ఆరోగ్యం - బన్ను

health

అన్నీ మన చేతుల్లో వుంటాయి... కానీ ఆరోగ్యం మాత్రం దేవుడి చేతుల్లో వుంటుంది అంటారు. అది నిజమే... కానీ కొంత మన చేతుల్లో కూడా వుంటుంది. ఒక్కోసారి మనమే మన ఆరోగ్యం పాడుచేసుకుంటాం! ఉదాహరణకి బద్ధకం వలన మనం మనకి రోజుకు సరిపడా నీళ్ళు త్రాగకపోవటం, వ్యాయామం/వాకింగ్ చేయకపోవటం వంటివి. మానవ ప్రయత్నం చేయకుండా 'దేవుడా కాపాడు' అంటే ఎలా? మన ప్రయత్నం మనం చేద్దాం. ఆరోగ్యవంతులుగా వుందాం!

పెట్టుబడి లేకుండా ఆదాయం, కష్టపడకుండా ఆరోగ్యం రాదని ఓ మహాకవి అన్నారు. మనకు జలుబు చేసినప్పుడు తుమ్ములొస్తే తిట్టుకుంటాం. 'తుమ్ము' చాలా మంచిదని, తుమ్మొచ్చిన 24 గంటల వరకు హార్టెటాక్/స్ట్రోక్స్ రావని ఇటీవల నా డాక్టర్ మిత్రుడు రఘు చెప్పారు. అంతేకాకుండా తుమ్ముని ఆపుకోవటం మంచిది కాదని చెప్పారు.

మనం బిరియానీలు, పీజాలు తినేస్తుంటాం. అందులో నూనె/నెయ్యి, చీజ్ వంటి పదార్ధాల వల్ల 'బాడీ కొలస్ట్రాల్' పెరిగిపోతుంది. ఉదయాన్నే తేనె, నిమ్మరసం ఒక్క స్పూన్ త్రాగితే దాన్ని కరిగిస్తుందట! స్మోకింగ్ చేసేవాళ్ళని 'మానేయండి' అని చెప్పటం చాలా తేలిక! కానీ ఒకేసారి వాళ్ళు మానలేరు కనుక రోజూ ఒక అరటిపండు తినండి. అలాగే ఒకే ఒక్క సిగరెట్ కొనుక్కోండి. అది అయిపోయాకా, మళ్ళీ త్రాగాలి అనిపించినప్పుడు నడిచి వెళ్ళి వేరోటి తెచ్చుకోండి. దానివల్ల మనకి బద్ధకం పుట్టి స్మోకింగ్ తగ్గుతుంది. నేను అలాగే తగ్గించుకున్నాను. రోజుకు 10 సిగరెట్లు త్రాగే నేను ఇప్పుడు 2 - 3 కి తగ్గించగలిగాను. నా సూత్రాన్ని స్మోకర్స్ పాటించి ఆరోగ్యం కాపాడుకోవలసిందిగా ప్రార్ధిస్తున్నాను.

'ఆరోగ్యం - మహాభాగ్యం' అన్నారు. మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకోవటానికి మన కృషి మనం చేద్దాం.

"సర్వే జనా సుఖినోభవంతు!"

మరిన్ని వ్యాసాలు

విశ్వకర్మ ఎవరు?
విశ్వకర్మ ఎవరు?
- కుందుర్తి నాగబ్రహ్మచార్యులు
Digital fasting
డిజిటల్ ఫాస్టింగ్
- సి.హెచ్.ప్రతాప్
Yuvathalo hrudroga samasyalu
యువతలో హృద్రోగ సమస్యలు
- సి.హెచ్.ప్రతాప్
Social Media lo niyantrana
సోషల్ మీడియాలో నియంత్రణ
- సి.హెచ్.ప్రతాప్
Perugutunna balya neralu
పెరుగుతున్న బాల్య నేరాలు
- సి.హెచ్.ప్రతాప్