటైర్ అయి ఖండ్వాలో సెటిల్ అవుదామని అనుకున్నాడు కానీ 13 అక్టోబర్ 1987న అన్నఅశోక్ కుమార్ 76 వ పుట్టిన రోజున సాయంత్రము 4. 45గంటలకు గుండె నొప్పితో చనిపోయినాడు అయన కోరిక ప్రకారము అంత్యక్రియలు ఖండ్వా లో జరిగినాయి తర్వాతి సంవత్సరాలలో రణబీర్ కపూర్ తో కిషోర్ కుమార్ పై చలన చిత్రము తీయాలనుకున్నారు కానీ కొన్ని న్యాయ పరమైన చిక్కుల వల్ల ఆ సినిమా తీయటము కుదరలేదు.చనిపోయిన 9 ఏళ్ల తరువాత అంటే 1996లో "సాలహ్ మై తో సాబ్ బన్ గయే " అనే కిషోర్ పాడిన పాటను  రాజా హిందుస్తానీ సినిమాలో అమీర్ ఖాన్ పై చిత్రీకరించారు ఒరిజనల్ గా ఈ పాట దిలీప్ కుమార్ పై సగినా సినిమాలో చిత్రకరించారు
మధ్య ప్రదేశ్ ప్రభుత్వము ఖండ్వాలో కిషోర్ కుమార్ గౌరవార్థము ఒక మెమోరియల్ ను నెలకొల్పింది  ఇక్కడ మ్యూజియం కిషోర్ కుమార్ నటించిన సినిమాల ప్రదర్శనకు వీలుగా  ఒక మినీ థియేటర్ ను ఏర్పాటు చేశారు ప్రతి సంవత్సరము ఈ అమర గాయకుని జయంతి వర్ధంతులు ఈ ప్రదేశములో జరుపుతారు ఇవన్నీ కాకుండా ప్రేక్షకుల మదిలో శాశ్వత స్థానాన్ని పొందాడు.అందుచేతనే ఈ రోజుకి అయన పాటలు విని ఆనందిస్తున్నారు
అంబడిపూడి శ్యామసుందర రావు